Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసహనంపై ఆమీర్ ఖాన్.. తాను తీసుకున్నగోతిలో తానే..!
posted on: Jan 8, 2016 10:43AM

బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ అసహనంపై వ్యాఖ్యాలు చేసి పెద్ద దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమీర్ చేసిన వ్యాఖ్యలపై అందరూ అతనిపై విమర్శల వర్షం కురిపించారు. అయితే ఆతరువాత పరిస్థితి కొంచెం నెమ్మదించిన దాని ప్రభావం మాత్రం అమీర్ ఖాన్ పై అలానే ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆమిర్ పదేళ్ల పాటు ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచార సారథిగా ఉన్న సంగతి తెలిసిందే అయితే అసహనంపై వ్యాఖ్యాలు చేసిన ఆయనకు భారత పర్యాటక శాఖ షాక్ ఇచ్చింది. అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" నుండి ఆయనను తొలగించి ఆస్థానంలో మరో సూపర్ స్టార్ ను రీప్లేస్ చేయనున్నారు. అంతేకాదు అమీర్ చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్రం సీరియస్ గా తీసుకొని అతనిని అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి అతడిని తొలగించిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.
అయితే కేంద్ర పర్యాటక శాఖ మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ఖాన్ కాంట్రాక్ట్ పూర్తయింది అందుకే ఆయన తప్పుకున్నారు అని చెబుతుంది. మరోవైపు "ఇన్‌క్రెడిబుల్ ఇండియా" నుండి తనను తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పాడు. తాను ఉన్నా లేకున్నా భారతదేశం మాత్రం ఎప్పటికీ అద్భుతం అమోఘమైన దేశంగానే ఉంటుందని పేర్కొన్నాడు. అంతకుమించి మాట్లాడితే సీను ఇంకా బ్యాడ్ అవుతుందని ఆయనకు ఇప్పటికే అర్థమైనట్లుంది.
మొత్తానికి ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే అన్నట్టు అసహం ఎఫెక్ట్ ఆమీర్ ఖాన్ పై బాగానే పడినట్టు తెలుస్తోంది. తాను చేసిన వ్యాఖ్యలకు ఇంతలా రియాక్షన్ వస్తుందని అమీర్ ఖాన్ కూడా ఊహించి ఉండడేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాను తీసుకున్న గోతిలో తాను పడినట్టు.. ఇక అమీర్ ఖాన్ భవిష్యత్తులో ఏం మాట్లాడినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.






