Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..!
posted on: Jul 22, 2026 11:05AM
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..!
.webp)
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. శరీరం ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులలో, మూత్రపిండాలు దీనిని వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. అయితే, శరీరం దీనిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు లేదా మూత్రపిండాలు దీనిని సరిగ్గా విసర్జించలేనప్పుడు, ఇది రక్తంలో పేరుకుపోవడం మొదలవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. క్రమంగా, దాని స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయి, నొప్పి, వాపు , గౌట్ వంటి సమస్యలను కలిగిస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, పప్పుధాన్యాలు తినడం మానేయాలని కొందరు చెబుతూ ఉంటారు. అసలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే పప్పు ధాన్యాలు తినడం మానేయాలా? యారిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుంది?
ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోవడం, బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వృద్ధులకు వచ్చే వ్యాధిగా భావించిన ఈ సమస్య, ఇప్పుడు 30 ఏళ్లలోపు యువతలో కూడా బయటపడుతోంది. . కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్ మందులు, మెటబాలిక్ సిండ్రోమ్, కొన్ని రకాల మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి.
యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పప్పు ధాన్యాలు తినకూడదా?
యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే పప్పుధాన్యాలు తినడం మానుకోవాలా అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ పూర్తీగా మానేయడం అవసరం లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పప్పుధాన్యాలు తినడం ఆపాల్సిన అవసరం లేదు. సరైన పప్పుధాన్యాలను ఎంచుకుని, వాటి పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందట. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందట. 8 కంటే ఎక్కువ యూరిక్ యాసిడ ఉంటే, తక్కువ ప్యూరిన్ ఉన్న పప్పు ధాన్యాలు తినడం మంచిది.
పప్పుధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలకు మంచి వనరు. పచ్చ పెసలు యూరిక్ యాసిడ్ ఉన్నవారికి చాలామంచివి. అవి పోషకాలను అందించి, యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వారానికి 3-4 సార్లు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిది.
యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఏవి తినకూడదు?
యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే, సముద్రపు ఆహారం, ఎర్ర మాంసం , మద్యం మొదలైనవి మానేయాలి.
తీపి పానీయాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన పానీయాలు , అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలి.
తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరం.
*రూపశ్రీ.





