Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైస్వాల్ సెంచరీ... భారత్ ఘన విజయం...సిరీస్ కైవసం
posted on: Dec 6, 2025 8:09PM
.webp)
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు సఫారీలు 47.5 ఓవర్లలో 270 రన్స్‌కు ఆలౌటయ్యారు. ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా 39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (116*; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (65*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చేశారు. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
జైస్వాల్, కోహ్లీ అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి భారత్‌కు గెలుపు అందించారు. దక్షిణ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (106; 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం చేయగా.. తెంబా బావుమా (48; 67 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.






