Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్ళీ పెళ్ళి చేసుకున్న స్టెల్లా, యాదమరాజు!
posted on: Sep 4, 2023 2:15PM

అవును వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. నిజమే.. స్టెల్లా, యాదమరాజు ఇప్పటికే భార్యభర్తలు. కాగా వాళ్ళిద్దరు తమ మ్యారేజ్ ని అఫీసియల్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళారంట. అక్కడ వారిద్దరికి మెడలో దండలు వేసి కొన్ని ఫోటోలని తీసుకొని, ఇద్దరివి వేలిముద్రలు తీసుకొని రిజిస్ట్రేషన్ పూర్తిచేసారంట అక్కడి అధికారులు. స్టెల్లా, యాదమరాజులది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుందని, వారు పట్టుచీర, పట్టుపంచెలతో వచ్చి, అక్కడ దండలు మార్చుకోవాలని, స్వీట్స్ తేవాలని, ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారని ఆ అధికారులు చెప్పారంట. ఎప్పుడో ఒక నెల క్రితం స్లాట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు రమ్మని కాల్ చేశారంట వాళ్ళు. కాగా ఇదంతా ఒక వ్లాగ్ చేసి వివరించారు స్టెల్లా, యాదమరాజు దంపతులు.
యాదమరాజు, అతని భార్య స్టెల్లా.. ట్రెండింగ్ లో ఉన్న కొత్తజంట. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో యాదమరాజు ఒకడు. యాదమరాజు కామెడీ టైమింగ్ తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాదు పటాస్ షో లో తన పంచ్ లతో అప్పట్లో నవ్వులు పూయించాడు. దాంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ లోని అన్ని టీమ్స్ లో ఒక కంటెస్టెంట్ గా చేసిన యాదమరాజు తాజాగా కొత్త టిమ్ తో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాదమరాజు, స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అప్పటి నుండి స్టెల్లాతో కలిసి వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఏ ఈవెంట్ కి వెళ్ళినా, ఏ టూర్ కి వెళ్ళిన వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్ ' స్టెల్లారాజ్ 777' లో ఇద్దరు కలిసి అప్లోడ్ చేస్తున్నారు. అమెరికాలో జాబ్ చేసి వచ్చిన స్టెల్లా, యాదమరాజుని ప్రేమించి పెళ్ళిచేసుకుంది. వీళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో హిలేరియస్ స్కిట్లు చేశారు. తమ యూట్యూబ్ ఛానెల్ ఇప్పటికే ఎనిమిది లక్షల మంది సబ్ స్కైబర్స్ కలిగి ఉంది. కాగా వీళ్ళు చేసిన వ్లాగ్స్ అన్నీ దాదాపు లక్షకు పైగా వ్యూస్ వస్తున్నాయి.
పెళ్ళి అయిన కొత్తల్లో అత్తగారింట్లో, మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్, లాస్ట్ డే ఇన్ ఇండియా, హోమ్ టూర్ ఇలా పాపులర్ అయిన వ్లాగ్స్ చాలానే ఉన్నాయి. అయితే కొన్ని వారాల క్రితం యాదమరాజుకి యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఎలా జరిగింది? యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉన్నాడో చెప్తూ 'మా ఆయన యాక్సిడెంట్ తర్వాత ఎలా అయ్యాడంటే' అనే వ్లాగ్ చేసి తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది స్టెల్లా. అయితే తాజాగా పెళ్ళి అయిన తర్వాత నా ఫస్ట్ రాఖీ పండుగ అనే వ్లాగ్ చేయగా అది వైరల్ అయింది. ఇప్పుడేమో ' ఇందుకే మళ్ళీ పెళ్ళిచేసుకున్నాము' అనే వ్లాగ్ ని తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.






