Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."సై అంటే సై.. నై అంటే నై".. బాలకృష్ణ మీసం మెలేశారు!
posted on: Oct 27, 2021 6:24PM

''నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు... నీకు లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు... నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు... నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు" అని నటసింహం నందమూరి బాలకృష్ణ అంటున్నారు. 'ఆహా' ఓటీటీ వేదిక కోసం సఅన్‌స్టాపబుల్' పేరుతో ఆయన ఒక టాక్ షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు దాని ప్రోమో రిలీజయింది. అందులో బాలకృష్ణ బైక్ రైడ్ చేస్తూ... హై ఎండ్ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తూ... గుర్రపు స్వారీ చేస్తూ స్టయిలిష్ గా కనిపించారు.
"మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలో స్టాప్ ఉండదు. సై అంటే సై... నై అంటే నై" అంటూ బాలకృష్ణ మీసం మెలేశారు. షో మీద అంచనాలు పెంచేశారు. 'వన్ ఐ స్టెప్ ఇన్...' అంటూ డైలాగ్ చెప్పారు. హిస్టరీ రిపీట్ అని ప్రత్యేకంగా ముగించాల్సిన అవసరం లేదనుకుంట! 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా... కలుద్దాం... ఆహాలో' అని ప్రోమో ముగించారు.
బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీ సందడి చేయనుంది. మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు, కుమార్తె లక్ష్మీ మంచు పాల్గొనగా ఇటీవల ఎపిసోడ్ షూటింగ్ చేశారు. మనోజ్ కూడా వచ్చినట్టు టాక్. త్వరలో టాక్ షో స్టార్ట్ కానుంది.






