Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కామారెడ్డి ఘటనలో ముగ్గురు దుర్మరణానికి కారణం ఇదే...
posted on: Dec 28, 2024 3:50PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువులో ముగ్గురు దుర్మరణానికి మిస్టరీ వీడింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , ఎస్ఐ సాయికుమార్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మాట్లాడుకోవడానికి వీరు చెరువు వద్దకు చేరుకున్నారు. ముగ్గురి మధ్య మాటామాటా పెరగడంతో శృతి చెరువులోకి దూకేసింది. ఆమెను కాపాడటానికి నిఖిల్ దూకేసాడు. వీరిద్దరికి ఈత రాదు. వీరిని కాపాడటానికి ఎస్ ఐ సాయికుమార్ చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో సాయికుమార్ నీటిలో మునిగిపోయాడు. శృతి ఆత్మహత్య చేసుకుంటే నిఖిల్ , సాయికుమార్ రక్షించే క్రమంలో మునిగిపోయారు.






