Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వేసవికాలంలో శరీరం చల్లగా శక్తివంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు.
posted on: Apr 18, 2025 9:30AM

వేసవికాలంలో శరీరం చల్లగా శక్తివంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే వేసవి వేడి దెబ్బకు చాలా తొందరగా నీరసం వస్తుంది. అదే విధంగా ఎంత చల్లగా ఉన్న పానీయాలు తాగితే కొద్దిసేపు మాత్రమే శరీరానికి ఊరట లభిస్తుంది. అదే శరీరానికి రోజంతా మంచి శక్తిని ఇస్తూ మరొకవైపు శరీరాన్ని చల్లగా ఉంచే పానీయం తాగితే భలే ఉంటుంది. ఇలాంటి పానీయాల కోవకు చెందినదే సత్తు పానీయం. ఇది ప్రధానంగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఫేమస్ పానీయం. అయినా సరే దీని శక్తి, దీని ప్రయోజనాలు తెలిసి దేశ వ్యాప్తంగా విస్తృతంగా తాగుతారు. బయట మార్కెట్లో కూడా సత్తు పొడి లభిస్తుంది. కానీ ఇందులో కల్తీ ఉండవచ్చు. అందుకే ఇంట్లోనే సత్తు పొడిని ఈజీగా చేసుకుని తాగవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..
కావలసిన పదార్థాలు..
వేయించిన శనగపప్పు( లేదా సాధారణ శనగపప్పు).. 500గ్రాములు.
బార్లీ.. 500 గ్రాములు.
వాము.. 1 టీస్పూన్
నల్ల ఉప్పు.. 1 టీస్పూన్.
తయారు విధానం..
సాధారణ శనగపప్పును తీసుకుని బాగా కడగాలి. కడిగిన శనగపప్పును 2 గంటల సేపు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటి నుండి తీసివేసి శుభ్రమైన గుడ్డ మీద తడి పోయేవరకు ఆరబెట్టాలి. తేమ పోయిన తరువాత ఈ శనగలను ఒక పాన్ లో వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. ఇవి మాడిపోకుండా జాగ్రత్త పడాలి. వేయించిన శనగలను చల్లారిన తరువాత మిక్సీ లో పిండి పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వద్దు చేయలేము అనుకుంటే మార్కెట్ లో దొరికే వేయించిన శనగపప్పు ను తీసుకుని పిండి చేసుకోవచ్చు. ఈ పిండిలోనే వాము, నల్ల ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
బార్లీ గింజలను కూడా బాగా వేయించి వాటిని పొడి చేసుకుని సత్తు పొడిలో మిక్స్ చేసుకోవాలి. ఈ సత్తు పొడిని ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకునే ఈ సత్తు పొడి 2-3 నెలలు సులభంగా ఉపయోగించవచ్చు. దీన్ని కేవలం సత్తు పానీయంలోకి మాత్రమే కాకుండా.. సత్తు షర్బత్, పరాఠాలు, సమోసా వంటి వాటిలో స్ఠఫింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ వేసవి కాలంలో సత్తు పానీయాన్ని తాగి బయటకు వెళితే శరీరానికి వడదెబ్బ తగలకుండా రక్షణగా ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






