Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా
posted on: May 6, 2025 3:40PM
.webp)
రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసి సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్‌లో ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కమిటీ చర్చలు జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.






