సెంచరీ కొడతానంటున్న ఆర్కే నాయుడు..!

posted on: Feb 2, 2024 9:30AM

ఆర్కే నాయుడుగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన సాగర్‌.. 'సిద్ధార్థ' అనే సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయ్యాడు. 'షాదీ ముబారక్‌' సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సాగర్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

సాగర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ద 100'. ఈ సినిమాకు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. గతంలో దర్శకుడు శశిధర్ డైరెక్ట్ చేసిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కు పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు 'ద 100' సినిమాతో ఆయన దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

''ద 100''లో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం సాగర్ ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ లోగోలో పంచింగ్ హ్యాండ్ ని గమనిస్తే.. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మంచి యాక్షన్ తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ అని, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. 

ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. 'అర్జున్ రెడ్డి', 'యనిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకున్న 'ద 100' చిత్రం త్వరలో థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...