Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సముద్రంలో రామసేతు వుంది.. ఇస్రో!
posted on: Jul 15, 2024 5:44PM
ఇండియా శ్రీలంక మధ్య రామసేతు వంతెన కల్పితం కాదని, అక్కడ వంతెన నిర్మించిన మాట వాస్తవమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఇన్శాట్-2 డేటాను వినియోగించి ఈ విషయాన్ని కనుగొన్నారు. తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ని విడుదల చేశారు. ఇండియా, శ్రీలంక దేశాల మధ్య వుండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు వుందని, దీని ఎత్తు సముద్రంలో 8 మీటర్లు వుందని తెలిపారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ఆగ్నేయ దిక్కులో వున్న ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపం, తలై మన్నారు వరకు విస్తరించి వుందని తెలిపారు. ఈ వంతెనను సున్నపురాతితో నిర్మించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలోనే మునిగి వుందని వెల్లడించారు.


.webp)
.webp)


