దీపావళి రోజున సూపర్‌స్టార్‌ మన ఇంటికి వస్తాడట!

posted on: Oct 27, 2023 2:16PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో కళానిధి మారన్‌ నిర్మించిన ‘జైలర్‌’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో, ఎన్ని వందల కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. రజనీకాంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి స్పెషల్‌ అప్లాజ్‌ వచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలై అక్కడ కూడా రికార్డులు క్రియేట్‌ చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘జైలర్‌’ స్ట్రీమ్‌ అవుతోంది. 

థియేటర్స్‌లో, ఓటీటీలో తన పవర్‌ ఏంటో చూపించిన రజనీకాంత్‌ ఇప్పుడు టి.వి. ఛానల్‌ ద్వారా మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించబడిరది. కాబట్టి శాటిలైట్‌ రైట్స్‌ కూడా సన్‌ పిక్చర్స్‌తోనే ఉంటాయి. దీంతో ఈ సినిమాను సన్‌ నెట్‌వర్క్‌ ద్వారానే ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ్‌, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాను దీపావళి రోజున టి.వి.లో ప్రసారం చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. తెలుగు వారికి సంక్రాంతిలాగే తమిళియన్స్‌కి దీపావళి పెద్ద పండగ. ఈ పండగను ‘జైలర్‌’తో సెలబ్రేట్‌ చేసుకోవాలని సన్‌ నెట్‌వర్క్‌ ఈ ఏర్పాటు చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...