Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఎందుకంటే?
posted on: Jun 6, 2025 4:44PM
.webp)
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పరువు నష్టం కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు.
కాగా తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాల్సిందిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. తీర్పు కేటీఆర్‌కు అనుకూలంగా ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్‌కు నేడు దేశంలోని అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.



.webp)


