Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని" సీరియల్ హీరో ఎవరో తెలుసా ?
posted on: May 4, 2023 5:01PM

శాండల్ వుడ్ స్టైలిష్ టీవీ యాక్టర్ విజయ్ సూర్య స్టార్ మాలో త్వరలో ప్రసారం కాబోతున్న "కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని" అనే సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు. విజయ్ సూర్య కన్నడలో అటు మూవీ ఇండస్ట్రీలోనే, ఇటు బుల్లితెర చరిత్రలో కూడా తన నటనతో రాణిస్తున్నాడు. 2012 లో వచ్చిన రవిచంద్రన్ మూవీ "క్రేజీ లోక" లో కనిపించాడు. అలాగే ఈటీవీ కన్నడలో ప్రసారమైన సీరియల్ "అగ్నిసాక్షి"లో సిద్ధార్థగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే అతను బెంగళూరులో పుట్టి పెరిగాడు. అతని తండ్రి నాగరాజ్, తల్లి లలితాంబ. అతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. పేరు రవి సూర్య . దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. సూర్య తన స్కూలింగ్ ని క్లారెన్స్ పబ్లిక్ స్కూల్‌లో, కాలేజీ ఎడ్యుకేషన్ ని బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు. సుభాష్ ఘయ్ కి చెందిన విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్‌లో చేసి యాక్టింగ్ కోర్స్ లో డిగ్రీ సంపాదించాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తన కెరీర్ ని స్టార్ట్ చేసాడు విజయ్.
ఆరతి కడవ్ రూపొందించిన "ఉస్స్ పార్" అనే షార్ట్ ఫిలింలో జాకీ ష్రాఫ్‌తో కలిసి నటించాడు. అతను మంచి ఫుడీ..అందులోనూ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతాడు. బంగారుపేట పానీ పూరీ అంటే ఇంకా ఇష్టం. విజయ్ తన ఫామిలీ ఫ్రెండ్, ఐటీ ప్రొఫెషనల్ ఐన చైత్రని 2019 ఫిబ్రవరి 14 న పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు సోహన్ అనే బాబు కూడా ఉన్నాడు. 2016 లో డాక్టర్ నాగతిహళ్లి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన "ఇష్టకామ్య" అనే రొమాంటిక్ కామెడీ మూవీలో నటించాడు. 1980s దొడ్డేరి వేంకటగిరిరావు రాసిన నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఆగస్ట్ 2016లో కార్తీక్ జయరామ్, సంయుక్త హోర్నాడ్ తో కలిసి "స" అనే మూవీలో, 2019లో "కద్దు ముచ్చి" అనే మూవీలో యాక్ట్ చేసాడు. సృజన్ లోకేష్- రచితా రామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కామెడీ షో "కామెడీ టాకీస్"కి విజయ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. జూలై 2019-అక్టోబర్ 2020 వరకు "ప్రేమలోక" అనే సీరియల్ లో తర్వాత 2020 - 2021 వరకు జోతేజోతియెల్లి సీరియల్ నటించాడు. ఇప్పుడు "నమ్మా లచ్చి" అనే కన్నడ సీరియల్ లో నటిస్తున్నాడు. దాంతో పాటు తెలుగులో "కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ" అంటూ ఆడియన్స్ ని పలకరించడానికి త్వరలోనే రాబోతున్నాడు.



.webp)


