Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
posted on: Jan 23, 2026 10:11AM

నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ వరుసకు బావాబావమరుదులు అవుతారనే విషయం తెలిసిందే. రాజకీయాలతో లోకేష్, సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో ఇద్దరూ కలిసే సందర్భాలు చాలా తక్కువే. అయితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు ఖచ్చితంగా విష్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే శుక్రవారం (జనవరి 23) లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ విష్ చేశాడు.
లోకేష్, ఎన్టీఆర్ ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. 1983 జనవరి 23న లోకేష్ జన్మించగా, 1983 మే 20న ఎన్టీఆర్ జన్మించాడు. నెలల తేడాతోనే పుట్టినరోజులు ఉండటంతో.. కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా వీరిరువురూ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
"జన్మదిన శుభాకాంక్షలు లోకేష్. ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను" అంటూ లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దీంతో నందమూరి, నారా అభిమానులు ఆనందంతో ఆ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.
మరో నాలుగు నెలల్లో అనగా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో.. ఆ రోజు లోకేష్ ట్వీట్ చేస్తారనడంలో సందేహం లేదు. గతేడాది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపాడు.






