Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్
posted on: Jan 7, 2026 8:05PM
.webp)
హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
కల్తీ నిరోధానికి పోలీస్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠినంగా ఎస్‌వోపీ అమలు చేస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి పాల్పడే వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.






