Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెరువుల్లో భవనాలు.. అధికారుల మీద కేసులు..!
posted on: Aug 31, 2024 4:04PM
హైదరాబాద్ నగరంలో చెరువుల్లో అక్రమ కట్టడాలు నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఆరుగురు అధికారుల మీద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూల్చివేతలు చేపడుతూ సంచలనం సృష్టిస్తున్న హైడ్రా ఫిర్యాదు మేరకు ఈ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి తహశీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్ - మల్కాజిగిరి లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్?పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. శనివారం నాడు కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి.






