మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌

posted on: Jan 28, 2026 8:29PM

 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు..ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.. నెలాఖరుకు స్వదేశానికి తిరిగి వస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 4న కరీంనగర్‌ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. 

తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 13న ఫలితాలను వెల్లడించనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో 382 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, 258 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, 169 మంది బీజేపీ అభ్యర్థులు ఉన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...