Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా..ఎందుకంటే?
posted on: Jun 14, 2025 9:03PM
.webp)
రేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. రేపు షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. షూటింగ్‌ల కారణంగా పలువురు ఇతర ప్రాంతాల్లో ఉండటం, ముఖ్యమైన పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్టు సమాచారం.
షూటింగ్స్ కారణంగా కొంతమంది సినీ పెద్దలు రేపు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా వేశారు. మళ్లీ తిరిగి భేటీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా, థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు నిర్ణయించారు.


.webp)
.webp)


