Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దివ్యాంగులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
posted on: Dec 3, 2025 8:38PM

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఏడు వరాలు ప్రకటించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.
శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ప్రీ ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని తెలిపారు. అమరావతిలో దివ్యాంగ భవన్ నిర్మిస్తామని తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.






