Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారు
posted on: Oct 1, 2025 7:18PM
.webp)
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటన ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
సీఎం వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్‌లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. స్థిరాస్తి, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించనున్నారని అధికారులు పేర్కొన్నారు.






