Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు సర్కారు మరో రికార్డు
posted on: Aug 12, 2025 2:51PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు మరో రికార్డు సృష్టించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది. జగన్ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగంతో జస్టిస్ ఇండియా ర్యాంకింగ్‌లో ఆయన హయాంలో రాష్ట్రం దిగువకు పడిపోయింది . 2019 నుంచి 2024 వరకు ఏపీ ర్యాంకింగ్ దిగజారుతూనే వచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో చట్టబద్ద పాలన తిరిగి వచ్చిందని ఇండియా జస్టిస్ రిపోర్టు వెల్లడించింది . పోలీసింగ్‌తో పాటు న్యాయ సహకారాన్ని అందించటంలో సైతం ఏపీ పనితీరు బాగా మెరుగైనట్లుగా స్పష్టం చేసింది.
ఏపీలో శాంతిభద్రతలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ఈ ర్యాంకింగ్ కేటాయించింది. ఇండియా జస్టిస్ రిపోర్టులో 6.78 స్కోర్‌తో మొదటిస్థానంలో కర్ణాటక నిలిస్తే.. 6.32 స్కోర్‌తో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సరైన నిర్వహణను కఠినంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నది.


.webp)



