Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ లో బాలివుడ్ నటిపై అత్యాచార యత్నం.. పరారీలో నిందితులు
posted on: Mar 24, 2025 2:04PM
హైద్రాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. మాసాబ్ ట్యాంక్ శ్యామలా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో చోటు చేసుకున్నఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓ షాప్ ఓపెనింగ్ కోసం సదరు బాలివుడ్ నటిని నిర్వాహకులు ఆహ్వానించారు. ప్లైట్ చార్జిలు, రెమ్యునరేషన్ మాట్లాడుకున్న నటి బస చేయడానికి అపార్ట్ మెంట్ లోని ఓ గదిని కేటాయించారు. అపార్ట్ మెంట్ కు శుక్రవారం (మార్చి 21) రాత్రి గుర్తు తెలియని యువకులు వచ్చారు. వారి వెంట ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు యువకులతో వ్యభిచారం చేయమని ఆ మహిళలు ఒత్తిడి తెచ్చారు. నటి ప్రతిఘటించినప్పటికీ యువకులు కాళ్లు , చేతులు తాళ్లతో కట్టేసి అత్యాచారయత్నం చేశారు. దీంతో నటి పెద్దగా అరవడంతో యువకులు నటి దగ్గర ఉన్న 50 వేల నగదు తీసుకుని పారిపోయారు. ఈ వర్దమాన నటి పలుబాలివుడ్ చిత్రాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తుంది . అపార్ట్ మెంట్ నుంచి ఎలాగో అలా బయటపడ్డ నటి 100 కు డయల్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


.webp)
.webp)


