Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్లాస్ రూంలో టీచర్ పై కిరోసిన్ పోసి అంటించాడు...
posted on: Aug 17, 2017 4:55PM
.jpg)
పాఠాలు చెప్పే టీచర్ నే కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. దీంతో విద్యార్ధులంతా షాక్ కు గురయ్యారు. ఈ దారుణమైన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... బెంగుళూరుకు 55 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సునంద అనే మహిళ టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఆమె స్కూల్ కు వెళ్లి.. పాఠాలు చెబుతుండగా.. ఓ వ్యక్తి వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. టీచర్ మంటల్లో కాలిపోతూ కేకలేయడాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. మరికొంత మంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థుల అరుపులు విని ఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చిన ఇతర టీచర్లు, స్థానికులు ఆ టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే టీచర్ పై దాడికి పాల్పడింది... ఆమె బిజినెస్ పాట్నర్ ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె 50 శాతం కాలిన గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.






