Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అహ్మదాబాద్ విమాన ప్రమాదం..దొరికిన బ్లాక్ బాక్స్
posted on: Jun 13, 2025 4:43PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ డీవీఆర్ లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు. ‘ఇది ఒక డీవీఆర్. దీనిని మేం శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం ఇక్కడికి వస్తుంది’ అని ఏటీఎస్ అధికారి మీడియాతో అన్నారు. అయితే విమాన శిథిలాల్లో లభించిన డిజిటల్ వీడియో రికార్డర్ డీవీఆర్‌ను పరిశీలించిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం గురించి కొంత సమాచారం తెలిసే అవకాశమున్నది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది. అయితే విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో.. 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు . మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో మరో నలుగురు నేడు ప్రాణాలు విడిచారు. కాగా మరికొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న ఘటన జరిగినప్పటి నుంచి మరో మెడికో కనబడకుండా పోయారని అధికారులు పేర్కొన్నారు. 24 గంటలుగా ఆ విద్యార్థి ఆచూకీ లేదని, శిథిలాల కింద మరోసారి గాలిస్తామని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మెడీకోలతోసహ ఇప్పటి వరకు 269 మంది చనిపోయాన సంగతి తెలిసిందే.


.webp)



