Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జనసేన మహిళా నేతకు యాక్సిడెంట్
posted on: May 2, 2024 11:05AM
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. రాయపాటి అరుణ ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం దగ్గర డివైడర్నీ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాయపాటి అరుణతోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన రాయపాటి అరుణ రెండేళ్ళ క్రితం జనసేన పార్టీలో చేరారు. పార్టీలో ఆమె చురుకుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య స్థితిపై స్పష్టత రావాల్సి వుంది.


.webp)



