Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహేష్ 'అతిథి'కి 15 ఏళ్ళు!
posted on: Oct 18, 2022 12:26PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కొన్ని ప్లాప్ సినిమాలకు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాటిలో 'అతిథి' ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007 అక్టోబర్ 18న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తయింది. 2006లో 'పోకిరి'తో ఇండస్ట్రీ హిట్ అందుకొని సంచలనం సృష్టించిన మహేష్.. ఆ తర్వాత వచ్చిన 'సైనికుడు'తో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో 'అతిథి'పైనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంది.
'అతిథి'లో లాంగ్ హెయిర్ తో మహేష్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అప్పట్లో అది ట్రెండ్. ఇక ఈ చిత్రంలో కామెడీ, యాక్షన్, లవ్ సీన్స్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోకిరి క్లైమాక్స్ లో మహేష్ పోలీస్ అనే ట్విస్ట్ ఎలా ఉంటుందో.. ఇందులో విలన్ కైజర్ ట్విస్ట్ కూడా అలాగే ఉంటుంది. అయితే కథా కథనాల్లో ఉన్న కొన్ని లోపల కారణంగా ఈ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేష్ సోదరుడు రమేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అమృతారావు హీరోయిన్ గా నటించగా మురళీ శర్మ, ఆశీష్ విద్యార్ధి, కోట శ్రీనివాసరావు, నాజర్, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల, వేణుమాధవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మలైకా అరోరా ప్రత్యేక గీతంలో అలరించింది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆరు పాటలున్నాయి. అందులో 'ఖబడ్దారనీ', 'సత్యం ఏమిటో', 'రాత్రైనా ఓకే, పగలైనా ఓకే', 'వల్లా వల్లా' వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి, ఎడిటర్ గా గౌతం రాజు వ్యవహరించారు.






