Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పీఎ అరెస్ట్
posted on: Jul 23, 2025 7:17PM

కుత్భుల్లాపుర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పీఎ హరిబాబును అరెస్ట్ చేశామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. డబుల్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి రూ. లక్షలు వసూల్ చేశాడని బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. హరిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
కుత్బుల్లాపూర్ గిరినగర్ కు చెందిన తైలం రమేశ్డబుల్బెడ్ రూమ్ ఇంటి కోసం ఎమ్మెల్యే ఆఫీస్కు వెళ్లాడు. పీఏ హరిబాబు అతనికి ఇల్లు ఇప్పిస్తానని నమ్మంచి, రూ.లక్ష తీసుకున్నాడు. తర్వాత మరోసారి ఎమ్మెల్యే ఆఫీస్కు వెళ్లగా హరిబాబు మరో 83 మంది వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేసి, ఆ డబ్బులతో భూమిరెడ్డి నగర్ లో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిసింది. డబ్బుల గురించి అడగడానికి రమేశ్ ప్రయత్నించినా అతను స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి, ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద, ఆయన అనుచరులు చేసిన అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం ఎంక్వైరీ జరిపించాలని బీజేపీ జిల్లా స్పోక్స్ పర్సన్ నల్లా జయశంకర్డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ భూముల కబ్జా, చెరువుల ఆక్రమణలు, దొంగ రిజిస్ట్రేషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారని వారు ఆరోపించారు.


.webp)



