అలోపతి వైద్యంలో జరుగుతున్నా తప్పిదములు పార్ట్ - 1

 

అతి మందశ్వాస లో బి.పి. గా పరిగణిస్తుంది. అతి తీవ్రశ్వాస హై. బి.పి. గా పరిణమిస్తుంది. ఇది మామూలు మనిషికి వర్తిస్తుంది, ధ్యానములో చెప్పే తీవ్రశ్వాస పై రెండు బి.పి. లను తగ్గిస్తుంది. శిశువు గర్భస్తుడైన క్షణము నుండి ప్రాణము పని చేయడం ప్రారంభిస్తుంది. ప్రాణము చలనముగా, గురుత్వాకర్షణ శక్తిగా, అయస్కాంత శక్తిగా, విద్యుచ్ఛక్తిగా వ్యక్తమవుతుంది. నాడీ ప్రవాహములు, సంకల్పశక్తి (Thought) ప్రాణము తాలూకు వ్యక్త స్వరూపములు. ప్రాణము వలన అగ్ని దహించును. వాయువు వీచును. నదులు ప్రవహించును. రేడియో తరంగములు పయనించును. అన్నము, నీరు, గాలి, సూర్యశక్తిచే ప్రాణము సపఫరా చేయబడుచున్నది. ప్రాణశక్తి వలన ఇంద్రియములు తన పనులను చేస్తుంది, ప్రాణము ఉచ్చ్వాస, నిశ్చ్వాసములను సల్పును. ప్రాణము - ఆలోచించుట సంకల్పించుట పని చేయడం, సంచరించుట, మాట్లాడుట మున్నగు వాని ద్వారా ఖర్చువుతుంది.

 

అధిక సంభోగము వలన ప్రాణము వ్యర్థమవుతోంది. బ్రహ్మచర్యము ద్వారా ప్రాణమును పదిల పరుచుకొని, దానిని ధ్యానమున వినియోగించిన ఒజశ్శక్తి పెరుగుతుంది. అధికమైన ప్రాణము మెదడు నందు, నాడి కేంద్రములందు నిలువవుతుంది. ప్రాణాయామము అభ్యసించుట వలన కావలసినంత ప్రాణశక్తిని నిలువ చేసుకోవచ్చు. ప్రాణము యొక్క ఆదాయ, వ్యయ విషయమున జాగ్రత్తగా వుండి ప్రాణమును పదిలపరుచుకోవాలి. వ్యాయామము ప్రాణమును బయటకు పంపుతుంది. ఆసనములు ప్రాణమును లోనికి పంపుతుంది. సమృద్ధముగా ప్రాణశక్తి గలవాడు ప్రపంచమునంతటినీ కదిలించగలడు. ప్రాణమును గురించి పైన వ్రాసిన వివరములు తెలుసుకొన్నట్లయితే సూక్ష్మ దేహములోని భాగమైన ప్రాణశక్తిని అధికముగా పెంచుకొని తద్వారా స్థూల దేహమునకు సంబంధించిన వ్యాధులు నయము చేసుకొని సంపూర్ణ ఆరోగ్యముతో జీవించవచ్చు.

 

ఆపః పీతాస్త్రేధా విధీయన్తే తాసాం యః స్థవిష్ ఠో ధాతుస్తన్మూత్రం

భవతి యో మధ్యమస్తల్లోహితం యోణిష్ఠః స ప్రాణః

ఛాందోగ్య ఉపనిషత్తు (6-5-2)

 

అర్థము: మనం త్రాగిన నీరు మూడు విధాలుగా విభజింపబడుతుంది. నీటిలో ఉండే స్థూల భాగం (స్థూల ధాతువు) మనం విసర్జించే మూత్రము. మధ్య భాగంగా ఉండే ధాతువు రక్తం అవుతోంది. సూక్ష్మధాతువు ప్రాణం అవుతోంది. జాలం ప్రాణానికి ఆధారమని తెలుస్తోంది.

 

ప్రాణశక్తిని పెంచుకొనేందుకు నీరు ఎంత ఉపయోగమో పై శ్లోకమును బట్టి తెలుస్తుంది. మంచి నీరు రోజులో 5 లీటర్ల వరకు త్రాగిన మంచి ఆరోగ్యము, మంచి ప్రాణశక్తి వస్తుంది. ఇంకను వివరములు కావలసిన వారు నన్ను సంప్రదించగలరు.

 

శరీరము - దాని భాగములు: కారణ శరీరము - చెట్టుకు విత్తనములాగా శరీరమునకు ఇది విత్తనము లాంటిది. మానవశరీరము - స్థూల శరీరము- పంచభూతములతో కూడిన కనబడే శరీరము

1. భూమి, అంశ – ఎముకలు, చర్మము, నరములు, రోమములు, మాంసముతో కూడిన అవయవములు

2. నీరు అంశ – లాలాజలం, మూత్రం, కఫము, రక్తము, శుక్లము, చెమట మజ్జ

3. అగ్ని అంశ – ఆకలి, దప్పిక, నిద్ర మోహము, మైధునము, సంభోగము

4. వాయు అంశ- నడచుట, కదలట, పోవుట, వ్రాయుట, కనురెప్ప కదలికలు

5. ఆకాశము అంశ- శబ్దము, చింత, శోకము శూన్యత, సంశయము

సూక్ష్మ శరీరము - 18 తత్వములతో కూడిన కంటికి కనబడని శరీరము

పంచ ప్రాణములు 1. ప్రాణము 2. అపానము 3. ఉదానము 4. సమానము 5. వ్యాసము

సూక్ష్మ పంచ జ్ఞానేంద్రియములు 6. చెవులు 7. కళ్ళు 8. నాలుక 9. ముక్కు 10. చర్మము సూక్ష్మ

పంచ కర్మేంద్రియములు 11. నాలుక 12. చేతులు 13. కాళ్ళు 14. మలవిసర్జన అంగం 15. మర్మావయవము 16. మనస్సు 17. బుద్ధి

గరుణ పురాణములో శరీరము గురించి, పుట్టుక గురించి విపులంగా ఉంది. కారణ శరీరము - స్థూల, సూక్ష్మ శరీరములకు విత్తనముగా ఉంటుంది. ఉదా|| మఱ్ఱి చెట్టుకు మూలం, మఱ్ఱి విత్తనం కదా. కనబడని సూక్ష్మ శరీరము, స్థూల శరీరములో వ్యాపించి సకల కార్యములను చేస్తుంది, దీని మధ్యన జీవాత్మ ఉంటుంది. మరణ సమయంలో ప్రాణము సూక్ష్మ శరీరమును స్థూల శరీరము నుండి వేరు చేస్తుంది. జీవుడు, సూక్ష్మ శరీరముతో గగన మార్గంలో వెళ్లును. మరల జన్మ ఎత్తు సమయమున వారు వారు చేసిన పుణ్య పాప కర్మలకు తగినట్లుగా, తల్లి సంతానముతో ఉన్నప్పుడు, 7వ మాసమున జీవుడు, సూక్ష్మ శరీరముతో కలిసి, తల్లి పీల్చు శ్వాస ద్వారా లోపలికి వెళ్లి, తల్లి గర్భములో స్థూల శరీరముతో ఉన్న శిశువు యొక్క హృదయ కమలములో చేరును. (తల్లి యోని ద్వారా జీవుడు వెళ్ళడు). జీవుడు, శిశు హృదయ కమలములో చేరిన వెంటనే శిశువు తలక్రిందులుగా తిరుగును, శిశువు తిరుగునది తల్లికి బాగుగా తెలుస్తుంది.

 

సూక్ష్మ ఇంద్రియము గురించి ఉదాహరణ – కంటి యొక్క సూక్ష్మ ఇంద్రియము - కన్ను బైటకు కనబడుచున్న అవయవము. కంటికి - మెదడుకు మధ్యన Optic Nerve అనే సన్నని నరము కలుపుచున్నది, ఈ నరము మార్గముగా సూక్ష్మ ఇంద్రియము పోతుంది. వస్తువును చూసేది కన్ను. ఈ వస్తూ విషయ వివరము సూక్షమైన ప్రాణశక్తిగా (దీనినే సూక్ష్మ ఇంద్రియము అనవచ్చు.) Optic Nerve ద్వారా మెదడులోని కాంతిని నియంత్రించే చిన్న భాగము (Brain Center for Eye) వద్దకు వెళ్ళుతుంది. మనస్సు వీటితో కలిసినప్పుడు మాత్రమే ఆ వస్తువును చూడగలుగుతాము. మనస్సు వీటిలో కలవనప్పుడు ఆ వస్తువును కన్ను చూస్తున్న మనకు ఆ వస్తువు కనబడదు. దీనిని బట్టి ఒక వస్తువును కంటితో చూడాలంటే - స్థూల అవయవములైన కన్ను. దాని వెనుక వున్న నరము, మెదడు - వీటిలోని సూక్ష్మమైన ప్రాణశక్తి, (సూక్ష్మ కంటి జ్ఞానేంద్రియము) మనస్సు అన్నీ కలిసి పని చేయాలి. ప్రాణము, మనస్సు, బుద్ధి - వివరాలు (Separate Articles గా ఉన్నాయి.

 

ప్రశ్న: పైన వ్రాసిన శరీరము గురించిన వివరములు తెలుసుకున్నందు వలన మనకు కలిగే మేలు ఏమిటి?

జవాబు: ప్రస్తుతం అలోపతి వైద్య శాస్త్రములో స్థూల శరీరమునకు మాత్రమే వైద్యము జరుగుతుంది. స్థూల శరీరాన్ని ఏర్పరచి, పెంచి పోషిస్తున్న సూక్ష్మ శరీరానికి వైద్యము అందుబాటులో లేదు. సూక్ష్మ ఇంద్రియములను, ప్రాణమునకు, మనస్సునకు వైద్యము చేయడం చాలా ముఖ్యము. ఈ వైద్యమునకు ఖర్చు లేకుండా శ్వాస నియంత్రణ (ప్రాణాయామము) ధ్యానము ద్వారా వైద్యము వేదములలో చెప్పారు. రోజులో అరగంట మన ఆరోగ్యమునకు కేటాయించగలిగితే సూక్ష్మ శరీరమునకు వైద్యము మనకు మనమే చేసుకోగాలుగుతాము. స్థూల ,సూక్ష్మ శరీరములలోని వ్యాధులను తీసివేసి సంపూర్బ ఆరోగ్యమును పొందగలము. దీర్ఘ వ్యాదులైన షుగర్, కీళ్ళ నొప్పులు, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు అధిక బరువు వున్న వారు కావలసిన వివరములు, సలహాకు ఫోన్ ద్వారా సంప్రదించగలరు. ఈ వ్యాసములో ఏదయిన పొరపాటు ఉన్నా, యింకా మంచి విషయము చేర్చాలన్నా పెద్దల సలహాలు సహృదయంతో స్వీకరిస్తాను.

 

ఆధునిక ప్రపంచం అలోపతి వైద్యము ద్వారా స్థూల శరీరమునకు మాత్రమే వైద్యము జరుగుతుంది. సూక్ష్మ శరీరానికి వైద్యం మన భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ వైద్య ప్రక్రియను వైద్య విద్యలో బోధించి, వైద్యులతో వైద్యము చేయిస్తే ప్రపంచ వైద్యశాస్త్రములో మన దేశము ఉన్నత శిఖరంలో ఉంటుంది. మన ఋషులు మనకు అందచేసిన వైద్య విజ్ఞానమును ప్రజలకు ఉపయోగపడేలా చేయడం ప్రభుత్వ కర్తవ్యము.