సప్తధాతువులు పార్ట్ - 2

బ్రహ్మచర్య నిష్ట వలన కలుగు మేలు:

1. బ్రహ్మవర్చస్సు కలుగుతుంది.

2. శీతోష్ణ హిమాదులు కూడా దేహారోగ్యమును భంగము కలుగచేయవు.

3. ఏ ఆహారమయినాను సక్రమముగా జీర్ణమగును

4. దీర్ఘాయుష్షును పొందును

5. రోగాలు దరి చేరవు. ఆయురారోగ్యవంతులై సుందర శరీరులై దృఢముగా ఉందురు.

6. వృద్ధాప్యములో కూడా యౌవనము నందు వలె సకల అవయవ పటుత్వము కలిగి ఉందురు. వార్ధక్య దోషములు దరి చేరవు.

7. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము సులభముగా కలుగుతుంది.

8. వీరికి మహాబలిశాలి అయిన శత్రువు కూడా దుర్భలుడగు బాలుని వలె గోచరించును.

9. రోగగ్రస్తులకు బ్రహ్మచర్యవ్రతము దివ్యౌషధం

10. బ్రహ్మచర్యము వలన వీర్యము - ఓజస్సుగా మారి ఊర్ధ్వ రేతస్కులయిన వారికి బ్రహ్మతేజస్సు, బ్రహ్మ ప్రాప్తి సిద్ధించును.

11. పెట్రోలు స్టీముగా మారి కంటికి కనబడకుండా యంత్రమును ఎట్లు నడుపునో ఆలాగున ఈ శారీరక యంత్రమును ఈ శుక్రమే ఓజస్సుగా మారి నడుపుచుండును. శుక్రము తపోధ్యానాదులచే ఓజస్సుగా మారి ఆధ్యాత్మిక శక్తి పెంచును.

12. సంసారులు బ్రహ్మచర్య వ్రత దీక్ష వలన ఉత్తమ సంతానము పొందుదురు.

13. మేధాశక్తి పెరుగును. విద్యార్థులకు, ఉన్నత శిఖరములు అందుకోదలచిన వారికీ ఇది ఎంతో అవసరము. 12 సంవత్సరములు అస్థలిత బ్రహ్మచర్యం అవలంభిస్తే వారిలో 'మేధానాడి' మేల్కొంటుంది. ఉత్తమ మేధాశక్తి వారికి లభ్యమవుతుంది.

14. సుందరశరీరము, మహాపరాక్రమశాలురై, ధృఢముగా కర్తవ్య దక్షితకలవారై ఉందురు.

15. హఠయోగా ప్రదీపిక: బ్రహ్మ చర్యేణ విద్యా విద్యయా బ్రహ్మలోకమ్ - బ్రహ్మ చర్య వ్రతపాలన చేత బ్రహ్మ విద్యయు, బ్రహ్మ విద్య చేత బ్రహ్మ లోకమును మనుజుడు పొందును.

16. అమృతబిందు ఉపనిషత్తు: మనుష్యుని వీర్యము మనస్సునకు (చిత్తమునకు) వశమై ఉంటుంది. వీర్యమునకు మానవ జీవితమూ వశమై ఉంటుంది. కాబట్టి మనస్సును, వీర్యమును ప్రయత్నము చేత నిగ్రహించి రక్షించుకోవాలి.

17. ధాతుక్షయాత్ సృతే రక్తే మంద సంజాయతే నల: ధాతువు (వీర్యము) నష్టమైన రక్తము చెడి, బలహీనమగును. జఠరాగ్ని (ఆకలి) మందగించి ఆనారోగ్యం ప్రాప్తిస్తుంది.

18. సుశ్రుత సంహిత: యథా పయసి సర్పిస్తుగుడశ్చేక్షౌ రసో యథా శరీరేషు తథా శుక్రం నృణాం విద్యాద్భిషగ్వర: పాలలో నెయివలెను, చెరకు యందు రసము వలెను, జీవుల దేహమందంతటను శుక్లము వ్యాపించి యున్నది, వెన్న తీసిన పిదప పాలు యెట్లు సారహీనమైన దగుచున్నదో, రసమును తీసిన పిమ్మట చెరకెట్లు పిప్పియై పోవుచున్నదో, అటులానే వీర్యము నష్టమైనచో శరీరము తెజోహీనమై నిర్వీర్యమై దుర్భలమై పోతుంది.

19. శుక్రము ఎక్కువగా ఉన్న వారు - ప్రజ్ఞావంతులు, విజ్ఞానవంతులు సత్వగుణ ప్రధానులు, మంచి ఆరోగ్యము గలవారుగా ఉందురు. వీరిలో వ్యాధి నిరోధక శక్తి (Immunity) ఉన్నతముగా ఉంటుంది, వివేకవంతులు పైన వ్రాసిన విషయములు మననము చేసి శుక్రమును జాగ్రత్తగా రక్షించుకొని, ఓజస్సుగా పెంచుకొని ఉన్నతులగుటకు ప్రయత్నించి మన భారతమాత ఔన్నత్యమును పెంచ ప్రార్ధన.

 

ప్రాణము, మనస్సు, వీర్యము: వీనికి ఒకదానికొకటి అంతరంగిక సంబంధము కలదు. అధిక సంభోగమువలన ప్రాణము వ్యర్థమవుతోంది. బ్రహ్మ చర్యము ద్వారా ప్రాణశక్తి పెరుగుతుంది. అధిక సంభోగము వలన నాడీమండలము, మెదడు శక్తి కోల్పోవును, మానసిక శక్తి కోల్పోయి జ్ఞాపకశక్తి తగ్గిపోవును. అకాల వృద్ధులై నడివయస్సులోనే అకాల మరణము చెందుదురు. బ్రహ్మచర్యము వలన జగత్ర్పసిద్ధిగాంచిన వారు హనుమంతుడు, భీష్ముడు, శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు, శ్రీరమణ మహర్షి, క్రీస్తు, వీరిని మనము ఆదర్శముగా తీసుకోవాలి.

హస్త ప్రయోగము: చాలా నీచమయిన, ప్రకృతి విరుద్ధమయిన చర్య. దీని వలన మనస్సులో తృప్తి చెందుతారు కానీ, పురుషాంగము (Penis) చేతి వత్తిడి వలన దెబ్బ తింటుంది. శిశ్నములోని కండరములు చెడిపోతాయి. యోనిలోనికి శిశ్నమును చొప్పించినప్పుడు, యోనిలోని మెత్తడి కండరములు శిశ్నమునకు సుఖస్పర్శ దివ్య అనుభూతిని కలుగజేస్తుంది. సంభోగము సమయంలో యోనిలో ఉత్పత్తి అయ్యే జిగురుతో కూడిన ద్రవము శిశ్నమునకు శక్తిని ఇస్తుంది, హస్త ప్రయోగములో పైన వ్రాసిన లాభము పొందకపోగా కీడు జరుగును. భగవంతుడు సంభోగము ద్వారా వీర్యము యోనిలోనికి వెళ్ళి, సృష్టి జరిపించునియమము పెట్టినారు. ఆ నియమమును ఉల్లఘించువారు దాని చెడు ఫలితము కాలక్రమేణా తప్పక పొందుదురు. యౌవనవంతునికి కామోద్రేకాన్ని తగ్గించుకొనుటకు హస్త ప్రయోగం సహజ ప్రవృత్తే. అందులో ఏమీ హానిలేదు - అని ఆధునిక లైంగిక బిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలియచేసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. హస్త ప్రయోగము నిషిద్దము. కామోద్రేకానికి హస్త ప్రయోగం పరిహారం కాదు. వివాహామే పరిహారం.

 

హస్త ప్రయోగానికి అలవాటు పడిన వారు అనుకున్నప్పుడల్లా హస్త ప్రయోగాన్ని ఆచరించి మిక్కిలి శుక్రనష్టం జరిగి, మానసికంగానూ, శారీరకంగానూ, రోగిగా మారిపోతారు. ఓజస్సు తరిగిపోతుంది. వీర్యములో జీవులుందురు. వీర్యము స్త్రీ గర్భాములోనికి వెళ్ళవలెనేకానీ, భూమి మీద పడరాదు. భూమి మీద పడినచో ఆ వీర్యములోని జీవులు బాధపడుదురు. ఆ పాపఫలము వారు అనుభవించవలెను. యౌవనంలో ఉండు బ్రహ్మచారి కామోద్రేకం వలన జరుగు నష్టములను మననం చేసుకొని నిగ్రహానికి ప్రయత్నించవలెను. దైవభక్తి, సద్గ్రంథపఠనం, ప్రాణాయామము, సమాజసేవ వంటి మంచి పనులు కామోద్రేకానికి దివ్య ఔషధములుగా పని చేస్తాయి. ఉద్రేక పరచే బూతు చలన చిత్రములు చూడరాదు. బూతు సాహిత్యాన్ని చదవరాదు. హస్తప్రయోగం బాధితులు జీవితంలో అడుగంటి పోతారని వారు గ్రహించాలి. ప్రస్తుతం ప్రపంచం జనాభాను కలవరపెడుతున్న ఎయిడ్స్ వ్యాధి మితిమీరి సంభోగక్రియ జరిపి అమిత శుక్లనష్టము, ఓజోక్షయము పొందిన వారికీ మాత్రమే విరివిగా వ్యాప్తి చెందును, శుక్రమును, ఓజస్సును జాగ్రత్తగా కాపాడుకొనువారికి ఎయిడ్స్ వ్యాధి సోకదు. వీరిలో వ్యాధి నిరోధకశక్తి ఉన్నత ప్రమాణములో ఉంటుంది.

 

బలవంతంగా - అంగస్తంభన మంచిది కాదు: లైంగిక కార్యక్రమమునకు సహజంగా అంగస్తంభన (Erection) జరగనప్పుడు బలవంతంగా అంగాన్ని స్తంభింపచేయు వయాగ్రా లాంటి మందులు వాడుట చాలా హానికరము. రతికి అర్హత, శక్తి ఉన్నవారు సంకల్పం జరిగిన వెంటనే అంగము స్తంభిస్తుంది. అలా జరుగునప్పుడు రతికి అర్హత లేదన్నమాట. చక్కగా అంగస్తంభన జరగని వారు సంభోగం చేయతగదు - అని శ్రీ చరక మహర్షి చెప్పారు. వీరు శుక్ర పటుత్వమునకు మంచి మూలికలతో వైద్యం చేయించుకొని మంచి వీర్యపుష్టిని ఇచ్చే ఆహారము భుజించాలి.

 

పతోనోన్ముఖమైన వీర్యాన్ని స్థలించకుండా నిలుపుట: ఇది చాలా తప్పు, శ్రీ శుశ్రుతుడు - “శుక్రంచ ఉపస్థితం మోహాత న సంధార్యం కధంచన' అని చెప్పారు, అంటే రతికాలంలో స్థలనోన్ముఖమైన వీర్యాన్ని అజ్ఞానంతో స్థలించకుండా నిలుపరాదు. శుక్రము రతిసమయంలో బహిర్గాతము చెందు సమయమున బహిర్గత మొనర్చకపోయిన అది ప్రమాదకరము. నపుంసకత్వము వస్తుంది, మనోనిగ్రహ సాధనలేక, సంభోగ వాంఛను మనస్సు కోరుకొని, ఆ సంభోగ విషయ సంకల్పములు కలుగు వ్యక్తులు. శుక్రబిందువును పరిమిత సంభోగముచే బహిర్గతమొనర్చుటయే మంచిది, కాని పరిమితిని మించి ఎక్కువసార్లు సంభోగములో పాల్గొంనచో రాబోవు వ్యాధులు, అకాల మరణమునకు సిద్ధముగా ఉండవలెను. సృష్టి శక్తి అంతయూ శుక్రము (Sperm) శ్రోణితము (Ovum) నందే కలదు. ఇది లేనిచో సృష్టియే లేదు. మనుష్యుని వీర్యము మనస్సునకు వశమై ఉంటుంది. వీర్యమునకు జీవనము వశమై ఉంటుంది, వీర్యము నష్టమైన రక్తము చెడి, బలహీనమగును. జఠరాగ్ని (ఆకలి) మందగిస్తుంది. తద్వారా రోగము ప్రాప్తిస్తుంది.

 

వివాహ వయస్సు: సుశ్రుత సంహిత ప్రకారము 16 సంవత్సరములు వయస్సు పూర్తి అయిన స్త్రీ, 25 సం||లు వయస్సు పూర్తి అయిన పురుషుడు వివాహమునకు సంభోగమునకు అర్హులు. 16 సం||లు వయస్సు పూర్తికాని స్త్రీ యందు 25 సం||లు వయస్సు పూర్తిగాని పురుషుడు గర్భాధానం చేసిన గర్భంలోనే శిశువు అపత్తును పొందును. ఒకవేళ ప్రసవించినను ఆ శిశువు చిరంజీవి కాదు. శరీరము ఇంద్రియములు పుష్టిగా పెరుకోక నీరసించును.

 

సామాన్యులకు శుక్రగోళము (Serminal vesicles) శుక్రముతో నిండినప్పుడు పతనము కలుగు స్వభావము కలదు. అది అంత బాధాకరము కాదు. శుక్లము అబుద్ధి పూర్వకముగా కానీ, స్వప్నములో కాని నష్టపోయిననూ అంత దోషము లేదు. ఉదాహరణ: చెరువు నిండినప్పుడు కలుజు మార్గము (కళింగమార్గము) ద్వారా జలము పోయిననూ చెరువుకు హాని లేదు. అట్లుకాక చెరువు కట్ట కొట్టివేసిన జలమంతాయూ బైటకు పోయి పైర్లు పండవు. గ్రామమునకు నష్టము జరుగును. అలాగునే బుద్ధి పూర్వకముగా శుక్రనష్టము ఎక్కువగా చేసికోన్నచో వారి దేహమునకు నష్టము చేసుకొన్న వారగుదురు.

 

మంచి దాంపత్యజీవితమునకు సూచనలు:

క్షేమ కుతూహలం: రాత్రి సమయముననే తన భార్యతోనే సుఖించవలెను. భావ ప్రకాశము: పగలు స్త్రీ సాంగత్యము చేయడం వలన ఆయుర్థాయము క్షీణించును. మనస్సు సంతోషముగా ఉన్నప్పుడు ,మాత్రం సంభోగం చేయవస్తుంది దుఖములో ఉన్నప్పుడు సాంగత్యము కూడదు.

 

అష్టాంగ హృదయం: స్త్రీని కలిసిన పిదపపురుషావయమును వెంటనే శుభ్రము చేసుకొనవలెను. మితంగా సాంగత్యము చేయడం మంచిది, వీరికి ఆయుర్ధాయం, ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, బుద్ధిబలము, శరీరబలం పెరుగును, త్వరగా ముసలితనం రాదు. మితిమీరి సంగమం చేసే వారికి బడలిక, బలహీనత కలుగుతుంది. రసము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముకలు, మజ్జ, శుక్లముతో కూడిన సప్తధాతువులు క్షీణిస్తుంది. జ్ఞానేంద్రియములు శక్తి కోల్పోతాయి. అనేక రోగాలు ప్రాప్తిస్తాయి. అకాల మరణం సంభవిస్తుంది. అమితంగా భోజనం చేసిన వారు, ఆకలితో ఉన్నవారు, మల మూత్రములు విసర్జించవలసిన అవసరం ఏర్పడిన వారు, అంగవైకల్యము కలవారు. రోగగ్రస్తులు సాంగత్యము చేయరాదు.

 

సుశ్రుత సంహిత: వేసవి కాలంలో తప్ప మిగిలిన రోజుల్లో మూడు రోజుల కోక్కసారే సాంగత్యం చేయాలి. వేసవికాలంలో మాత్రం 15 రోజుల కోక్కసారే కలవాలి. పుష్టికరమైన ఆహారం ద్వారా మరల శుక్రవృద్ధిని పొందాలి. సంభోగ కాలంలో స్త్రీ క్రిందను వెల్లకిల పరుండి యుండవలెను. పైన పురుషుడు రతి జరపవలెను. మిగిలిన భంగిమలు పనికిరావు. పురుషుడు క్రింద, స్త్రీ పైన ఉండి రతి జరిపిన దానిని "పురుషాయితం" అంటారు. దీని వలన పురుషుని మూత్రాశయంలో శుక్రము రాయిగా మారు వ్యాధి వస్తుంది. ఈ రతి వలన గర్భధారణ జరిగి ఆ గర్భం పురుషుడైతే స్త్రీ చేష్టలు కలావాడుగానూ, స్త్రీ అయితే పురుష చేష్టలు గలదిగానూ ఉంటుంది, నిలుచొని కానీ ప్రక్కప్రక్కన ఉండి కానీ, పురుషుడు స్త్రీ వెనుక ఉండి కానీ రతి చర్య జరపరాదు. శ్రీ వాగ్భాటాచార్యులు కూడా ఈ విషయమునే చెప్పారు. బహిష్టు సమయంలో స్త్రీ తో సంగమం చేయరాదు. ఆయుర్ధాయం తగ్గుతుంది. శరీరకాంతి క్షీణిస్తుంది. దాంపత్య జీవితము గడుపు వారు శుక్రమును అణిచి పెట్టరాదు. శుక్రమును బలవంతంగా అణచిపెట్టుట వలన అది బైటకు స్రవించడం శిష్ణమున నొప్పి, వాపు, మూత్రము అడ్డగించబడుట, మూత్ర సంచికలో రాళ్ళు నపుంసకత్వం వ్యాధులు వస్తాయి. బ్రహ్మచారులకు ఇది వర్తించదు.

 

చరక సంహిత: గర్భోత్పత్తి సమయమున స్త్రీ యొక్క మనస్సు ఏ ప్రాణి మీద లగ్నమై ఉండునో ఆ ప్రాణిని పోలిన సంతానమే ఆమెకు కలుగుతుంది.

 

వేదములు, ఉపనిషత్తులలోని విషయములే Science కు ఆధారము. ఐన్ స్టీన్ శాస్త్రవేత్త సంస్కృతము నేర్చుకొని భగవద్గీతను చదివి తన సిద్దాంతమును కనిపెట్టినారు. ఇలా ఎందరో పాశ్చాత్య శాస్త్రవేత్తలు మన వేదములే ఆధారంగా, మానవాళికి ఉపయోగపడే సిద్ధాంతములు బైటకు తెచ్చారు, పైన వ్రాసిన వ్యాసము మన ఋషులు అందించిన విషయములు, ఆధునిక వైద్య శాస్త్రములోని విషయములు క్రోడికరించి వ్రాసినాను.

 

ఈ వ్యాసమును విద్యార్థులలి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తమ మేధాశక్తిని ఎందుకొని అభివృద్ధి చెందగోరు విద్యార్థి సమాజమునకు, మన దేశమాతకు మేలు చేసినవారమవుతాము. ప్రభుత్వము బాధ్యతగా వ్యవహరించి Characterతో కూడిన యువతను దేశమాతకు అందించే చర్య తీసుకోవాలని నా ప్రార్థన.