పంటి పరీక్షలతో చాలా మేలు
కీళ్ల నొప్పులు, ఎముకలు అరిగిపోవడం, కూర్చుంటే లేవలేని పరిస్తితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి, చాలా దారుణమైన హింస. ఇలాంటి హింస వయసు పైబడినవాళ్లకు తప్పట్లేదు. ముందుగా మేల్కొన్న వాళ్లకు మాత్రం ఈ విషయంలో ఇబ్బందులు కాస్త తక్కువే అని చెప్పాలి. మరి ఇలాంటి కాళ్లూ, కీళ్లూ నొప్పుల బెడదను ముందుగా గుర్తించడానికి మార్గమేదైనా ఉందా.. అని అడిగితే డాక్టర్లు ఇప్పుడు చాలా సులభమైన మార్గం కూడా రెడీగా ఉందంటున్నారు. క్రమం తప్పకుండా డెంటల్ పరీక్షలు చేయించుకునేవాళ్లకు ఎముకలు బోలుగా మారుతున్నాయా లేదా అన్న విషయాన్ని కనిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ పరిశోధనలు చెబుతున్నాయట. ఐదు వేల డెంటల్ ఎక్సరేల్ని క్షుణ్ణంగా పరిశీలించాక వైద్య శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఓ నిర్థారణకొచ్చారు. ఎముకల పటుత్వం తగ్గిపోవడవల్ల ముందుగా దెబ్బతినేవి దవడ ఎముకలే కనుక, డెంటల్ ఎక్స్ రేలవల్ల ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలున్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. సో.. క్రమంతప్పకుండా పళ్లని పరీక్షచేయించుకుంటే పనిలోపనిగా ఎముకల పటుత్వం సంగతికూడా తేలిపోతుందన్న మాట.. పదిహేనునుంచి తొంభైనాలుగేళ్ల మధ్యలో ఉన్నవాళ్ల డెంటల్ ఎక్సరేలను పరీక్షించినప్పుడు ఈ వివరాలు బైటపడ్డాయ్.
read moreAvoid Arthritis With These Super Foods
Banana: Bananas are loaded with Potassium and magnesium which are essential in increasing bone density. They are also good source of arthritis fighting vitamin B6, folate and Vitamin C. So eating bananas may help to solve this problem. Blue berries: Blue berries are high content of antioxidants. Research shows regular consumption of berries can help decrease the inflammation of the joints. Grapes: Grapes are nutrient-dense, high in anti-oxidants and possess anti-inflammatory properties. Resveratrol is an antioxidant present in the skin of grapes, which help to reduce joint pains. Walnuts: Walnuts are nutrient dense, and loaded with compounds that may help reduce the inflammation associated with joint disease. Walnuts are especially high in omega 3 fatty acids, which have been shown to decrease the symptoms of arthritis. Cheese: Cheese is an excellent source of calcium for bones and protein for muscles and joint supporting tissues. Eating cheese regularly to prevent arthritis. - TeluguOne Team
read moreబ్రెయిన్ జిమ్... ఇలా చేయాలి...
ఈమధ్య కాలంలో జ్ఞాపకశక్తికి బ్రెయిన్ జిమ్ చేయాల్సిందేనని నిపుణులు తరచూ చెప్పటం వింటున్నాం. అసలు ఈ బ్రెయిన్ జిమ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి అంటే... * మన మెదడుని కుడి, ఎడమలుగా విడదీసి కుడి మెదలు, ఎడమ మెదడు అంటారు. ఈ రెండు మెదడులు చురుకుగా వుంటే మంచి జ్ఞాపకశక్తి సొంతమవుతుంది. మరి ఈ రెండు మెదడులు చురుకుగా వుంచటమెలా అంటే, వాటికి పని కల్పించటమే... * ఎడమచేయి, ఎడమకాలు పనిచేస్తే కుడివైపు మెదడు పనిచేస్తుంది. చురుకుగా వుంటుంది. కుడికాలు, కుడిచేయి పనిచేస్తే ఎడమ మెదడు పనిచేయడం మొదలుపెడుతుంది. సాధారణంగా మనందరం కుడి చేయి, కుడికాలునే ఎక్కువగా కదిలిస్తుంటాం. వాటితోనే పనిచేస్తుంటాం. అలా కాకుండా రెండు చేతులు, కాళ్ళను సమానంగా పనిచేయించ గలిగితే మెదడులోని రెండు భాగాలు చురుకుగా వుంటాయి. కాబట్టి ప్రతిరోజూ రెండు చేతులు, రెండు కాళ్ళను కదిలించేలా వ్యాయామం చేయాలి. * ఇక పంచేంద్రియాలకు వ్యాయామం ఇవ్వగలిగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చెవులని బ్రెయిన్ క్యాప్స్ అంటారు. వీటికి రోజూ మసాజ్ చేసుకోవాలి. అలాగే కళ్ళు మూసుకుని ఏదైనా పని చేయడం ద్వారా కళ్ళకు వ్యాయామం అయినట్టే. కళ్ళు మూసుకుని వాసనబట్టి వస్తువుని గుర్తుపట్టడం, రుచితో ఆహారాన్ని గుర్తించడం ఇలా చిన్న చిన్న ఛాలెంజెస్‌ని మన పంచేంద్రియాలకు రోజూ ఇస్తూ వెళ్తే వాటికి కావల్సినంత ఎక్సర్‌సైజ్ ఇచ్చినట్టే. -రమ
read moreజ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదే...!
ఇది మన అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఏదయినా జబ్బు చేసినప్పుడు అస్సలు ఆకలి వేయదు. మన ముందు నోరూరించే పదార్థాలు ఎన్ని ఉన్నా తినడానికి ఆసక్తి చూపించం. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడయినా ఆలోచించారా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=yO1rN1QVu0c
read moreనిద్రలేమికి చెక్ పెట్టాలంటే...!
ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో... నిద్ర కూడా అంతే అవసరం. కానీ మారుతున్న జీవన విధానం మనిషికి నిద్రను దూరం చేస్తోంది. ఒత్తిడి పెరిగిపోయి కంటి మీదకి కునుకు రానంటోంది. చిన్నగా కనిపించినా ఇది పెద్ద సమస్యే. నిద్రలేమి మన పనితనాన్ని, జీవనాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తగినంత నిద్రపోవాలి. నిద్రపట్టకపోతే ఎలా నిద్రపోవాలి అనకండి. దానికి కొన్ని సింపుల్ చిట్కాలున్నాయి. కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలతో సమస్యను దూరం చేసుకోవచ్చు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సాధారణంగా అందరూ పాలు ఉదయం పూట తాగుతుంటారు. అది మంచిదే కానీ రాత్రి పూట పాలు తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంది. పాలు, పాల ఉత్పత్తుల్లో మెదడును శాంతపరిచే నాడీ ప్రసారకాలు ఉంటాయి. అవి చక్కగా నిద్రపోడానికి సహకరిస్తాయి. అందుకే రాత్రిపూట ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే నిద్రాదేవత మిమ్మల్ని కరుణించడం ఖాయం. అదేవిధంగా అరటిపండ్లు. వీటిలో ఉండే పొటాసియం, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే ట్రిప్టోపాస్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించిన తరువాత సెరటోనిన్ గా మారి స్ట్రెస్ ను తగ్గిస్తుంది. దానివల్ల ప్రశాంతత చేకూరి నిద్ర పడుతుంది. చెర్రీస్ కూడా నిద్రలేమికి మంచి మందు. వీటిలో ఉండే మెలటోనిన్ నిద్రని క్రమబద్ధం చేస్తుంది. అందుకే రాత్రిపూట కొద్దిగా చెర్రీస్ ని తీసుకుంటే మంచిది. అంతేకాదు... ట్యూనా ఫిష్ కూడా నిద్ర సమస్యను తీర్చే దివ్యౌషధం. దీనిలో ఉండే బీ6 విటమిన్ నిద్ర పట్టడానికి చక్కగా సహకరిస్తుంది. అదే విధంగా బాదంపప్పులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కండరాల మీద ఒత్తిడిని తగ్గించి చక్కగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే థయమిన్ కూడా నిద్రలేమికి చెక్ పెడుతుంది. చూశారు కదా! ఒకవేళ మీరు కనుక నిద్రలేమితో బాధపడుతుంటే వెంటనే మీ రాత్రిపూట ఆహారంలో వీటిని చేర్చుకోండి. వెంటనే నిద్ర వచ్చి మీ కన్నులపై వాలిపోతుంది చూసుకోండి.
read moreVARICOSE VEINS ని ముందుగానే ఎలా గుర్తించాలి...?
Vascular Specialist Shailesh Kumar Garge says that people who stand a lot specially people in the teaching profession, traffic policemen have more chances of getting varicose veins problem. Further he answers all the questions that are frequently asked by the patients. https://www.youtube.com/watch?time_continue=2&v=-S5J-r99zAY
read moreటిబి అంటే ఏంటి... ఎవరికి వస్తుంది... నివారణ ఉందా..?
what is Tuberculosis? What are its symptoms? Where does tuberculosis affect generally? Can it be completely cured? All such frequently asked questions related to TB has been answered by Pulmonologist Dr. Mateenuddin Saleem. To know more about this.... https://www.youtube.com/watch?v=2oipXxiWiHs
read moreఫ్యాటి లివర్ అంటే ఏమిటి..? వచ్చినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు...
What is Fatty Liver? Who is prone to Fatty Liver Liver? How can Liver be protected with simple exercises? What are the stages of Fatty Liver? All this clearly explained by Dr. R Balaji – Cardialogist, MaxCure Hospital. To know in detail watch the video. https://www.youtube.com/watch?v=9zF3EJq8g10
read moreఆఫీస్ చేర్ లో కుర్చునేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు (పార్ట్ - 3)
Working infront of the system for a long time? Then you are prone to RSI. Repetitive Strain Injury means performing same set of work at the work place for a long period of time. Confused as to how these can cause injury? To know about Repetitive Strain Injury in detail – listen to Dr. Hari Kumar. https://www.youtube.com/watch?v=qdgFsgzPdJU&t=7s
read moreWhat is Diabetes..?
What is Diabetes – Dr S G Moazam, a diabetologist of Sunshine Hospital explains. Further he also details about the stages of diabetes and what are the symptoms which cannot be ignored. Watch the video and we are sure all your doubts regarding Diabetes will be cleared.... https://www.youtube.com/watch?v=yJyMEErmSes
read moreబీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఇలాంటి ఆహరం తీసుకోవాలి..!
Watch If you have diabetes and high blood pressure it’s important that you add foods to your diet that will help you control both disorders, and avoid anything that could be harmful Many people suffer from these two diseases and might think it’s too hard to follow a diet that excludes salt and sugar.... https://www.youtube.com/watch?time_continue=23&v=B-MMpbWSO2k
read moreయాంటిబయాటిక్స్‌తో చంపేస్తున్నారు...
యాంటిబయాటిక్స్‌ని కనుక్కోవడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అవే లేని రోజుల్లో చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారేది. కానీ అవే యాంటిబయాటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి వాడకం వల్ల శరీరంలో నానా రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడం మాట అటుంచితే… అవసరమైనప్పుడు అసలు ఏ మందూ పనిచేయని పరిస్థితి వస్తుంది. దీనినే antibiotic resistance అని పిలుస్తున్నారు. యాంటిబయాటిక్స్ గురించి ఇప్పుడు ఈ కథంతా మళ్లీ చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. వైద్యులు ఈ యాంటిబయాటిక్స్‌ని రోగులకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు లండన్ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 1,85,014 మందిని పరిశీలించారు. వీరంతా కూడా 65 ఏళ్లు పైబడినవారే. అంటే వైద్యులు వీరికి చికిత్సని అందించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. దురదృష్టవశాత్తూ వీరంతా వైద్యుల దగ్గరకి చిన్నచిన్న అనారోగ్యాలతో వెళ్లినప్పుడు కూడా, వీరికి అనవరసంగా యాంటిబయాటిక్స్‌ను అందించారట. ఇలా సగానికి సగం కేసులలో యాంటిబయాటిక్స్ తీసుకోవాలంటూ వైద్యులు తొందరపడినట్లు తేలింది. ఈ యాంటిబయాటిక్స్ కూడా మామూలువి కాదు… అలెర్జీలు, విరేచనాలు, గుండెజబ్బులు, కండరాల సమస్యలు వంటి నానారకాల దుష్ప్రభావాలు చూపించేవి. ఇలా ఉత్తిపుణ్యానికే శక్తివంతమైన యాంటిబయాటిక్స్ తీసుకోమంటూ వైద్యులు సలహా ఇస్తున్నట్లు తేలింది. కాస్త విశ్రాంతి, మరికాస్త ఉపశమనంతో తగ్గిపోయే జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి సమస్యలకు కూడా యాంటిబయాటిక్స్‌ను సూచించడం చూసి పరిశోధకుల తల తిరిగిపోయింది. ఇంతాచేసి ఈ వైద్యులంతా మహామహా సీనియర్లు! యాంటిబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడకూడదన్న అవగాహన ఉన్నవారు. చిన్నపాటి సమస్యలకు ఆ మందులు అస్సలు అవసరమే లేదని తెలిసినవారు. ఆరోగ్యం మీద అవగాహన ఉండే లండన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో కదా! అందుకనే యాంటిబయాటిక్స్ వాడకాన్ని అదుపు చేసేలా… అటు ప్రభుత్వమూ, ఇటు వైద్య సంస్థలూ కఠినమైన నిబంధనలను విధించాలని కోరుకుంటున్నారు పరిశోధకులు. -నిర్జర.
read moreఈ లక్షణాలుంటే అల్జీమర్స్ ఉన్నట్లే..
Alzheimer – Is it curable? What are its stages? Is Alzheimer caused because of insufficient sleep? Are some of the questions people generally ask? Dr. P Ranganadham, the Neurosurgeon from Sunshine Hospital explains. https://www.youtube.com/watch?v=snj8rqAsWc4&t=139s
read more



.jpg)







.jpg)




.jpg)





