1. ఆపిల్: రోజుకో ఆపిల్‌ పండు తింటే డాక్టరుకు దూరం అనేది నిజం. దీనిలో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు ఎక్కువే. చక్కెర శాతం తక్కువ. దీన్ని మధుమేహులు కూడా తినవచ్చు. దీనిలో శక్తినిచ్చే పదార్థమే కాకుండా దీనిలో పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి.

2. అరటి: శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియమ్‌, విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు.

3. పైనాపిల్: ఎనర్జీని అందించడంలో మరో అద్భుతమైన పండు. అంతే కాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

4. మామిడి: విటమిన్‌ ఎ, బిటాకెరోటిన్‌, బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌, రోగనిరోధక శక్తి ఎక్కువ చేసే యాంటి ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. శక్తిని వెంటనే అందజేస్తుంది. దీనిలో పీచు (ఫైబర్‌) ఉండడం వల్ల, రక్త ప్రసరణకు, సాఫీగా విరేచనం కావడానికి తోడ్పడుతుంది.

5. బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో అవసరమైన క్యాలొరీలను పొందవచ్చు. ఒక కప్పు స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల వెంటనే తాజా అనుభూతిని పొందవచ్చు.

6. ఆరెంజ్: వీటిలో విటమిన్‌ c, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీర సౌందర్యానికి కూడా చాలా మంచిది. పొటాషియమ్‌ ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయిన కండరాలకు, గుండెకు మేలు చేస్తుంది. దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్థులు పుష్కలంగా వాడవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వలన జీర్ణప్రక్రియకు, మలబద్ధకం నివారించేందుకు చాలా ఉపయోగపడుతుంది.

7. పుచ్చకాయ: వీటిలో పీచు పదార్థం జీర్ణప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. విటమిన్‌ సి, ఎ, ఐరన్‌, పొటాషియం, ఒక రకమైన తీపి పదార్థం ఉండడం వల్ల శక్తినిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచి కాపాడుతోంది. దీన్ని మధుమేహం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తినవచ్చు. దీనిలో నీటి శాతం 90-95 శాతం వరకూ ఉంటుంది. ఎండాకాలంలో నీటి దప్పికకు ఇది గొప్ప ఉపశమనం.

8. బొప్పాయి: బొప్పాయిలో ఐరన్‌, పొటాషియమ్‌, కాల్షియమ్‌, విటమిన్‌ ఎ, సి, బి కాంప్లెక్స్‌ చాలా ఎక్కువగా ఉన్నాయి. మధుమేహులు కూడా వాడవచ్చు. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.