మహిళలు వర్కౌట్స్ చేయడం మంచిదే కానీ.. ఈ పొరపాట్లు మాత్రం చేయకండి!

మహిళలు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని, కేవలం ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే అది శరీరాన్ని దృఢంగా ఉంచదని ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది మహిళలు వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా వర్కౌట్స్ చేయడం మంచిదే.. కొందరు జిమ్ లలో శిక్షకుల సమక్షంలో వర్కౌట్స్ చేస్తే అధిక శాతం మంది ఆన్లైల్ లో వివిధ ఆసనాలు, ఎక్సర్సైజులు చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అయితే అవహాహన లేకుండా వీటిని ఫాలో అవ్వడం చాలా తప్పు. దీనివల్ల శరీరం ఫిట్ గా మారడం కథ దేవుడెరుగు, ఉన్న ఫిట్నెస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంతకీ వర్కౌట్స్ విషయంలో అందరూ తెలియకుండానే చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసుకుంటే..

బరువు తగ్గాలనే ఆలోచనతో చాలా మంది ఎక్కడైనా ఎవరైనా ఒక ఆసనం లేదా వ్యాయామం గురించి ప్రస్తావిస్తే దాన్ని చాలా భీభత్సంగా ఫాలో అవుతారు. అందుకే దేన్నైనా మొదట తేలికగా మొదలుపెట్టడం ఉత్తమం.

వర్కౌట్లు చేయడానికి ముందు వార్మప్ ఫాలో కావాలి. దీనివల్ల శరీరంలో కండరాలు, వివిధ అవయవాలు వ్యాయామానికి తగిన విధంగా సిద్దమవుతాయి. వార్మప్ వల్ల శరీరం సాగదీయబడుతుంది. ఇది లేకుండా వ్యాయామం చేస్తే శరీరంలో కండరాలు, వివిధ భాగలు ఎక్కడివక్కడ పట్టుకుపోతాయి. ముఖ్యంగా కాళ్ల కండరాలు, నడుము, పిక్కలు, తొడలు, భుజాలు వంటివి  పట్టుకుపోతాయి.

వర్కౌట్స్ చేసి శరీరాన్ని మార్చుకోవాలని అనుకునేవారు నెలల తరబడి వ్యాయామం ఫాలో అవ్వాలి . అన్నిరోజులూ ఒకే రకమైన వ్యాయామం పాలో అవ్వడం  చాలా బోరింగ్ గా ఉంటుంది. అందుకని విభిన్న రకాల వ్యాయామాలను ఎంచుకోవాలి. వీటిని మార్చి మార్చి చేస్తుండాలి. మరీ ముఖ్యంగా వ్యాయామాలు ప్రతిరోజు ఒకే సమయానికి పాలో కావడం మంచిది. దీనివల్ల శరీరం వ్యాయామానికి తగిన విధంగా యాక్టీవ్ అవుతుంది. శరీరంలో మార్పు ఒక క్రమపద్దతిలో సాగుతుంది.

బరువు తగ్గడానికో, ఫిట్నెస్ గా ఉండటానికో వ్యాయామం ఫాలో అవుతుంటే అది శరీరం మీద గణనీయంగా ప్రభావం చూపిస్తుంది, వ్యాయామం చేసేటప్పుడు ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గడానికి డైటింగ్ ఫాలో అవుతూ, వ్యాయామం కూడా చేయడం మంచిది కాదు. దీని వల్ల శరీరం దారుణంగా దెబ్బ తింటుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. శరీరంలో కేలరీలు బర్న్ చేయడానికి వ్యాయామాలను కూడా ఫాలో అవ్వాలి

వ్యాయామం తరువాత అందరూ ఇక పనులలో మునిహిపోవడం చేస్తుంటారు. కానీ వ్యాయామానికి ముందు శరీరాన్ని ఎలాగైతే వార్మప్ చేశారో, అలాగే శరీరాన్ని కూల్ డౌన్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాయామం వల్ల ఉత్తేజితమైన కండరాలు, శరీర అవయవాలు మెల్లిగా సాధారణ స్థితికి వస్తాయి.

మహిళలు తెలిసీ తెలియక ఈ పొరపాట్లు అన్నీ చేస్తుంటారు. వీటిని సవరించుకుంటేనే శరీరం ఫిట్నెస్ గా మారుతుంది.

                                                   *నిశ్శబ్ద.