Home » Suryadevara rammohan rao » Anitara Sadhyudu


    తనింట్లోనే దొంగతనం జరగటాన్ని ఆయన తీవ్రమైన అవమానంగా భావిస్తున్నాడు.

 

    "సరిగ్గా 24 గంటల్లో ఆ దొంగను పట్టుకొని నాకప్పగించాలి. లేదంటే మీ ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళవలసి వస్తుంది..." తీవ్రస్వరంతో హెచ్చరించాడు డి.ఐ.జి.

 

    "తప్పకుండా మీరిచ్చిన గడువులోపే ఈకేస్ ని ఇన్ వెస్ట్ గేట్ చేసి మీ ముందుంచుతాను. లేదంటే మీరు చెప్పినట్లే చేస్తాను" సి.ఐ. పట్టుదలగా అన్నాడు.

 

    "ఈ కేసు వివరాలు పేపర్స్ లో రావటం అంత మంచిది కాదు..."

 

    "అర్థమయింది సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇన్ వెస్టిగేషన్ ప్రారంభిస్తాను సార్."

 

    "గో ఎ హెడ్" అన్నాడు డి.ఐ.జి.

 

    సి.ఐ. అక్కడున్న ఇద్దరి కానిస్టేబుల్స్ ని అక్కడే వుండమని సైగచేసి తనతో వచ్చిన కానిస్టేబుల్స్ తో బయటకెళ్ళిపోయాడు.

 

    ఆ తరువాత డి.ఐ.జి. తన భార్యకు ఓ అరగంటపాటు అవి ఇవి చెప్పి ఆమెకు మానసిక స్వస్థత చేకూర్చాడు.

 

    బయట...

 

    సి.ఐ. ఎదురింటి ముందు ఆగి కాలింగ్ బెల్ నొక్కాడు.


                                                        *    *    *    *


    పీటర్ ఎక్కిన కారు ఎస్.ఐ. నరసింహం ఇంటిముందు ఆగింది.

 

    కారులోంచి ఓ వ్యక్తి దిగి నరసింహం ఇంట్లోకివెళ్ళి రెండు నిమిషాల్లో నరసింహంతో బయటకు వచ్చాడు.

 

    నరసింహం వస్తూనే పీటర్ కి సెల్యూట్ చేసి కారెక్కాడు.

 

    కారు తిరిగి బయలుదేరింది.

 

    "నామీద ఇప్పటికి దయ కలిగిందా?" నరసింహం ప్రక్కనే వున్న పీటర్ కేసి చూస్తూ అన్నాడు.

 

    "నాకు అవసరం వచ్చినప్పుడే నీమీద నాకు దయ కలుగుతుంది. కమ్ టు ది పాయింట్" పీటర్ సీరియస్ గా అన్నాడు.

 

    "చెప్పండి"

 

    "నీకు సామంత్ తెలుసా?"

 

    "ఎవరు... ఆ దొంగ కేసులొప్పుకుని జైలుకెళ్ళే వాడేగా?"

 

    "అవును"

 

    "వాడు తెలీకపోవడమేమిటి? మొన్నీ మధ్యనే కారణాలేవీ లేకుండా కుళ్ళబొడిచి తుప్పల్లో విసిరేయించాను..." తేలిగ్గా చెప్పాడు నరసింహం.

 

    పీటర్ సామంత్ తో తాను పన్నిన పథకాన్ని చెప్పటం ప్రారంభించాడు. కారు ఒక లక్ష్యం లేనట్లు ఏ రోడ్ కనిపిస్తే ఆ రోడ్ లోకి దూసుకుపోతోంది.

 

    పదినిమిషాల్లో పీటర్ చెప్పటం పూర్తి చేసాడు.

 

    అదంతా విన్న నరసింహం తెగ ఆనందపడిపోయాడు- అంత పెద్ద కేసంటే కనీసం యాభైవేలన్నా పీటర్ ముట్టచెబుతాడనే ఆలోచనే అతని ఆనందానికి కారణం.

 

    "ఇప్పుడు చెప్పండి - నేనేం చేయాలి...?" నరసింహం వళ్ళు విరుచుకుంటూ అన్నాడు.

 

    "వాడ్ని భయపెట్టాలి. తన అవసరం మాకుందని గ్రహించి పదిలక్షలు పంపించమని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు."

 

    "ఇప్పుడు వాడెక్కడున్నాడు?"

 

    "కృష్ణ ఓబెరాయ్ సూట్ నెం 712లో"

 

    "వార్ని...! ఆ హోటల్ లో ఒక్క పెగ్గన్నా మందు కొట్టాలని ఎప్పట్నుంచో వున్నా వీలు కాలేదు నాకు - వాడు ఏకంగా అందులోనే దిగిపోయాడా? అసలీ కారణం చాలు వాడ్ని మరలా కుళ్ళబొడవడానికి. ఇప్పుడు బయలుదేరతాను. మీకు వీలైతే ఇప్పుడు నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా?" ఉత్సాహపడుతూ అన్నాడు నరసింహం.

 

    "అంత ఉత్సాహం నీ ఆరోగ్యానికంత మంచిది కాదు. వాడ్నంత తక్కువ అంచనా వేయటం కూడా మంచిది కాదు. నువ్వు పిచ్చి పిచ్చిగా వాడ్ని బెదరగొట్టావనుకో - వాడు అదృశ్యమైపోవచ్చు. అప్పుడు నిన్ను లేపేయాల్సి వస్తుంది. వాడు ఇక్కడే వుండాలి. మనం అంటే భయపడాలి. పదిలక్షలు అడగటం మానేయాలి. ఇచ్చిన యాభైవేలు తీసుకొని బుద్ధిగా ఆ అమ్మాయికి తాళి కట్టి మూడు రాత్రులు గడిపి కట్ చేస్తే రోడ్ల మీద తిరుగుతూ దొంగ కేసుల్ని ఒప్పుకొనే ప్రయత్నంలో వుండాలి... అర్థమయిందా...?" కాలిక్యులేటెడ్ గా మాట్లాడే పీటర్ అంటే నరసింహానికి ఎప్పుడూ భయమే.

 

    అలాగే అన్నట్లు భయంగా తలూపాడు నరసింహం.

 

    "కారుని కృష్ణా ఓబెరాయ్ కేసి పోనివ్వు..." పీటర్ డ్రైవర్ ని ఉద్దేశించి అన్నాడు.

 

    కారు సడన్ బ్రేక్ తో ఆగిపోయి రివర్స్ అయి కృష్ణా ఓబెరాయ్ కేసి దూసుకుపోసాగింది.


                                *    *    *    *


    "నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నీకివ్వాల్సిన ఎమౌంట్ ని పెంచుతున్నాను" అన్నాడు సామంత్ తనకెదురుగా వున్న మధుమతితో.

 

    మధుమతి చిన్నగా నవ్వి సామంత్ కేసి కృతజ్ఞతగా చూసింది.

 

    "ఆ నరసింహంగాడి జాతకం ఐదారు గంటల్లో తేలిపోబోతోంది" అన్నాడు తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ.

 

    "అది సరే... నువ్విప్పుడు పది లక్షలు అడిగావ్. వాళ్ళంతా తేలిగ్గా ఇస్తారంటావా? ఇవ్వకపోగా నీమీద దాడి చేస్తే...?" ఒకింత భయంగా అంది మధుమతి.

 

    "అవన్నీ ఆలోచించాను. పీటర్ అనేవాడికి నరసింహం తొత్తులాంటి వాడు. వాడి దుర్మార్గపు పనుల్ని చేసిపెట్టి, వీడు లక్షలకు లక్షలు సంపాదించినట్లు కూడా నాకు తెలుసు. నా ఊహ ప్రకారం కనకారావు వెళ్ళి నేను పది లక్షలు అడుగుతున్నానని ఆ పీటర్ కి చెబుతాడు. వాడు రెచ్చిపోయి నరసింహాన్ని కలుస్తాడు. నరసింహం ఒంటికాలుమీద నా మీదకు వస్తాడు. సరిగ్గా ఆ సమయానికే డి.ఐ.జి. లక్ష్మీనారాయణ ఇంటి వద్దనున్న సి.ఐ. వైర్ లెస్ సెట్ ద్వారా నరసింహం ఎక్కడున్నా వెంటనే అరెస్ట్ చేయమనే సూచన అన్ని స్టేషన్స్ కి వెళ్ళిపోతుంది.

 

    నరసింహం కృష్ణా ఓబెరాయ్ ముందు కారు దిగుతాడు. కృష్ణా ఓబెరాయ్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న ఎమ్.ఎఫ్.హుసేన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి అప్పటికే వచ్చి వుంటారు. అందుకు సంబంధించిన ప్రోటోకాల్ ని అమలుపర్చేందుకు చాలామంది ఎస్.ఐ.లు కమీషనర్ ఆఫ్ పోలీస్ ఈ హోటల్ వద్ద పహరా కాస్తుంటారు. వాళ్ళ దగ్గరున్న వైర్ లెస్ సెట్స్ గరగరమంటాయి. అందులోంచి రెడ్ అలర్ట్ సిగ్నల్స్ వస్తాయి. నరసింహం లిఫ్ట్ వద్దకు చేరుకునేసరికి అతని చేతికి సంకెళ్ళు పడతాయి. ఆపైన కథ దానంతట అదే మలుపు తిరుగుతుంది" సామంత్ చెప్పటం ఆపాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra