Home » R sandhya devi » Soundarya Deepam - 2


    భగవంతుడు ఉన్నాడు.


    ఆరోజు హాస్పిటల్ కు బయలుదేరుతుంటే సుభద్రమ్మ కోడలితో అంది.


    "నేను గుడికి వెళ్దామనుకుంటున్నాను."


    "రండి" అంది అంబిక.


    అత్తాకోడళ్ళు ఇద్దరూ కారులో బయలుదేరారు.


    దారిలోనే హాస్పిటల్ అంబిక దిగిపోయింది.


    సుభద్రమ్మ డ్రయివర్ కి అడ్రసు చెప్పి అక్కడకు కారు పోనివ్వమంది.


    కారు తిన్నగా కృష్ణమౌళి యింటి దగ్గర ఆగింది.


    అతను అప్పుడే ఎక్కడికో వెళ్ళబోతున్నాడు.


    కారువచ్చి పోర్టికోలో తన కారు వెనకగా ఆగటంతో ఎవరా అని ఆశ్చర్యంగా చూశాడు.


    కారులోనుండి సుభద్రమ్మ దిగింది.


    కృష్ణమౌళి ఒక్కక్షణం అలాగే పరిశీలనగా చూడసాగాడు.


    ఆవిడకూడా అతనివైపు చూడసాగింది.


    "ఎవరూ! ఎవరూ! అత్తయ్యా!" అన్నాడు ఆనందంగా.


    "కృష్ణా!" ఆవిడ పెదవులు అస్పష్టంగా పలికాయి. ఆవిడ కళ్ళల్లో నీరు తిరిగింది.


    "అత్తయ్యా నువ్వా! ఇలా వచ్చావేమిటి, లోపలకు రా" అన్నాడు సంతోషంగా.


    ఆవిడ అతనితో లోపలకు వెళ్ళింది.


    "అత్తయ్యా నీవు ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు.


    ఆవిడ చిన్నగా నవ్వి అతను చూపించిన సోఫాలో కూర్చుంది.


    "బాబూ!"


    "ఏమిటి అత్తయ్యా!"


    "నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను" అంది మెల్లగా.


    "అడుగు అత్తయ్యా" నువ్వు ఏం ప్రశ్నించినా జవాబు చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అన్నాడు ఎటోచూస్తూ.


    "ఎవ్వరం ఊహించని విధంగా ఇందూని తీసుకెళ్ళి బలవంతంగా పెళ్ళి చేసుకున్నావు."


    అతను చూపులు మరో వైపుకి తిప్పేశాడు.


    "నీ తల్లిమాట నిలబెట్టాలని నువ్వు ఇంతచేశావు అని నాకు తెలుసు. కాని అంతటితో నీ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నావా? నీ భార్యని నీ యింటికి తీసుకురావాలని అనుకోలేదా?"


    "అత్తయ్యా!" విస్మయంగా చూశాడు.


    "చెప్పు బాబూ!"


    "ఇందూ రాదు. ఇందూ ఇక్కడికి రావటానికి ఇష్టపడటంలేదు" అన్నాడు మెల్లగా.     "నిన్ను పెళ్ళిచేసుకోవటానికి ఇష్టపడిందా?"


    "లేదు"


    "మరి ఎలా చేసుకున్నావు?"


    అతని ముఖం అదోలా అయింది.


    తన కూతుర్ని ఎత్తుకెళ్ళి బలవంతంగా పెళ్ళి చేసుకున్నా కోపం లేకుండా శాంతంగా వచ్చిన ఓ తల్లితో తను మాట్లాడడానికి సిగ్గుపడ్డట్టు అయ్యాడు.


    అప్పుడు తెలిసింది.


    తనుచేసింది ఎంత తప్పు పనో అని.


    "బలవంతంగా" అన్నాడు మెల్లిగా.


    "మరి ఇప్పుడు ఆ పని ఎందుకు చెయ్యలేదు?" ఆవిడ సూటిగా ప్రశ్నించింది.


    అతను మాట్లాడలేదు.


    "చూడు కృష్ణా! నీవు చేసిన పనికి నాకు కన్నతల్లిగా కడుపుతీపితో నీమీద చాలా కోపం వచ్చినమాట నిజమే కాని శ్యామలమ్మ ఆడపడుచుగా నేను వదినగా ఆవిడ పడిన బాధలు, కష్టాలు కళ్లారా చూసిన నాకు ఆలోచిస్తుంటే నీవు చేసింది మంచిపనిగా అనిపించింది."


    "అత్తయ్యా!"


    "అవును బాబూ! నా పిల్లలు ఇద్దరూ రూపాల్లో ముత్యాలు. అందమైన పిల్లలు పుట్టటం ఆ తల్లిదండ్రుల అదృష్టం. అయితే వాళ్ళ మనసులు వాళ్ళ రూపాలంత అందమైనవి కావు. తమకంటే అధికులు లేరనే గర్వం చిన్నప్పటినుండి వీళ్ళ రక్తంలో కలిసి శరీరంలో ప్రవహిస్తూంది. అనుక్షణం వీళ్ళ కండకావరం తగ్గేది ఎప్పుడు అని బాధపడేదాన్ని. వీళ్ళని అదుపాజ్ఞలో పెట్టేవాళ్ళు ఎవరని కుమిలి పోయేదాన్ని.


    రోజు రోజుకి వీళ్ళ అహంకారాలు ఎక్కువయిపోయాయి. ముందు ఆయన్ని కీలుబొమ్మను ఆడించినట్టు కోడలు అల్లుడు రావాలి అనీ.


    ఈ పిల్లలు ఇద్దరికీ ముక్కుకి త్రాడువేసి ఒక దారికి తీసుకు రాగల అల్లుడ్ని, కోడల్ని త్వరలో రప్పించు తండ్రీ అని ప్రతిరోజూ దణ్నం పెట్టుకొనేదాన్ని.


    నా మొర ఆలకించినట్టే శ్యామలమ్మ కొడుకు వైన నీవు మా యింటికి అల్లుడివయ్యావు. అలాగే భూదేవి కూతురు అంబిక మా కోడలు అయింది" అంది ఆవిడ.


    "అత్తయ్యా!" ఆశ్చర్యంగా చూశాడు.


    ఆవిడ చిరునవ్వు నవ్వింది.


    "నీకు.... నీకు ఈ విషయం ఎలా తెలుసు అంబిక చెప్పిందా!" అడిగాడు.


    ఆవిడ నవ్వుతూనే అంది.


    "అంబిక చెప్పలేదు. ఈ రోజు ఉదయం అంబిక నీకు ఫోన్ చేస్తుంటే విషయాలు అన్నీ వివరంగా తెలిశాయి. ఇందూని పెళ్ళి చేసుకోవడానికి అంబిక నీకు అన్ని అవకాశాలు కల్పించింది అని నాకు ఇప్పుడు తెలుస్తుంది."


    అతను మాట్లాడలేదు.


    "ఇంత ధైర్యంచేసిన నువ్వు నీ భార్యను యింటికి ఎందుకు తెచ్చుకోలేకపోయావో నాకు అర్ధం కావడంలేదు"


    అతను మాట్లాడలేదు.


    "కృష్ణా!" అంటూ ఇందూకి వచ్చిన సంబంధ వివరాలు అన్నీ చెప్పి నీవు నీ భార్యకి నీ చేతులారా పెళ్ళిచేస్తావో లేక నీ యింటికి తీసుకువస్తావో తేల్చుకో" అంది ఆవిడ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra