Home » Yandamuri veerendranath » Rudranethra

       
    " అవును. రోడ్డు మీద కూడా-" నవ్వి, "కారు ట్రబులిచ్చింది" అంది.

 

    అతడామెవైపు దిగ్భ్రాంతితో చూశాడు.

 

    "రేపు సాయంత్రం వచ్చేస్తారుగా. తొందరగా వచ్చేయండి-"

 

    అతడు వినటంలేదు. ఇంకా ఆమెనే చూస్తున్నాడు.

 

    "నడిరోడ్డుమీద , అందరూ చూస్తుంటే పరుగెత్తుకుంటూ వచ్చావా?" అని అడిగాడు. రైలుతోపాటూ నడవలేఖ ఆమె ఆగిపోయింది. ఇద్దరి మధ్య దూరం ఎక్కువ అవుతుండగా, అతడికి వినపడటం కోసం ఆమె కంఠం కాస్త  పెద్దదిచేసి  అరిచింది నవ్వుతో-

 

    "అమ్మేమంటుంది- నాన్నేమంటాడు? జనం ఏమనుకుంటారు? అని ఆలోచిస్తే అది ప్రేమెలా అవుతుంది?"

    
                                    *    *    *

 

    "ఏమిటి అలా ఆలోచన్లలోకి జారిపోయి అక్కడే నిలబడిపోయారు" అన్న మాటలకి అతడు చప్పున తెప్పరిల్లాడు.  మనసులోని భావం బయటపడ నివ్వకుండా  ముందుకు అడుగువేశాడు.

 

    ఎందుకో తెలీదు కానీ  అతడికి అకస్మాత్తుగా ప్రతిమ గుర్తొచ్చింది. దానికి కారణం ఏమీ లేదు. ఆమె జలపాతం అయితే ఈమె నిండు గోదారి. ఆమె  భోళామనిషయితే ఈమె ముగ్ధ.

 

    'కాదు- కాదు' అనుకున్నాడు మళ్ళీ తల విదిలిస్తూ. తన మీద  ఒక బాధ్యత  వుంచింది డిపార్ట్ మెంటు. ఈమెగానీ నాటకం ఆడుతున్నట్టయితే -తనకన్నా  పెద్ద  ఇంటలిజెంట్ ఏజెంట్  అయి వుండాలి. తను లొంగిపోకూడదు.

 

    అతడు మామూలు మనిషి అయి, "రూంలోకి వెళ్దామా....? ఇక్కడే  రాత్రంతా గడిపేద్డామా.....?" ఆమె టెన్షన్ 'ఈజ్' చేస్తూ అన్నాడు.

 

    "రండి....." ఆమె తొలగి దారి యిచ్చింది. అతడు హాల్లోకి అడుగు పెట్టాడు.

 

    "మీరు నవ్వనంటే....." అర్థోక్తిలో ఆగింది.

 

    అతడు ఆగి "ఏమిటి-?" అన్నాడు.

 

    "నవ్వకూడదు సుమా?"

 

    "నవ్వన్లే చెప్పు,"

 

    "పైన బాల్కనీలోకి వెళ్దాం".

 

    "అర్థరాత్రి ఈ చలిలోనా....." విస్మయంతో అడిగాడు.

 

    "ప్లీజ్....."

 

    ఆమెను అనుసరించి అతడు పైకి వెళ్ళాడు. ఆమె చివరి మెట్టు దగ్గర  ఆగి వెనుతిరిగి అన్నది. "మీరు పుట్టినరోజు సంగతి రాత్రి తొమ్మిదింటికి చెప్పారు. అందులోనూ కరెక్ట్  వయసు చెప్పలేదు. క్రీస్తు శకం అన్నారు. అన్ని సంపాదించటానికి ఎన్ని షాపులు తిరిగానో తెలుసా-?"

 

    "ఏమిటి సంపాదించింది-?"

 

    ఆమె జవాబు చెప్పకుండా పక్కకు తప్పుకుంది.

 

    అతడు అడుగు పైకి వేసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. బాల్కనీ అంతా కొవ్వొత్తుల వెలుగుతో నిండివుంది. అన్నీ దీపాలే! అతడు వాటి వైపు చూస్తూ వుండగా ఆమె కంఠం ప్రక్కనుంచి వినిపించింది.

 

    "1989 క్రొవ్వొత్తులు. ఎవరికీ తెలియకుండా మనమిద్దరమే వుండాలని అన్నీ నేనే  ఏర్పాటు చేశాను. అందరికన్నా  ముందు నేనే దగ్గరుండి కేక్ కోయించాలని ఇంటికి ఆహ్వానించాను. హ్యాపీ బర్త్ డే టూ యూ...."

 

    దీపాలన్నీ అతనికి బర్త్ డే సాంగ్  పాడుతున్నట్టు గాలికి కదుల్తున్నాయి. అతడి కళ్ళు తడి అయ్యాయి. ఇంత ఆప్యాయతని భరించలేక పోతున్నాడు అతను. ఆ దీపాలమధ్యనుంచి ఆమె మసగ్గా  కనబడుతూంది. ఆమె స్వరం  మాత్రం  మేఘాల వెనుకనుంచి వినిపిస్తూంది. జలపాతమూ పిల్ల తిమ్మెరా కలసినట్టు, ప్రత్యూషం గోధూళి వేళ విరిసినట్టు..... ఆమె స్వరం-

 

    "మీరోచ్చేసరికి ఒక్కదీపం కూడా ఆరిపోకుండా వుండాలని ఎంత కష్టపడ్డానో తెలుసా.....? ఇటు వెలిగిస్తే అటు ఆరిపోయేది. అటెళ్తే యిటు రెపరెపలాడేది. మొత్తానికి ఏమైతేనేం అన్నింటినీ వెలిగించి వుంచగలిగాను" అతనివైపు అమాయకంగా, చిన్నపిల్ల తండ్రికి ఫస్ట్ మార్కుల లిస్ట్ చూపించి మెచ్చుకోలుకోసం చూసినట్టు- కాళ్ళకి పసుపు రాసుకున్న కన్నెపిల్ల పరికిణీ అంచుల్లోంచి పాదాన్ని చూపించినట్టు చూసింది.

 

    "లేఖా...." అన్నాడు అతను అస్పష్టంగా "ఐ లవ్ యూ....."

 

    ఆమె అతనివైపు చూసింది. హేమంత పవనం తాకిడికి, దీపకాంతి ప్రేమతో వణికింది. దీపాల మధ్యనుంచి వచ్చి, సాచిన అతని చేతుల మధ్య లేఖ ఒదిగిపోయింది.

 

    "ఐ టూ....." అంది ఆర్తిగా.

 

    అతడామె భుజాల చుట్టూ చెయ్యి వేసి, దగ్గరగా లాక్కున్నాడు. ఆమె తల  పైకెత్తింది. అతడు వంగి ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకోవడానికి తలను వంచాడు. ఆమె వెనక్కు వెళ్ళబోయింది. బలమైన కెరటం ముందుకు తోసినట్టు ఒకమైకం ఆమెను చుట్టుముట్టింది. అతడామె పెదవుల్ని స్పర్శించాడు.

 

    You gate crashed into my world
    And I lost my hold
    I wanted to say 'No'
    Love is not porno
    ......but
    Air pushed me towards you
    Unfair desires are in a Queue
    Things to tell are plenty
    But suddenly I became a girl of twenty.

 

    కాశ్మీరు లోయల్లోంచి వచ్చిన పొగమంచు రాత్రినుంచి ప్రేరణ పొంది సన్నని ఆలాపన ప్రారంభించింది. మేఘాల పరదాలని తొలగించిన నక్షత్రాలు  పియానో మెట్లు అయ్యాయి. శీతాకాలపు చలిగాలి వాళ్ళ శరీరల్నే వాయులీనపు సందుల్ని చేరుకుంది. అది హంసధ్వనికాదు. చంద్రకోస్ కాదు. వాళ్ళిద్దరూ అలా  చాలాసేపు వుండిపోయారు. నాలుగు పెదవుల మధ్య వత్తిడి అయిదు నిముషాల ముద్దుగా  మారి ఆరు  బుతువులనుంచీ ప్రేరణ పొంది ఏడు వర్ణాల సంకీర్ణమై ఎనిమిది దిక్కులకూ ప్రేమైక గీతంగా పాకింది. ఆమె అతడి నుంచి విడివడి అటు తిరిగింది.

 

    అతడూ ఏజెంట్ నేత్ర  అయిపోయాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూంది.

 

    అతడు  ఆశ్చర్యంగా "ఏడుస్తున్నావా....." అన్నాడు. "ఇప్పుడేమైందని.....?"

 

    ఆమె పెదవులు పైటతో అద్దుకుంటూ-

 

    "పెళ్ళి కాకుండానే  తన సర్వస్వం  అర్పించిన ఏ అమ్మాయి  అయినా  ఇలాగే ఏడుస్తుంది..... కాదా....!" అని అడిగింది.

 

    "లేదు లేఖా..... నేను మనస్ఫూర్తిగా ప్రేమించే నిన్ను ముద్దు పెట్టుకున్నాను. ఇది తప్పే అయితే  ఈ తప్పులో నాదీ సగభాగం వుంది. శీలమూ సర్వస్వమూ లాంటి పెద్దమాటలు ఎందుకు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra