Home » Dr ravuri bharadwaja » పాకుడురాళ్ళు

                                                             8
మగధ దేశాన్ని మాధవవర్మ అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతని కొడుకు పేరు విజయవర్మ. మంత్రి బుద్ది సాగరుడు. సేనా పతి శూరవర్మ. శూరవర్మ చాలా దుష్టుడు. రాజ్యంలోని బందిపోటుదొంగల ముఠాలతో అతనికి దగ్గర సంబంధాలున్నాయి. దొంగలముఠాలను అణచడానికి పంపబడిన సైన్యం ఏనాడూ గెలవలేదు. ఎందుకంటే, శూరవర్మ ముందుగానే వారికి సమాచారం అందిస్తూ ఉండేవాడు. ఈ రహస్యం తెలుసుకొన్న బుద్దిసాగరుడు, స్వయంగా తానే వొకసారి సైనికుల్ని తీసుకొని బయలుదేరాడు, శూరవర్మ ముఠావారు, బుద్ది సాగరున్ని మధ్యలోనే పట్టుకొని బంధించిపారేశారు. ఆ తరువాత వారికి దొంగల వేషాలువేసి శూరవర్మ. రాజుగారిని అక్కడకు తీసుకొచ్చి, బుద్ధిసాగరుడే దొంగలనాయకుడన్న నమ్మకాన్ని రాజుగారికి కలిగించాడు, రాజు, మంత్రికి ఉరిశిక్ష విధించబోయి, లోగడ మంత్రి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని ఉరిశిక్షను కారాగార శిక్షగా మార్పుచేశాడు. సేనా నాయకుని పరిపాలనలో రాజ్యం అల్లకల్లోలమయిపోయింది. శూరవర్మ ప్రజలను క్రూరంగా అణచివేసి, రాజును, రాణిని, యువరాజును దాదాపు బందీలుగా ఉంచేస్తాడు. యువరాజు విజయవర్మకూ, శూరవర్మ కూతురు, దేవసేనకూ తండ్రిలోని దుష్టగుణం తెలీదు.
ఒకసారి బుద్ధిసాగరుడు నమ్మకస్తుడైన భటునిద్వారా అన్ని విషయాలూ విజయవర్మకు తెలియచేసి, శూరవర్మ రాజకుటుంబాన్ని హత్యచేసే ప్రయత్నంలో ఉన్నాడనీ, ఈ రాత్రే పారిపొమ్మనీ సలహా నందించాడు. అర్దరాత్రి వేళ, మహారాజు, మహారాణి, విజయవర్మ రాజధానీ నగరం విడిచి అరణ్య భూములలో ప్రవేశించారు. రెండు రోజులపాటు నిద్రాహారాలుమానేసి నడిచారు. ఒకరోజున మంచినీటికోసం వెళ్ళిన విజయవర్మ ఎందుకురాలేదు. వెదకబోయిన మహారాజు, తిరిగి వచ్చి చూచేసరికి, అక్కడ మాహారాణీ లేదు. అతను భ్రమించి అడవులు పట్టి తిరుగుతున్నాడు. మహారాణిని కోయలు బందించి బానిసగా తీసుకెళ్ళారు.
దేవలోకంలోని అప్సరాంగనలకు మయబ్రహ్మ ఒక విచిత్రమైన దర్పణాన్ని కానుకగా ఇచ్చాడు. అందులో ఏడేడు పధ్నాలుగు లోకాల్లోని ఏ దృశ్యం కావాలన్నా చూడవచ్చు. అప్సర రాజపుత్రి తిలోత్తమ తన చెలికత్తెలతో సహా ఉద్యానవనం ప్రవేశించి ఆ విచిత్ర దర్పణోదంతాన్ని గురించి చెలికత్తెలకు వివరించగా, వారు అందులోని నిజా నిజాలను గురించి రుజువు చేయమని అడిగారు. తిలోత్తమ అద్దంమీది తెరను తొలగించి "లోకాలన్నింటిలోకీ మహావీరుడెవ్వడో చూడాలని ఉంది" అంటుంది. అద్దంలో సింహంతో హోరా హోరీగా పోరాడుతున్న విజయవర్మ కనిపించాడు. ఈ లోకాలన్నిటిలోనూ అందగాడైన యువకున్ని చూడాలని ఉంది" అన్నది తిలోత్తమ, మళ్ళా విజయవర్మ చిత్రమే కనిపించింది. "ఈ లోకాలన్నింటిలోనూ సుగుణవంతులైన వారిని చూడాలని వుంది అన్నది" తిలోత్తమ. ఈసారీ వియవర్మే కనిపించాడు. మొదటి చూపులోనే తిలోత్తమ హృదయం విజయునిపట్ల లగ్నమయింది. ఆమె తన మనస్సును ఆ క్షణమే విజయవర్మ పాదాంకింతం చేసింది. ఆ తరువాత,. చెలికత్తెలను సంప్రదించి, తండ్రి అనుమతితో భూలోక సందర్శనార్ధం బయలుదేరి, అరణ్యాల్లో ఉన్న విజయవర్మను కలుసుకొన్నది. తన మాయాజాలం చేత విజయవర్మలోని గతస్మృతులను తుడిచివేసి అతనితో ప్రణయసల్లాపాలు కొనసాగిస్తూ కాలక్షేపం చెయ్యసాగింది. విజయవర్మ మీది మాయాజాలం ఉపసంహరించబడగానే అతను తల్లిదండ్రులను తన పూర్వ వైభవాన్ని తలచుకొని విలపించుతూ ఉండేవాడు.
ఇలా ఇక్కడ సాగుతూ ఉంది.
శూరవర్మకూతురు దేవసేనకు యువరాజు, తల్లిదండ్రులతో సహా మాయమయిన సంగతి తెలిసి ఎంతో ఖేధించింది. విచారించగా దీనికంతా కారణం తన తండ్రిగారేనని తేలింది. తండ్రితో సామోపాయం లాభం ఉండదని గ్రహించిన దేవసేన తనుకూడా మారువేషం ధరించి యువరాజుకోసం బయలుదేరి నానా బాధలు పడుతుంది. కొనకు యువరాజును కలుసుకొంది వారిద్దరూ కలిసి ఉండగా చూచిన తిలోత్తమ తన మంత్రిశక్తితో దేవసేనను అష్టకష్టాలపాలూ చేసింది. దేవసేనకోసం బయలు దేరిన సైనికులు ఆమె కనిపించక రాజధాని నగరం చేరుకున్నారు. దేవసేన అడవిలో మహారాజును కలుసుకుని, కాయలను ఆకట్టుకొని తండ్రిమీదకు యుద్ధం చేయడానికి బయలుదేరింది. అక్కడే బానిసగా ఉన్న మహారాణిని కూడా వారు కలుసుకొంటారు, ఈలోగా తిలోత్తమ యువరాజు విచారం చూడలేక అతనికి తన నిజస్వరూపం చూపించి, తన శక్తులను అతనిలో ప్రవేశపెడుతుంది. విజయవర్మ, సేనానిని సంహరించి, రాజ్యం ఆక్రమించుకొని అటు దేవసేనను ఇటు తిలోత్తమను వివాహమాడి ఆ ఇద్దరు సుందరాంగులతోనూ, వైభవోపేతంగా రాజ్యపాలనం చేశాడు.
తారకంగారు, కాగితాలు డ్రాయరుమీదపడేసి, వేళ్ళు విరుచుకొన్నాడు.
"ఎలా వుంది?" అన్నట్లు కళ్ళేగరేశాడాయిన.
ఇందాకట్నించీ, చాలా ఇబ్బందిగా ముఖం పెట్టిన మంజరి ఏదో చెప్పడానికి నోరు తెరచిందో లేదో చలపతి దేవుడట్లే అడ్డుపడ్డాడు.
"బ్రహ్మాండంగా వుంది తారకంగారూ! ఇలాంటి కధ ఇంతవరకూ స్క్రీన్ కాలేదు. ఇహ దేశంలోని డబ్బంతా నవకళా చిత్రాలయ ఆఫీసులోకి చేరిందన్నమాటే!" అన్నాడు చలపతి. "ఓహోహో! బ్యూటిఫుల్ కంపోజిషన్. వండర్ ఫుల్ సీన్స్, మార్వొలెస్ సబ్జెక్టు,. నవకళా చిత్రాలయవారికి మనం మాటిచ్చాంగానీ లేకపోతే, ఇంగ్లీషులోకి మార్చేసి, ఏ హాలివుడ్ కో పంపించేద్దును. కానీ ఏం లాభం! నేనాడినమాట తప్పేవాణ్ని కాదాయె. చాటుమాటున తినడం మీకూ నాకూ అలవాటు కాదాయె. థాంక్యూసార్."
కొన్ని క్షణాలదాకా ఈ ధోరణి మంజరికి అర్ధం కానేలేదు. తనలాగే చలపతికూడా ఈ కధను ఏవగించుకొంటాడని మంజరి ఉద్దేశం. కనీసం బాగులేదనైనా అంటాడనుకొన్నది. అదేదీ జరక్కపోగా చలపతి ఆకాశానికెత్తేస్తున్నాడు. ఇదంతా నిజమేనా. నిజమే అయితే చలపతి వెర్రివెధవన్నాకావాలి. కధల్ని గురించి ఏమీ తెలియకన్నా పోవాలి.
"ఏవండీ అమ్మాయిగారూ? ఎలా ఉంది?" అన్నాడు తారకం గారు.
"నీ మొఖంలా ఉంది" అందామనుకొన్నది మంజరి.
కానీ అనలేదు.
అనకపోగా, సన్నగానవ్వి "ఏం చెప్పమంటారు? ఇలాంటి కధ ఇంతవరకూ నేను వినలేదు. మన్నించాలి. ఈ నిమిషంలో ఇంతకన్నా నేనేమీ చెప్పలేను" అన్నది మంజరి.
గుడ్ గుడ్ కట్టుకుపోయినంత అనుభవం తగులడ్డవాణ్ని, నేనే ఈకధవిని దిమ్మరపోయాను. మనస్సు నిండా ఈ సీన్సే నిండిపోయాయి. కొత్తదానివి నీకెలావుండేదీ నాకు తెలుసు." అన్నాడు చలపతి.
"మరే" అన్నది మంజరి, సాధ్యమైనంత సాదాగా.
నా కింక ఢోకాలేదు. అసలు మీరేమంటారోనని నేను బితుకు బితుకుమంటున్నాను.... అన్నాడు తారకం ఓ సిగరెట్ అంటించుకొంటూ. "ఇందులో -మనం డబ్బు పెట్టినకొందికి అందం తీసుకురావచ్చు. చలపతిగారూ! ఆ స్కోప్స్ నేను కావాలనే అన్ సెర్ట్ చేశాను. మహారాజు భవనం ఉంది. కోర్టుసీన్ ఉంది. బ్రహ్మాండమైన ఉద్యానవనాలుంచాను, మైసూరు వెళ్ళి షూట్ చెయ్యొచ్చు. శూరవర్మ విలన్, ఆఖరికి కూతురు చేతిలో మరణించడం డ్రమెటిక్ ఎడిటింగ్. ప్రేమించిన వాడికోసం స్త్రీ ఏ సాహసమైనా చేస్తుందని నిరూపించడమే కాకుండా, ధర్మంపట్ల దేవసేనకున్న గాఢమైన విశ్వాసం కూడా మనం తెలియచేస్తున్నాం. ఇహ దొంగల ముఠాలు, వారు దొంగతనం చేసే సీన్సు - ఫోర్తు క్లాసును సూదంటు రాయిలా గుంజేస్తాయి. వార్ సీన్సు చాలా ఉన్నాయి. ఇక పోతే దేవలోకం సెట్లున్నాయి. మనం పెట్టే పిండికొద్దీ రొట్టె తయారవుతుందన్న మాట ఎన్ని డాన్సులన్నా పెట్టుకోవచ్చు. తిలోత్తమ, విజయవర్మల లవ్ సీన్ అటు దేవసేన విజయవర్మల సీన్సున్నాయి. కోయగూడెం సెట్ మీద గ్రూప్ డాన్సులు ఎన్నయినా పెట్టుకోవచ్చు. పిక్చర్ మొత్తానికి హైలైట్ మాయాదర్పణం. దాన్ని ఆధారం చేసుకొని యెన్ని వండర్సయినా క్రియేట్ చెయ్యొచ్చు. విజయవర్మకూ సింహానికీ యుద్ధం తిలోత్తమ. విజయవర్మల స్వమ్మింగ్స్, సెల్యూలాయిడ్ కెక్కించడంతో మన మెన్యూయిరాను స్టార్టు చేసినట్లే అవుతుంది అన్నాడు తారకం.
"నిజమేననుకోండి, మరి మంజరి దేవకన్యగా ఉండాలనుకొంటున్నాం గదా -ఆ కారెక్టర్ కే ఎక్కువ ప్రామినెన్సు ఉంటుందంటారా?" అన్నాడు చలపతి.
"తప్పకుండానూ, మనం డెవలప్ చేసుకోవడంలో ఉంటుందండీ అదంతా, దేవసేన హీరోయిన్ అన్నమాటే గానీ, పిక్చర్ లో ఆవిడకున్న ప్రామినెన్సు ఏదీ? తిలత్తమది రొమాంటిక్ రోల్, స్టోరీ యావత్తూ ఆ కారెక్టరుచుట్టూ తిరుగుతుంది. హీరో సక్సెస్ కావడానికి తిలోత్తమ ఉండితీరాలి. అంటే దేవకన్యపాత్ర హీరో కన్నా గొప్పదన్న మాటేగా! కనీసం నాలుగు చోట్ల సాంగ్స్ ఉండొచ్చు. నన్నడిగితే దేవలోకం సీన్సూ, తిలోత్తమలవ్ సీన్సు కలర్లో తీస్తే బావుంటుందంటాను."
"నైస్ సజెషన్" అన్నాడు చలపతి. "ఓ పని చేద్దాం, మీరు సాయంత్రం ఆఫీసుకు రండి, రామబ్రహ్మంగారికి వేంకటేశ్వర్లుకూ వినిపిద్దాం" మీరొచ్చే వేళకు నేనక్కడే ఉంటాను. అన్నాడు చలపతి.
"ఇహ వెళ్ళమని అర్ధం" అనుకొన్నాడు తారకం.
"మరి నాకు సెలవిప్పించండి.... మీ డబ్బు ఇంకో వారం దాకా సర్ధలేను అమ్మాయిగారూ! భగవంతుడు నాకు తెలివితేటలిచ్చాడు గానీ, డబ్బివ్వలేదు, నా ఖర్మ!" అన్నారాయన.
"మీరలా మాటిమాటికీ అనకండి మేష్టారూ! నా దగ్గరుంటే మీ కటువంటి పాతికలు మరింకెన్ని యిచ్చిఉందును. నాకా ప్రాప్తంలేదు...." అని విచారాన్ని వ్యక్తంచేసింది మంజరి.
"అలా అనుకోకండమ్మాయిగారూ! మీకా అభిమానముండడమే పదివేలు, వెళ్ళొస్తాను. సాయంత్రం ఆఫీసులో కలుసుకొంటున్నాంగా!" అన్నాడు తారకం.
"ఓ"
తారకం వెళ్ళిపోయాడు అతనటు వెళ్ళగానే తెక్కట్లాడుతూ నవ్వుదామనిపించింది మంజరికి. కానీ చలపతి ముఖం చూసి ఆగిపోయింది.
కాస్సేపు ఎవ్వరూ పలకలేదు.
చలపతి కాలుస్తున్న సిగరెట్ ను చిరాగ్గా గిరాటేట్టి, ఏదో గొణిగాడు.
"ఏమిటి?" అన్నది మంజరి.
"ఈ తారకం -"
అని ఆగిపోయాడు చలపతి.
మంజరికి పచ్చి వెలగసామెత జ్ఞాపకం వచ్చింది. ఈ తారకం అని ఆగిపోతే తనకేం తెలిసేడుస్తుంది? ఆ వాఖ్యం తరవాత 'చాలా గొప్పవాడు' అని చేర్చినా సరిపోతుంది. 'ఉత్త చెవలవాజమ్మ' అని చేర్చినా ఠక్కున అతుక్కుపోతుంది. చలపతి ఏమనబోయాడో ఎంత ఆలోచించినా మంజరికి తట్టలేదు.
"అవును, తారకంగారు -" అని మంజరికూడా ఆగిపోయింది.
"ఉత్త పిచ్చి వెధవ కాకపోతే - ఏమిటా దిక్కుమాలిన కధా వాడూనూ? ఇంతోసిదానికి నెలరోజులుకావాలా?" అని విసుక్కొన్నాడు చలపతి.
"మరే!" అన్నది మంజరి.
"నీకూ నచ్చలేదు కదూ?"
"అన్నిచోట్లా కాదనుకోండి-" అన్నది మంజరి చాలా జాగ్రత్తగా, తనిప్పుడు ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నట్లు ఆవిడ గ్రహించింది. జాగ్రత్తగా అడుగువేయకపోతే ఏ మందుగాని పేలినా పేలవచ్చు.
"నా కొక్క ముక్క కూడా నచ్చలేదు." అన్నాడు చలపతి.
"నా ఆయుష్షు కూడా పోసుకొని బతకండి బాబూ!" అన్నది మంజరి,. "తారకంగారి కధలోని సీన్సన్నీ నే నిదివరకు చూసిన సినిమాల్లోనే ఉన్నాయండీ! రాజులు, సేనానులు, దేవకన్యలు, డాన్సులు" కత్తియుద్దాలు మాయాజాలాలు -ప్రతి సినిమాలోనూ ఉంటూనే ఉండె, ఇహ ఈయన కొత్తగా రాసిందేముందండీ నా బొంద! యి ముక్కా ఆ ముక్కా తెచ్చి అతికించడమా?"
"నో నో నో....నీ ఇంటర్ ప్రెటెషన్ తప్ప" అన్నాడు చలపతి.
మంజరి నిలువునా నీరైపోయింది.
"కధ బావులేదన్నావు సరేననుకో. అది నేనూ వొప్పుకొంటాను కానీ నా కారణాలు వేరు....నీ గొడవేమిటంటే, అన్ని సినిమాల్లోంచి కాస్త కాస్త ముక్కలు పోగుచేశాడని గదా! అంతవరకూ తారకం చాలా తెలివైన వాడేనంటాను. సక్సెస్ ఫుల్ పిక్చర్స్ లోని ఏ ఘట్టాలు జనానికి బాగా నచ్చాయో, ఓ లిస్టూ రాసుకొని అవీ మన పిక్చర్స్లోనూ వచ్చేలాగా స్టోరీ కంపోజ్ చేయడం చాలా అవసరమే! కానీ, ఆకంపోజింగ్ లో నావెల్టీ లేదు. ఈ సీన్సన్ని కంపోజిషన్లో కొత్తదనం రావాలి. బాక్సాఫీస్ ఫార్ములాను దాటి బ్రతికిన ప్రొడ్యూసర్ లేడు మంజరీ!" అన్నాడు చలపతి. మంజరి ముఖం వెలాతెలా పోయింది. అన్ని సీన్సూ ఉంటూనే కొత్తదనం రావడమంటే ఏమిటో ఆవిడకు బోధపడలేదు. కధలో కొత్తదనం రావాలంటే సంఘటనలుకూడా కొత్తవిగా ఉండాలనిమాత్రమే ఆవిడకు తెలుసు. పాత సంఘటనలు విధిగా ఉంచుతూ, కధారూపం కొత్తగా రావాలన్నదే ఆవిడకు అర్ధం కాలేదు.
"ఇదేదో కొత్త పద్ధతి. నాకీజన్మలో ఇది అలవాటు కాదు" అనుకొంది మంజరి.
"వెంకటేశ్వర్లు గారు పుటుక్కున దీన్నివొప్పేసుకొంటారేమో?" అని తన భయాన్ని వ్యక్తం చేసిందావిడ.
"సాధ్యమైనంతవరకూ కాకుండా చూస్తాను. ముందుగా వెళ్ళి చెబుదాం విన్నాడా సరే సరి! లేదా మట్టిగొట్టుకుపోతాడు. మధ్యలో మనకేం?" అన్నాడు చలపతి.
"అదేమిటండీ మరీనూ! వాళ్ళకేమీ తెలీదనేగా మనం అనుకొంది. పొరబాటున వాళ్ళు తప్పటడుగువేస్తే చూస్తూ చూస్తూ ఊరుకోవడం భావ్యమా? ఈ తుక్కు కధకు పిక్చరైజ్ చేసి వాళ్ళు నాశనం కావడాన్ని మనమేట్లా వొప్పుకుంటాం?" అన్నది మంజరి.
చలపతి రుసరుసలాడిపోయాడు.
"నువ్వు సినిమాల్లో వేషాలకోసం వచ్చావా? లోకాన్ని ఉద్దరించడానికి వచ్చావా? సాంఘిక సేవ చెయ్యదల్చుకుంటే, ఈ ఫీల్డును వొదిలెయ్యి -వాడెవడో నాశనమయిపోతాడని గోల పెట్టకు, నాకామాత్రం తెలుసు". అన్నాడు చలపతి.
మంజరి కళ్ళనీళ్ళపర్యంతమయింది. గుడ్లనీరు గుడ్లకక్కుకొంటూ లోపలికొచ్చింది. తలుపు పక్కనుండి ఈ గొడవంతా వింటున్న తాయారు ఊరుకోండమ్మా అని మంజరిని సముదాయించింది.
తను అల్లిన కధమీద తారకంగారికి బ్రహ్మాండమైన నమ్మకముందేమో మనకు తెలీదు. అతనా సాయంత్రం యెంతో ఉత్సాహంగా నవకళా చిత్రాలయవారి ఆఫీసుకొచ్చి దస్త్రం విప్పాడు. తారకం వచ్చిన పావుగంటకు చలపతి వచ్చాడు. కధ విన్న తరువాత రామబ్రహ్మంగారూ, వుంటున్నప్పుడే వెంకటేశ్వర్లుగారూ చప్పరించేశారు.
"ఇంతకన్నా మంచికధ మనకు దొరకని పక్షంలో మనం సినిమా ఆలోచనే మానుకొందాం!" అన్నాడు రామబ్రహ్మంగారు.
తారకం ఆ మాట విని గతుక్కుమన్నాడుగానీ, ఆ ఉదుటున బైటపడనివ్వలేదు.
"ఈ కధల నావెల్టీలేదు తారకంగారూ! మన ధ్యేయం మీకింకా బోధపడినట్లు లేదు. మాంఛి జానపద చిత్రం తీయడం డబ్బు దోచుకోవడం మాత్రమే మన లక్ష్యం కాదు. అంతకన్నా ముఖ్యం, ప్రతి విషయంలోనూ 'మనదీ' అని స్పష్టంగా తెలిసివచ్చే 'ఇంప్రెషన్' ఒకటి కలిగించాలి. ఇప్పుడు మీరు చెప్పిన కధలో లోగడ వచ్చిన సినిమాల్లోని
ఇన్సిడెంట్లన్నీ ఉన్నాయి. అవన్నీ డబ్బు తెచ్చిన మాట నిజమే! కానీ మన వొరిజినాలిటీలేదు.... ఏమండీ చలపతి గారూ! మీరేమంటారు?" అన్నాడు వెంకటేశ్వర్లు.
చలపతి ఓ నవ్వు నవ్వాడు.
అందులో తలా వొక అర్ధం గోచరించింది. అంతేగాని నోరు తెరచి 'ఇదేమీ' అన్న ముక్క అనలేదు.
"చిత్తం. ఆ అనుమానం నాకూ ఉన్నదనుకోండి, అయినా ఇదే ప్రారంభం గనక, మనం అట్టే ఆందోళనపడనవసరం లేదు. ఇంకా నా దగ్గర కట్టుకుపోయినన్ని కధలున్నాయి. అవన్నీ మనం కూచుని డిస్కస్ చేద్దాం. వాల్లో మనకు నచ్చిన థీమ్ నెన్నుకొని, స్కీన్ కు ఎడాఫ్ట్ చేసుకొందాం. నాకు మరో అవకాశం ఇవ్వండీ!" అన్నాడు తారకం.
"ఇలా నీ తోనే రోజులన్నీ గడిచిపోతే ఎలా? ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయింది గదా! ఇంతవరకూ 'హరివో'మ్మంటూ ప్రారంభమే లేదాయె... ఈ పంపిణీ మీద మనం ఎప్పటికి తేలేటట్టు?" అని విసుక్కున్నాడు రామబ్రహ్మం.
"మనం రెడీగా ఉన్న మరోకధ నేదయినా పుచ్చుకొందామంటారా?" అన్నాడు చలపతి.
తారకం ముఖంమీద మబ్బులు కమ్మినట్లయింది. చలపతి ఆ సంగతి గ్రహించి అస్త్రం విసిరాడు.
"తారకంగారు మనకు పెద్దదక్షత. ఈ పరిశ్రమలోని లగుబిగువులన్నీ వారికి క్షుణ్ణంగా తెలుసు. వారికధను అడ్డదిడ్డంగా మార్చడం నాకూ ఇష్టంలేదు. రామబ్రహ్మంగారేమో త్వరగా సినిమా లాగెయ్యాలనుకొంటున్నారు. అంచాత మనమోపని చేస్తే బావుంటుందనుకొంటాను. ముందుగా ఓ అయిదారు వేలు పారేసి రెడీగా ఉన్న స్క్రిప్టు కొనేద్దాం. దీన్ని రిలీజ్ చేశాక మనం రవంత తాపీగా తారకంగారి కధను పిక్చరైజ్ చేయవచ్చును. ఈ లోగా వారు మనక్కావలసినవిధంగా కధను తయారు చేస్తుంటారు.... ఇది మంచి పద్దతని నా అభిప్రాయం, మీరూ అలోచించిచెప్పండి" అన్నాడు చలపతి.
తారకంగారు ఏమీ అనలేకపోయాడు. రామబ్రహ్మంగారికి సూచన బాగా నచ్చింది.
"అలానే కానివ్వండి బాబూ! ఆలూలేదు, చూలూ లేదు అబ్బాయి పేరు సోమలింగమన్నట్లుగా ఇప్పటికే వేలమీద డబ్బు నలిగింది. పిక్చర్ పూర్తయ్యేసరికి నా పొలమంతా అమ్మాలిసొచ్చేటట్టుంది! అని గొణుక్కున్నాడు రామబ్రహ్మం.
తారకం గారూ, చలపతిగారూ బయటికొచ్చాక "నన్ను మన్నించాలి తారకంగారూ! మీ మేలుకోరే యిలా చేశాను. మీకు కోపం రావడం సహజమేగానీ, నా అభిప్రాయం తెలిస్తే మీరలా అనుకోరు" అన్నాడు చలపతి.
తారకం ముఖం ఇంకా ముడుచుకునే ఉంది.
"ఈ కధ రాయడంవల్ల -ఈ కంపెనీ కివ్వడం వల్ల మీకు వొరిగేదేమన్నా ఉన్నదా? జీతె రాళ్ళుతప్ప, చిల్లికానీ ఇవ్వరు. కధ చూదామా - నభూతో న భవిష్యతి. ఇంత మంచి కధను ముష్టి నూట యాభై రూపాయల నెలజీతానికి మీరివ్వడంలో అర్ధంలేదు. నేనింకో కంపెనీని మాట్లాడి ఉంచాను కధను రెండుమూడు వేలకు అమ్మి పెట్టే పూచీనాది, డైలాగ్స్ సాంగ్సు కూడా మీరే రాస్తానంటే వాటికి విడిగా మాట్లాడుకొందాం. ఈ వెధవలకు చివరా మొదలూ తెలీదు. ఇంకో కధను - మామూలుదాన్ని -వీళ్ళ ఎదాన కొడతాను, ఆ దెబ్బతో రోగం కుదురుతుంది" అని నచ్చచెప్పాడు చలపతి
"మీ దయ అంతకన్నా నేనేమీ అనలేను" అన్నాడు తారకం సెలవు పుచ్చుకొని వెళ్ళిపోతూ.
చలపతి ఆ పట్టు పట్టు రాత్రి పది గంటలదాకా తిరిగి, శ్రీకాంత్ ను స్టూడియో గేతుదగ్గర కలుసుకొని, కారులోకి ఆహ్వానించి భుజంమీద చెయ్యివేశాడు.
"ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదేం బ్రదర్" అన్నాడు చలపతి తనో సిగరెట్ వెలిగించి శ్రీకాంత్ కు ఇంకోటి ఆఫర్ చేస్తూ.
శ్రీకాంత్ సిగరెట్ తీసుకొని వెలిగించాడేమోగానీ, ఏమీ మాట్లాడలేదు.
"ఎక్కడన్నా కుదిరావా?"
"లేదు" అన్నాడు శ్రీకాంత్.
"ఆ మధ్య నువ్వేదో పిక్చర్ లో ఓ చిన్న వేషమేదో వేస్తున్నావని విన్నాను.....అవునుగానీ భాయీ! నీ దగ్గర రెడీగా స్టోరీ ఏమైనా ఉన్నదా? కాష్ అండ్ కారీ బిజినెస్. కథ నచ్చిందంటే అయిదొందల రూపాయలు ఘోల్లున చేతిలో పడతాయి. ఆలోచించుకో" అన్నాడు చలపతి.
"ఏమీ నేవండీ!" అన్నాడు శ్రీకాంత్ విచారంగా "దివ్యమైన కధలు పట్టుకొని అయిదేళ్ళపాటు అన్ని కంపెనీల చుట్టూ తిరిగాను, అందరూ కధలు వినిపించుకొన్నారు. నా కధల్లోని సంఘటనలను పెట్టి సినిమాలు తీశారు నా కధలే కాస్త అటూ ఇటూ మార్చి. పిక్చర్లు తీశారు. నా పేరు లేదు కనీసం నాకు పావలా డబ్బులు కూడా గిట్టలేదు. అవన్నీ పెరున్నరచయితల పేరుమీదగా వచ్చాయి. మహాకవి మాధవశ్రీగారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాను. వారి పేరుమీదుగా వచ్చిన 'రాసక్రీడ'మూడు రాత్రులు' పిక్చర్ కు నేనే పనిచేశాను. కనీసం జీతం డబ్బులుకూడా అందలేదు. ఎప్పుడడిగినా లేదనేవాడు. కానీ చచ్చేట్టుతాగి రోడ్లమీద దొర్లడానికి డబ్బుఉండేది. ఛాఛా! ఏం మనుషులండీ!" అన్నాడు శ్రీకాంత్.
ఈ కబుర్లేమీ చలపతిని కదిలించలేదు.
"అందుకని నేను మావూరు వెడదామనుకొంటున్నాను."
"మరి వెళ్ళలేదేం?" అన్నాడు చలపతి.
"డబ్బు లేదండీ! మొన్నోపిక్చర్లో ఎక్స్ట్రా వేషం వేశాను లెండి. పదిరూపాయలు రావాలి. వారం రోజులనుండి ఎక్స్ట్రా కంట్రాక్టర్ ఇదిగో, అదిగో అని తిప్పితిప్పి చంపుతున్నాడు. అతనికోసమే గేటుదగ్గరున్నాను. నేను వెడితేగానీ వాడురాడు. వాడొస్తేగాని నేను కధలను. ఈ డబ్బు అందగానే బండెక్కేస్తాను. ఈ మద్రాసుకు ఇంతటితో గుడ్ బై!" అన్నాడు శ్రీకాంత్.
"మళ్ళా ఏదన్నా మంచి ఛాన్స్  నీకుదొరికిందనుకో, ఉండిపోగాలవా?" అన్నాడు చలపతి.
అతను చెప్పే సమాధానం కోసం చలపతి చెవులు రిక్కించాడు.
"నా కా అభిప్రాయం లేదండీ!"
"ఓరి పిచ్చివాడా! ఈ ఇండస్ట్రీని గురించి నీ కేమీ తెలిసినట్టు లేదు. ఎవరిమీదోయ్ నీ కోపం! ఇప్పుడు  మహాకవులని పేరు తెచ్చుకొన్నవారందరూ ఈ బాధలన్నీ పడ్డవారే! నీ ముఖానే పొద్దుపొడిచిందనుకోకు.... చాలా కాలంనుండీ నీ కేదన్నా ఉపకారం చేదామనుకొంటున్నాను. ఆ అవకాశం ఇప్పటికి దొరికింది. ఇంద  -ఈ వందరూపాయలూ దగ్గరుంచు. రేపు ఉదయానికి నీ దగ్గరున్న కధలన్నీ పట్టుకొని, నన్ను కలుసుకో, నాకు నచ్చిన కధేమన్నా దొరికిందంటే మిగతా నాలుగొందలు ఆన్ ది స్పాట్ నీకు పే చేస్తాను. ఏ కధా నచ్చలేదనుకో ఈవందా నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు. "చలపతి పది రూపాయల నోట్లు తీసి శ్రీకాంత్ జేబులో ఉంచాడు. "మరి నువ్వింకా ఇక్కడే తాత్సారం చెయ్యకు. ఆ కాంట్రాక్టర్ గాడు నీకిక దొరకడు. ప్రొడ్యూసర్ డబ్బిచ్చాడో లేదో తెలీదు. ఇచ్చినా ఇటు రాడు, ఇవ్వకపోయినా రాడు. హాయిగా భోంచేసి నిద్రపో ఉదయం మా ఇంటికి రా. నీకోసం కాఫీకూడా తాగకుండా ఎదురు చూస్తుంటాను. నిన్ను రూం దగ్గర దిగబెట్టనా?"
శ్రీకాంత్ కళ్ళు మిలమిలలాడాయి.
ముఖంలో ఆశారేఖలు మోసులెత్తాయి. నోట్లను జేబులో కుక్కుకొని సీటుకు జేరగిల బడ్డాడు. అతనికళ్ళు నీటితో నిండిపోవడం చలపతి గమనించాడు.
ఉదయం శ్రీకాంత్ ను చూస్తూనే తను రాత్రి నిద్రపోలేదు. అనుకొన్నాడు చలపతి. అతను కూచున్నాక మంజరిని పిలిచి పరిచయం చేశాడు.    "మీరు మంచిదనుకొన్న కధను వినిపించండి!" అన్నాడు చలపతి.
శ్రీకాంత్ కధ చదవటం ప్రారంభించాడు.

 

 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSanskrit ManuskriptSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaTelugu Descriptive CatalogueTelugu ManuskriptUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra