Home » Kurumaddali vijayalakshmi » కథానాయకి

 

     అప్పడు పిల్లలు గుర్తుకు వచ్చారు. సుభద్రమ్మకు. " ఊరికే కూర్చోపోతే అలా వెళ్ళి పిల్లలను కేకేయరాదూ?" అంది రామభద్రయ్యతో

    "నేను కూర్చుంటే చూచి ఓర్వలేవు," విసుక్కుంటు లేచి ఉత్తరీయం దులిపి బుజాన వేసుకొని బైటకు నడిచారు రామభద్రయ్య.

    "అమ్మా!"  చిన్నగా పిలిచింది అనుపమ.   

     "ఏమిటి  పెద్దమ్మాయీ?!

    " అమ్మా!మరి...మరి...." తను ఆడగాల్సింది ఎలాగో తెలియలేదు అనుపమకు.

     ఏదో ఆడగాలని తటపటాయిస్తున్న  కూతురిని చూచి లేచి దగ్గర కొచ్చి కూర్చుంది. తలమీద  చేయివేసి నిమురుతు. "ఏమిటమ్మా పెద్దమ్మాయీ! అడుగు " అంది ప్రేమగా సుభద్రమ్మ.   

    "పెద్ద మనిషి కావటం అంటే ఏమిటమ్మా ?"

    ఉదయం నుంచీ  ఏదయితే తనమనసులో దూరి పురుగూలా తొలుస్తున్నదో అదేమాట అనుపమ నోటివెంట విని  విపరీతంగా చలించిపోయింది. సుభద్రమ్మ. అయోమయంగా చూచింది.
   
     తల్లి మాట్లాడకపోవటం చూచి, పెద్దమనిషి కావటం అంటే నీకూ తెలయదా అమ్మా? అంది అనుపమ.

    అనుపమడిగిన తీరులో  ఏన్నో అర్దాలుతో చాయి సుభద్రమ్మకు.

     "నాకు తెలుసు. తెలియంది ఎవరెవరికి-?" దడదడ లాడుతున్న గుండెని చక్కపట్టుకొని  లాలనగా అడిగింది సుభద్రమ్మ.   

     అనుపమ పూసగుచ్చినట్లు అంతా చెప్పింది. ఆఖరికీ అన్నీ తెలిసిన రాజుకి కూడా యి విషయం తెలియదలేదని  చెప్పింది.

    రాజు పేరినంగానే సుభద్రమ్మకు చిర్రెత్తుకొచ్చింది.

    " పెద్దమ్మాయీ! భగవంతుడు చూపు ప్రసాదించకుండా నిన్న న్యాయం చేశాడన్న ఒక్క భాదే అనుకున్నాను.  అమాయికురాలిని చేసి మరింత అన్యాయం  చేశాడు. రోజూతో నీకేం కబుర్లు వాళ్ళ మామయ్యకు  మీ నాన్నకు ఒకరి చూస్తే మరొకరికి  యిసుమంతయినా  పడదు. రాజుతో మాట్లాడవద్దన్నానా? పోనీ మాట్లాడావే అనుకో, యివా అడగవలసిన మాటలు? తెలివితక్కువదని గ్రహించారంటే మరింత ఆటలు పట్టిస్తారు. రాజు పెద్ద పిల్లవాడు ఆధాటుగా మరింత ఆటలు పట్టిస్తారు. రాజు పెద్దమనిషి వాడు .అధాటుగా చూస్తే యిరవైఏళ్ళవాడు గుర్తుకు వస్తాడు"

    తల్లి ఏమంటుందో అర్థం కాలేదు అనుపమకు.

     "రాజు చెపితే అర్థమవుతుంటే  పెద్దమ్మాయీ?" పిడికిలి  బిగించి  నుదురు కొట్టుకుంది సుభద్రమ్మ.

     అనుపమ మాట్లాడలేదు .తనడిగింది ఏదో తప్పయి వుంటుందిఅనుకుంది.

     పెద్దమ్మాయీ! చూడలేకపోవటం వల్ల కొన్ని చెప్పినా అర్ధం కావు.అన్నీ అడగకూడదు. విన్నవాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు నువ్వడి గావు." పెద్దమనిషి కావటం అంటే ఏమిటని."  అలా అర్థం కానిమాటలు విని వూరుకోవాలి నాతోకూడా ఏం చెప్పకు.అడగకు. నిన్ను చూస్తుంటేనే దుఖ్ఖం ముచుకొస్తున్నది.  నువ్వడిగే ప్రశ్న  లింటుంటే....భగవంతుడా పగవాళ్ళను కూడ ఇంత ఘోరంగా శిక్షించకు" అంటూ దోసెట్లో ముఖం కప్పుకుంది సుభద్రమ్మ.

     ఈ మధ్య  సుభద్రమ్మకో జబ్బుపట్టుకుంది. పెరుగుతున్న కూతురుని చూస్తుంటే, అర్థంలేని ఆలోచనలు, చిరాకు, కోపము హెచ్చుతున్నాయి.ఆవేశంతో ఏదో ఒకటి గంటల తరబడి కళ్ళనీళ్ళుపెట్టుకోటం చేస్తున్నది

    తల్లి ఏడుస్తున్నట్లు గ్రహించుకుంది. అనుపమ.   

     " ఏడవకమ్మా!  ఇంకెప్పుడూ నిన్నేం అడగనుగా?" అంది.

     అప్పుడే రామభద్రయ్య పిల్లలతో ఇంట్లో అడుగుపెట్టాడు. చీరచెంగుతో కళ్లు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. సుభద్రమ్మ.

     "అక్కా! అక్కా!" అంటూ అనుపమ చుట్టుమూట్టారు పిల్లలు .
   
     "అర్థంలేని ప్రశ్నలేసి తల్లిని బాధ పెట్టకూడదు." అనుకుంది అనుపమ.

                                                                               3

    రాజు  ఇంట్లో అడుగుపెట్టాడు.   

     రాజు భయపడ్డట్టుగా ఇంట్లో మామయ్య రఘుపతి లేడు. ఆ సంగతి తెలిసి తేలికగా  వూపిరి పీల్చుకున్నాడు.

     చుక్క ఎదురొచ్చింది  "బావా! బావా!" అంటూ.

     ఇంటికి రాగానే  ఇదొకతి బావా!బావా! అనుకుంటు లోలోపల విసుక్కున్నాడు. "ఏమిటే చుక్కమ్మా?" అన్నాడు రాజు కళ్ళెగరేసి.

    "నా పేరేం చుక్కమ్మకాదు!చుక్క" బుంగమూతి పెట్టి అందిచుక్క.

    " సరె,  సిరి,చుక్క ,మొగ్గ..... ఎందుకు పిలిచావో చెప్పు?"

    "అలాగ ఎగతాళిచేస్తే నేనేం చెప్పను?"

    "చుక్క మామంచిది.చుక్కంటే నాకుభలే యిష్టము. చుక్క చాలా అదంగా వుంటుంది." అన్నాడు రాజు ,కళ్ళు మూసుకుని పాఠం అప్పజెప్పినట్లు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra