Home » Chandu harshavardhan » అధికారి

    అతను ఆంధ్రాలో రోజు రోజుకు జన్మదిన ప్రవర్ధనంగా పెచ్చు, పెరిగిపోతున్న నక్సలిజానికి ఊపిరి పోసాడు. అతని హృదయ స్పందన, ఊపిరి అన్నింటా సిద్దాంత ఛాయలే నిండిపోయాయి. అతని చివరి రక్తపు బొట్టు సయితం ఆత్మార్పణకే అంకితం అన్న కఠోర నిర్ణయంతో ఉన్న వ్యక్తి అతడు.
   
    అతను ప్రోవిన్షయల్  కమిటీ మెంబరు, తలమీద పదిలక్షల రూపాయల రివార్డు కల ఓ మహాశక్తితో తను మాట్లాడుతున్నది అన్న విషయం అధికారికి తెలియక కాదు.
   
    ఆ వ్యక్తి రామరాజు, అతను దగ్గర వున్న ఎకే47 కన్నా; తీవ్రవాద సిద్దాంతాన్ని మించిన పదునైన ఆయుధం తన దగ్గర వుంది అదే అధికారి దీమా!
   
    "ఏం ! మాట్లాడరేం?"
   
    మీ గొంతు పూడుకుపోయిందా? లేక  జవాబులేక మూగబోయిందా?"
   
     అధికారిలో ఆవేశం చూసిన అతనికి నవ్వొచ్చింది.
   
    అతను పగలపడి నవ్వాడు.
   
    "నవ్వండి... ఇంకా నవ్వండి... బిగ్గరగా నవ్వండి.... మిమ్మల్ని చూసి ఈ సమాజం నవ్వక ముందే  తనివి తీరా నవ్వుకోండి....."
   
    ప్రోవిన్షయల్  కమిటీ మేంబరు అంటే ఆషామాషీ కాదు. అతనికి రక్షణగా శరీర దారుడ్యంలో, ఉక్కు మనిషిలా వున్న ఓ నలుగురు అంత రంగికులు అతనికి నలుగువేపులా ఏ.కే 47 రైఫిల్స్ తో రక్షణగా వున్న సంగతి అధికారి గమనించలేదు.

    అధికారి నువ్వు ఇక్కడనుంచి నిర్భయంగా వెళ్ళవచ్చు. నీకు చివరిసారిగా చెబుతున్నాను. ఇది నువ్వు  హెచ్చరిక  అనుకున్నా హితవు అనుకున్నా అదంతా నీ ఇష్టం మరలా ఇలాంటి సాహసం మరెప్పుడూ చేయకు. జీవితంలో ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాల్సిన వాడివి. పదవిలో ప్రమోషన్స్ లో ఇంకా చాలా క్రింది స్థాయిలోనే ఉన్నవాడిని, మీ ముందున్న ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోకు. మా స్థావరానికి వచ్చి మా కార్యక్రమాలను తెలుసుకుని బ్రతికి బట్టకట్టి కాకీ డ్రెస్ వేసుకున్న పోలీసు ఆఫీసర్ ఎవ్వరూ ఇంతవరకు పుట్టలేదు. ఆ ఘనత నీకే దక్కింది.... వెళ్ళు..... వెళ్ళి నిర్భయంగా నీ వాళ్ళకు చెప్పు.... పోరాటమే మా మార్గమని, ఈ దేశానికి సాయుధ మార్గం ద్వారానే అసలు సిసలైన స్వాతంత్యాన్ని ఈ బూర్జువాలనుండి, ఈ కెపిటలిస్థలనుంచి తీసుకువస్తామని, సమసమాజాన్ని స్థాపిస్తామని అందాకా మాలోని తుది రక్తపు బొట్టు ఉన్నంత వరకు ఈ ఉద్యమం కోనసాగిస్తామని అందాకా మాలోని తుది రక్తపు బొట్టు ఉన్నంత వరకు సంఖ్యలో వచ్చినా మిమ్మల్ని మా ఉద్యమాన్ని నీరు కార్చలేరని చెప్పు....."
   
    రామరాజు గొంతు నుండి నలుదిక్కుల దద్దరిల్లుతున్న చందన మెటాలిక్ వాయిస్ వేలువడింది.
   
    అధికారికి అదేమీ కొత్తకాదు. తొలి అనుభవం అంతకంటే కాదు. తను అన్నింటికి సిద్దపడే ఇక్కడికి వచ్చాడు ఈ రోజు తాడోపాడో అమీ తుమీ సరాసరి రామరాజుతోనో తేల్చుకోవడానికే తేల్చుకోవాలనే వచ్చాడు.

    తను ఈ విషయంలో   వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.
   
    "యూ ఆర్ అండర్ అరెస్టు...." అధికారి పిస్టల్ కాచ్ చేయడం, అతనికి గురిపెట్టడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
   
    అంతే క్షణంలో వెయ్యోవంతు, కనుమూసి కను తెరిచే లోగా జరిగిపోయిందక్కడ ఓ దారుణ సంఘటన......
   
    ప్రోవిన్షయల్ కమిటీ మెంబర్ కి రక్షణగావున్న సాయధుడి ఒకడు గురిచూసి  అధికారి కుడి భుజాన్ని ఘాట్ చేశాడు.
   
    అదే క్షణంలో అధికారి గురితప్పలేదు. అతని పిస్టల్ ను దూసుకువచ్చిన బుల్లెట్ రామరాజు కుడి భుజాన్ని తాకింది.
   
    అధికారి, ప్రోవిన్షయల్ కమిటీ నాయుకుడు రామరాజు "అమ్మా...." అంటూ ఆర్తనాదాలు ఆ అడవితల్లి రోధనన్లో కలసిపోయాయి. 
   
                                                                              33
   
    హిల్, టాఫ్ గెస్ట్ హౌస్.
   
    సాధారణ వ్యక్తులు కలలోకూడా ఊహించలేని ఆధునాతన సౌకర్యాలుగల ఆ గెస్టు హౌస్ ని వి.ఐ.పి. లకు మాత్రమె కేటాయిస్తారు.
   
    భారత ప్రధాని స్వర్వీయ ఇందిరాగాంధీ గతంలో ఆ గెస్టు హౌస్ లో బసచేశారు. ఆమె వాడిన వస్తువులు, బెడ్, సందర్శకుల, కోసం ఆమె బసచేసిన ఘాట్ లోనే భధ్రపరిచారు. అంతటి ఘన చరిత్ర గల ఆ గెస్టుహౌస్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే.
   
    అది కేవలం ప్రలోభాలవల్లనో, భయపెట్టో లేక అవకాశం చిక్కోఆ గెస్టుహౌస్ లోని ఓ.సి.పి. సూట్ ఇప్పుడు పోలీసుల అదేనంలో వుంది.
   
    "నీ పేరు ఏమిటే లం.....?" సౌత్ ఇన్స్ స్పెక్టర్ పోలీసు బాషలో ఆమెను ఇంటరాగేషన్ చేస్తున్నాడు.
   
    ఆమె పేరు విశాలాక్షి, రౌడీషిటర్ , నిన్న మొన్న టి దాకా అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఇటీవలే బహిష్కరణకు గురి అయిన పృధ్వీ భార్య విశాలాక్షి.
   
    "ఏమే.... నిన్ను నేను మనభ౦గం చేశానా?"
   
    ఆమె కాదనట్టు తల అడ్డంగా వూపింది.

    "నా మీద తప్పుడు కేసు పెడతావటే? చట్టానికి కళ్ళు, చెవులు లేవనుకున్నావా? ఎవడు పెట్టమన్నాడే నామీద తప్పుడుకేసు! నీ మేగుడా? లేక నీ రంగు మేగుడా?"
   
    ఆమె ఆ మాటలు వినలేనట్టు చెవులు మూసుకుంది.
   
    "ఇటు చూడవే, ఎంత నంగానాచివో నేల చూపులు చూస్తే నిన్ను వదిలేస్తాననుకున్నావా? ఇవ్వాళ నీ అంతు చూడందే వదలనే...."
   
     ఆమె కళ్ళు వెంట నీళ్ళు చిప్పిల్లాయి. ఆమెను కుర్చీలో బలవంతాన కూర్చోబెట్టి వెనక్కీ విరిచి కట్టారు. ఆమె విదిలించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె పమిట చెదిరింది. ఆమె భుజాలపైన, నడుం క్రింద బిగదీసి కట్టడం వల్లనో ఆమె ఆవేశం, అందోళన, భయంతో ఆగి ఆగి భారంగా శ్వాస తీయడం మూలంగానో, ఆమె లోనేక్ జాకెట్ లోంచి రెచ్చగొట్టే భంగిమల్లో కనువిందు చేస్తున్నాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra