Home » Chandu harshavardhan » అధికారి

    ఆడపిల్ల చేయి పట్టు కోవడానికే భయపడుతున్నారు, రేపు వధువుతో ఏడడుగులు నడవడానికి ధైర్యం వుంటుందా?"
   
    "ఒకసారి వెనక్కీ తిరిగి చూడండి, మీ ధైర్యం ఏ పాటిదో తెలుస్తుంది" అన్నాడు.
   
    అప్పుడే కమిషనర్  కారు ఆఫీసు ప్రాంగణంలోకి ప్రవేశించింది.
   
    "అమ్మో! కమిషనర్ గారు వస్తున్నారు. ఇక నేను వెళతాను అధికారిగారు...." అంటూనే తన గదివైపు పరుగుతీసింది వరలక్ష్మి.
   
    అధికారి ఆమె కంగారునుచూసి తనలో తానె నవ్వుకున్నాడు.
   
    కూలింగ్ గ్లాసెస్ గుండా కమిషనర్, అధికారిని, వరలక్ష్మిని గమనించిన సంగతి వాళ్ళిద్దరికీ తెలియదు.
      

                                                              *    *    *    *
    

    కమిషనర్ విక్రమ్ కారు పృధ్వీ శిబిరం ముందు ఆగింది.
   
    కమిషనర్ కారు దిగడంతోనే శిబిరం ముందు గుమిగూడి వున్న జనం చెల్లా చెదురై పోయారు.
   
    పోలీసు కమిషనర్ సరాసరి పృధ్వీ దగ్గరకు వెళ్ళాడు.
   
    శిబిరంలో కూర్చున్న పృధ్వీ అనుచరులు కమిషనర్ ఉగ్రరూపం చూడడంతోనే శిబిరం వెనకకు మెల్లమెల్లగా జారుకున్నాడు.       
   
    "ఇది చాలా అన్యాయం సార్. మేము చాలా ప్రశాంతంగా మా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. కాని మీరు, మీ సిబ్బంది మా మీద కక్ష సాదిస్తున్నారు. మీరు ఎన్ని అవాంతరాలు కల్పించినా నా దీక్ష కొనసాగిస్తాను. నా కోన ఊపిరి ఉన్నంత వరకు శాంతిమార్గంలోనే న్యాయం, ధర్మం, కోసం పోరాడుతాను....."
   
    కమిషనర్ పృధ్వీ కాలర్   పట్టుకుని పైకి లేపాడు.
   
    ఇది అమానుషం! ఇది ప్రజాస్వామ్యమా? మిలటరీ ప్రభుత్వమా? సోదరులారా భయపడకండి. ఈపోలీసు లాఠీలు, తుఫాకులు మనల్ని ఏమీ చేయలేవు. శాంతియుతంగా పోరాడుతున్నా అమాయుకలను అధికార పక్షంవాళ్ళు పోలీసు జులు౦తో అణచి వేయడానికి కుట్రపన్నారు. దయచేసి మీ రేవ్వరూ వెనకడుగు వెయవద్దు. ఆ ధైర్యంతో పారిపోవద్దు. ఎన్ని బూర్జువా శక్తులు అడ్డుకున్నా మన జనశక్తి ముందు ఓడిపోక తప్పదు. నామాట మీద విశ్వాసముంచి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమించండి. పోలీసుల అక్రమ అరెస్టులు త్రిప్పి కొట్టండి....." పృద్వీ గొంతు చించుకుని అరుస్తున్నాడు.
   
    అప్పటికి కమిషనర్ వెనకాలే వచ్చిన డిసిపి, ఎసిపి ఇన్స్ స్పెక్టర్లు అధిక సంఖ్యలో వున్న కానిస్టేబుల్స్ తమ తమ లాఠీలకు పని కల్పించారు.
   
    అప్పటిదాకా నినాదాలిచ్చిన జనం, కనుచూపు మేరలో కనిపించండం లేదు.
   
    "యూ బ్లడీ క్రిమినల్... పదరా పద...." కమిషనర్ కాలర్ పట్టుకుని పృద్వీనీ బరబరా ఈడ్చి శిబిరం బయట పడేశాడు.
   
    అక్కడ విలేఖరులు, ఫోటో గ్రాఫర్స్, న్యాయవాదులు ఉన్నారు. సిటీ కమీషనర్ ని రాపిడ్ యాక్షన్ లో చూడడం బహుశా వాళ్ళందరికీ అదే మొదటిసారి కావచ్చు.
   
    కెమెరాలు క్లిక్ మన్నాయి.
   
    "మీరంతా చూసి కూడా ఈ అన్యాయాన్ని ఖండించలేరా? నా భార్యను పోలీస్ స్టేషన్ లో ఉంచి మానభంగం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న నన్ను నా, అభిమానులపైన నిర్దాక్ష్యిన్యంగా లాఠీ చార్జీ చేశారు. .... ఈ దారుణాన్ని అపలేరా?" పృధ్వీ శక్తినంతా కూడదీసుకుని అరుస్తున్నాడు.
   
    పోలీసులు స్టేషన్ లో తన భార్యను మానభంగం చేశారన్న అసత్యపు అభియోగానికి పోలీసులంతా ర్యాంక్ తేడాలేకుండా కుతకుత ఉడికి పోతున్నారు. అప్పటి దాకా అవకాశం కోసం ఎదురు  చూస్తున్న సౌత్ ఇన్ స్పెక్టర్ బేడీలు తీసుకుని ముందుకు వచ్చాడు.
   
    పృధ్వీ చేతులకు బేడీలు తగిలించి అతని వంటిమీద వున్న దుస్తులని పిలిచి పారేశాడు.
   
    అప్పుడు పృద్వీ నడిరోడ్డుమీద కేవలం ఓ డ్రాయరులో ఉన్నాడు.
   
    "ఊ చూస్తూనే తన్నుకుంటూ తీసుకువెళ్ళు,,,," కమిషనర్ విక్రమ్ హుకుం జారే చేయడంతోనే సౌత్ ఇన్ స్పెక్టర్ పృద్వీనీ తన్నుకుంటూ, నడిరోడ్డమ్మట ఈడ్చుకుంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషను కు తీసుకువెళ్ళాడు.
   
    "సార్.... " ప్రెస్ వాళ్ళు సిటీ కమిషనర్ తో మాట్లాడడానికి ప్రయత్నించారు.

    "గో ... బ్లడీ రౌడీషీటర్, వాడి గురించి మాట్లాడాటానికి ఒక్క క్షణం కూడా వృధా చేయడం నాకిష్టం లేదు...."
   
    "ఇట్స్ ఒకే సార్ ... కాని ఏ చట్టం ప్రకారం అతన్ని, మీ సిబ్బంది తన్నుకుంటూ తీసుకువెళ్ళారు.
   
    లాయలోకరు కమిషనర్ ని నిలదీశాడు.
   
    కమిషనర్ భృకుటి ముడిపడింది. _ తల తిప్పి ఓ సారి లాయర్ కేసి చూశాడు.
   
    "హు ఆర్ యూ?" కమిషనర్ గొంతు ఖంగుమంది.
   
    మరో ప్రక్క పోలీసు సిబ్బంది అతని చేయి పుచ్చుకుని తగ్గమన్నట్టు ప్రక్కకు లాగారు.
   
    "ఐయాం నాట్ ఎ క్రిమినల్, ఐయాం ఎ లాయర్, మీరు నన్ను ఆపాలని చూసినా... నేను ఆగానుగాక ఆగాను... అతను మరింత పెట్రేగిపోతున్నాడు.
   
    "ఆఫీసర్స్  _ మీరు ఆగండి అతగాడికి నేను సమాధానం చెబుతాను, ఏయ్ మిస్టర్! పృధ్వీ నీ కేమవుతాడు? అసలు అతను ఎవరో నీకు తెలుసా?" ఈ సారి కమిషనర్ సూటిగా లాయర్నే అడిగాడు.
   
    ఊహించని ఆ ప్రశ్నకి ఆ యువ లాయర్ ఖంగుతిన్నాడు. అప్పుడే లాయర్ హియర్ పట్టా చేతపట్టుకుని సమస్త మానవాళి నా సోదరులే, న్యాయం కోసం ఏదేదో చేసేద్దాం అనుకున్న లౌక్యం తెలియని యువ న్యాయవాది సంకట స్థితిలో పడ్డాడు.
   
    దాదాపు కమిషనర్ వయసులో, యువ న్యాయవాది వయస్సు సగం ఉండొచ్చు.
   
    "సార్! పృద్వీ నాకు ఏమీకాడు, అతనెవరో, ఏం చేస్తుంటాడో నాకు అనవసరం. కానీ అతను ఈ దేశపౌరుడు, ఈ దేశంలో స్వేచ్చగా జీవించే హక్కు అతనికి వుంది. అతని స్వేచ్చకి ఇప్పుడు భంగం వాటిల్లింది. తోటి పౌరుడిగా అతనికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం తప్పా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra