Home » Vasundhara » మా ఊళ్ళో మహానుభావుడు

  

     గరవయ్య అతడి మాటలు వింటూ అలాగే నిలబడ్డాడు.

    "ఇక వెళ్ళు. ఒక్క క్షణం కూడా వృధా చేయకు. ఈ రోజు నీ జన్మ ధన్యమవుతోంది. నీ కారణంగా గ్రామానికి మహోపకారం జరిగుతోంది __" అంటూ రాజారావు అతడి వైపు కూడా చూడకుండా ముందడుగు వేశాడు

    గరవయ్య వెంటనే వెనక్కు తిరిగాడు. ఇంచుమించు పరుగువంటి నడక ప్రారంభించాడు.

    రాజారావు చలమయ్య ఇంటి మండువాలో అడుగు పెట్టాడు. అప్పడతడికి లీలాసుందరి గొంతు వినబడింది. ఆ వెనువెంటనే చలమయ్య గొంతు కూడా వినబడింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లూ __ వారి మధ్య మరో వ్యక్తి లేనట్లూ _ అతడి కర్దమయింది.

    "చలమయ్యగారీ మండువా గది నిదివరలో ఎన్నడూ వాడినట్లు లేదే"__" అనుకుంటూ రాజారావు తన వాటా తలుపు తట్టాడు.

    వసంత తలుపు తీసి __ "పాపా పడుకుంద౦డీ __ ఒంట్లో కాస్త కులసగానే ఉన్నట్లుంది __" అంది.

    రాజారావు లోపలకు ప్రవేశించి తలుపు వేసి _ మరో నాలుగుడుగులు ముందుకువేసి __ "వసూ _ విజయలక్ష్మి మనసు వరిస్తుందో లేదో తెలియదు కానీ __ గొప్ప అవకాశం పచ్చిందీరోజున మనమీ ఊరికెందు కొచ్చామో _ ఆ పని నెరవేరే సమయం వచ్చింది . ఇలాంటి అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు......."

    వసంత తమాషాగా నవ్వి __ "చలమయ్యగారికి ప్రాణం మీదకొచ్చి౦దా ఏమిటి?' అంది.

    "అవును _ అయన ప్రాణం మీదకే వచ్చింది ...."

    ఉలిక్కిపడింది వసంత.

    "ఉఅదయం లేలాసుందరి మాటలు విన్నావుగదా __ ఆమె గురించి నీ కేమనిపించింది?' అన్నాడు రాజారావు మళ్ళీ.

    వసంత అనుమానంగా భర్త ముకహ్మ్లోకి చూసి __ "ఈ ప్రశ్న ఎందుకేశారు?" అంది.

    "చెప్పనా?"

    "ఊం."

    "ఆమె నక్సలైటు ...."

    కొయ్యబారిపోయింది వసంత.

    "కంగారుపడకు వసూ! ఇది కేవలం న అనుమానం మాత్రమె నిన్న ఆమె సుదర్శనం ఇంటికి వెళ్ళింది. ఈ రోజుదయం నుండీ అతడు అయిపులేడు. ఇంటికిచూస్తే తాళమేసి ఉంది. ఇందాకా గరవయ్య దొడ్డిగుమ్మం. వరకూ వెడితే _ లోపల్నుంచి ఏదో మూలుగు వినబడిందట. గుమ్మం బయట _ ఇదిగో _ మావో సూక్తులతో ఈ కాగితముందిట _ అంటూ రాజరావా కాగితాన్ని భార్య కదించి __ "సుదర్శనం నాన్ని లేలాసుమ్దరి ఏదో చేసిందని నా అనుమానం. ఆ విషయం అప్పుడే బయటపడడం ఆమె కిష్టంలేదు. ఈ రాత్రి చలమయ్యను కాలుడుకొందుకొచ్చింది కదా _ న్బహుశా ఇంట్లోని దారులూ అవీ చూసుకుందుకే ఉదయమామేమనింటికొచ్చి ఉంటుంది. నీకు గుర్తుందో లేదో కానీ, అడిగి మరీ ఇల్లంతా చూసి వెళ్ళిందామె. మూడొందలు ఈ రాత్రికే ఆమె మకాం ఎత్తివేయవచ్చు. కానీ, ఈ ఒక్కరాత్రికే ఊరంతానీ ఓ ఊపు ఊపుతుమ్దామే. ఉదయం లారీలో నత్యబృదం పేరుతో ఓ యాభైమంది దుక్కల్లాంటి కుర్రాళ్ళు దిగారు. ఏమయితేనేం _ మొత్తానికి మనూళ్ళో నక్సలైట్లు అడుగేట్టారని నా ఊహా __" అన్నాడు.

    "ఊహా కదండీ _ ఇది నిజమ్లాగే కన్పిస్తోంది నాకు వాళ్ళు మననేం చేస్తారో ఏమితో?" అంది వంసత కలవరంగా.

    "భయపడకు వసూ! నక్సలైట్లు సిద్దాంతాలతో నేనూ ఏకీభవించను. వాళ్ళ పద్దతులను నేను తీవ్రంగా నిరసిస్తాను. కానీ వాళ్ళంటే నాకు భయంగా లేడు. ఎందుకంటే, నేను వాళ్ళ శత్రుకోతికి చెందినవాణ్ని కాను. వాళ్ళ శత్రువు లందరూ సమాజానికి చీడపురుగులు మాత్రమే!"

    "అయితే నక్సలైట్లు గొప్పవాళ్ళంటారా?" అంది వసంత.

    "గొప్పవాళ్ళు కాదుకానీ, అసహ్యహించుకోదగ్గ వ్యక్తులు మాత్రం కాదు. వాళ్ళు మన సోదరులు. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులున్నారనుకో. ఇఅద్దరికీ డబ్బులేదు. ఉద్యోగం లేడు. ఇద్దరూ ఆకలి బాధకు తాళలేకపోతున్నారు. చేయవలసిన ప్రయత్నాలు ఇద్దరూ అన్నీ వృధా అయిపోయాక ఒకడు నిరాశచెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు దొంగతనం చేసి పొట్ట నిమ్పుకున్నాడు. ఎవరు అరెస్టు౦టావు?     

    "ఇద్దరిదీ తప్పే!" అంది వసంత .

    "సరిగ్గా చెప్పావు కానీ సమాజం రెండొవాడ్ని వెలివేసి అసహ్యహించుకుంటుంది. మొదటి వాడిమీద జాలి పడుతుంది. నిజానికి సమాజం ఇద్దర్నీ సమంగా అసహ్యించుకుని, సమంగా జాలి పడాలి. ఎటొచ్చీ రెండోవాడు సమాజనికి కాస్త ప్రమాదకరమయిన వ్యక్తి. అయితే అతడలా తయారు కావడానికి కారణమెవరు? సమాజంలో గౌరవనీయులుగా ప్రసిద్ధి చెందుతూ ఉన్న అంతకంటే ప్రమాదకరమయిన వ్యక్తులు, వాళ్ళు ఏ అవసరమూ లేకుండా నేరాలు చేస్తూంటారు."

    "అవును. ఎటూ దారిలేనప్పుడు పిల్లి కూడా మనిషి మీద తిరగబడింది. అటువంటప్పుడు మనిషి మంసిహి మీద తిరగబడంలో ఆశ్చర్యమేముంది?"

    "ఇంతకీ నేను చెప్పేదేమిటంటే _ నక్సలైట్లని అరికట్టడానికే తప్ప అంతం చేయడానికి ప్రయత్నించరాదని! అది సరే _ ఇప్పుడు లీలాసుందరి చలమయ్యగాక్యరితావు మాట్లాడుతోంది. ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నవ్వులు కూడా వినబడుతూన్నాయి. నువ్వు తలుపులు వేసుకుని నిశ్చింతగా పడుకో. నేను రంగంలోకి దిగుతాను ....." అన్నాడు రాజారావు.

    "వద్దండీ _ ... నిష్కారణంగా ...." ఏదో అనబోయి౦ది వసంత. ఆమె గొంతులో తడి, కళ్ళలో నీళ్ళు .....

    "చూడు వసూ! నీలో పిరికితనం లేదనే నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకు. మనిషికి చావన్నది ఎప్పుడు రాసిపెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు. చావు రాదలిస్తే అభేద్యస్థలంలో దాగినా వదలదు. ఆయువు మూడకపొతే _ అపోలో పదమూడులో అంతరిక్ష యాత్రికులు తప్పించుకున్నట్ట్లే నేనూ తప్పించుకోగలను ......" అన్నాడు రాజారావు.

    వసంత చీరగోంగుతో కన్నీళ్ళు తుడుచుకుంది ఆమె కనులలో నీళ్ళు ఆగిపోయాయి. గంభీర వదనంతో __ "వెళ్ళిరండి! మీకు జయమవుతుంది!" అందామె.

    "ఎంత మంచిదానివి వసూ!" అంటూ అతడామెను బలంగా కౌగలించుకున్నాడు.

    వసంత దుఃఖాన్ని నొక్కిపట్టింది. జీవితానికదే ఆఖరి కౌగలి కావచ్చు. ఆమె తన్ను తాను తమాయించుకుని __ "నెను మంచిదాన్నే కాదు __ అదృష్టవంతురాలిని కూడా. మీకు తప్పక జయమవుతుంది. మీ జీవితాన్ని వేధిస్తున్న సమస్య పరిష్కరించబడుతుంది. వెళ్ళిరండి __" అంది.

    రాజారావు భార్యను వదిలి నిట్టూర్చాడు. జేబులోని మందులు తీసి అమెకందించి _ "తెల్లవారేలోగా వస్తాను. ఈలోగా పాప ఆరోగ్యం జాగ్రత్త!" అన్నాడు.

    భార్యకు ధైర్య చెప్పినా అతడికీ మనసులో భయంగానే ఉంది. తన ధైర్యాన్ని కోల్పోకూడదని అతడు మరి భార్య ముఖం కూడా చూడకుండా గదిలోంచి బయటపడ్డాడు. గుమ్మం బయట వసంత గడితలుపు గడియవేసిన చప్పుడు వినిపించే వరకూ ఆగాడు. తర్వాత మండువాకు అటువైపుగా చప్పుడు చేయకుండా నడిచివెళ్ళి చలమయ్య, లీలాసుందరి మాటలు వినిపిస్తున్న గదిని చేరాడు. మాటలింకా వినిపిస్తున్నాయి కానీ స్పష్టంగా లేవు తలుపులు మూసి ఉన్నాయి. లోనికి చూడ్డానికి ఎక్కడా చిన్న సందు కూడా లేదు. తలుపుల అంచుల దగ్గరున్న స్వల్ప కాంతిని బట్టి లోపల దీపం వెలిగితున్నట్లు అతడు గ్రహించాడు. అప్పుడే ఆప్రయత్నంగా అతడు తన గ్రహించాడు. అప్పుడే ఆప్రయత్నంగా అతడు తన వాటవైపు చూశాడు. చీకతీగా ఉంది. అంటే వసంత దీపం అర్పెసిందన్నమాట!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra