Home » Kommuri venugopala rao » విరాజి

 

     మానవుని జీవితంలో ఒక్కో అధ్యాయం ఊపిరిసలపనంత వేగంతో తనకు తాను అర్ధంకాని రీతిలో పరుగులిడుతూ వుంటుంది.

    గౌతం నటించిన చిత్రం రిలీజయి సూపర్ హిట్ అయి కూర్చుంది.

    పత్రికలూ , ప్రజలూ రెండో అభిప్రాయం లేకుండా అతన్ని పైకెత్తి పారేశారు.

    కేవలం రెండుమూడు నెలల వ్యవధిలో అతను తారాపధాన వున్నాడు.

    అయితే అతనిదయిన ఓ ప్రత్యేకమైన శైలి, మిగతా హీరోల రోతీస్ పద్దతి కాకుండా ఓ నూతన వొరవడి, అతడ్ని తమ సినిమాల్లో బుక్ చేసుకునేందుకు నిర్మాతలు పోటీ పడినట్లు ముందుకు వచ్చారు. అతని పర్సనాలిటీ , అభినయం దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కధలు వ్రాయించసాగారు.

    గౌతం క్షణంకూడా తీరికలేని బిజీ ఆర్టిస్టుయి పోయాడు. ఏడెనిమిది చిత్రాలకు ఒకేసారి సైన్ చేశాడు. ఉదయం లేచినప్పటినుంచీ ఘాంటి౦గ్స్ , కాల్ షీట్స్ యిన్ డోర్ లు అతని జీవిత వాహిని పొంగులెత్తి ప్రవహిస్తోన్నది.

    అతని ఫ్యాన్ మెయిల్, అతన్ని గురించి కలలుకనే వాళ్ళు అతన్ని ఒక్కసారి చూస్తె చాలు జన్మ తరించిపోతుందని తహతహాలాడేవారు అతని గొంతువిని పరవశించిపోయేవారు ఎంతోమంది అభిమానులు

    ముఖ్యంగా యువతరాన్నతను విపరీతంగా పది పదిహేను సెంటర్లలో వందరోజులు పూర్తీ చేసుకుని అఖండవిజయం సాధించిన సందర్భంలో శతదినోత్సవాలు భారీ ఎత్తున జరుగాయి. అంతకు ముందే వాడవాడలా అతని కభిమానసంఘాలు ఏర్పడ్డాయి. ఆ అభిమాన సంఘాలతనకి వ్యక్తిగతంగా ఘనంగా సన్మానాలు చేయసాగాయి.

    పార్వతీపురం అంత పెద్ద వూరూ కాదు. పల్లెకాదు. కాని ఆ చుట్టూపక్కల ఊళ్ళన్నిట్లోకి చాలా ప్రాముఖ్యత వహించి కళాత్మకంగా గాని, యితర పక్రియల రీత్యా గాని, అనేకవిధాల ఓ ముఖ్యమైన కేంద్రకంగా గుర్తించబడుతోంది. 

    అ ప్రాంతంలోని గౌతం అభిమాన సంఘంవాళ్ళు అతనికి వ్యక్తి గతంగా సన్మానం చేశారు.

    సన్మానం చాలా ఘనంగా జరిగింది. ఊళ్ళోని  ప్రముఖులూ, వ్యాపారస్తులూ విధ్యార్డీ విద్యార్ధినులూ _ జనం ఇసకవేస్తే రాలకుండా వచ్చారు. ఎంతోమంది వ్యక్తులు అతనిని అభినందనలో ముంచెత్తారు. అతని కంఠాన్నలంకరించిన పూల మాలలకు అంతులేదు. సన్మాన కార్యకమమంతా చాలా కోలాహలంగా , అపురూపమైన రీతిలో జరిగింది.

    ఈనాడు గౌతం మంచి వక్త. ఎలాంటి సభలోనైన అనర్గళంగా ప్రసంగించగల అనుభవశాలి. తన ప్రసంగా చాతుర్యమ్లో అన్ని వర్గాల శ్రోతుల్ని ఆకట్టుకోగల దిట్ట.

    తనకు జరిగిన సన్మానానికి అతను తన సహజ ధోరణీలో సభికుల్ని రంజింపజేస్తూ దాదాపు అరగంటసేపు అనర్గళంగా మాట్లాడాడు.

    కరతాళ ధ్వనులు మార్మోగిపోయాయి.

    ఎడతెరపి లేకుండా కొనసాగిన ఆటోగ్రాఫ్ ల కార్యక్రమం కూడా పూర్తయాక __ కొంతమంది పుర ప్రముఖలతో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసిన డిన్నర్ కూడా ముగించుకుని అతను గెస్ట్ హాస్ కు బయల్దేరాడు.

    ఆ ఊళ్ళో ఆధునిక సౌకర్యలతో వున్న హొటలు లేక పోవటము వల్ల గెస్ట్ హౌస్ లోనే అతని బస ఏర్పాటు చేశారు.

    కారులో వెనక సీట్లో పరధ్యానంగా కూర్చున్న గౌతమ్ ఓ సెంటర్ లో గోడలకు ప్రముఖంగా కనిపించే టట్టు అంటించబడి వున్న వాల్ పోస్టర్ స్ట్రీట్ లైట్ వెలుగులో చూసి ఉలికిపడ్డాడు.

    "ఆ వాల్ పోస్టర్ ఎవరిది?' అన్నాడు చలించే కంఠముతో.

    "ప్రముఖ నర్తకి విరాజిది సార్. ఇప్పుడు మీకు సన్మానం జరిగిన ఆడిటోరియంలోనే రేపు సాయంత్రం ఆమె ద్వాన్స్ పోగ్రాం వుంది."

    గౌతమ్ గుండె ఝల్లు మన్నట్లయింది.

    "ఎప్పుడూ ప్రదర్శన ? రేపా? అయితే యీ పాటికి ఆమె యిక్కడికి వచ్చివుండాలే . అన్నాడు తెప్పరిల్లాక.

    "తెలీదు సార్."

    ఆ విషయం అంతకంటే ఎక్కువ ప్రస్తావించట మిష్టంలేక ఊరుకున్నాడు.

    "గెస్ట్ హౌస్ లో గౌతమ్ ని దింపి , అతనికి అన్ని సౌకర్యాలూ
వున్నాయో లేవో చూసి తెల్లవారుఝామునే వచ్చి మిమ్మల్ని పంపించే ఏర్పాటు చేస్తాం." అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

    తర్వాత ద్రాస్ చేంజ్ చేసుకుని గౌతమ్ ప్రక్కమీదకు వచ్చి పడుకున్నాడు.

    ఎంత చిత్రం తన జీవితం! ఒకటి అందుకోబోతే యింకొకటి దొరుకుతోంది. ఒక రచయితగా స్థిరపడాలని గమ్యాన్ని వెతుక్కుంటూ యింటిలోంచి బయటపడి క్షణక్షణానికి రూపం నూరిపోతోంది. ఘాంటి౦గులూ ఏవేవో పరిచయలూ, అడుగడుక్కి సన్మానాలు...... ఊఒపిరి సలపటము లేదు.

    "నీది కాని జీవితము జీవిస్తున్నావు. నీది కాని జీవితము జీవిస్తున్నావు.

    మనసులో ఓ ఘోష.

    విరాజి!

    అనుకున్న రీతిగా జీవితాన్ని మలుచుకుంటోంది. దారి తప్పకుండా తన పరిధిలో ఎదుగుతోంది.

    తనని పాప్యులారిటీ వరిస్తోంది. ఆమె నిజమైన కళకు నిర్వచనము చెప్పగలుగుతూ హిమాలయ శిఖరాన్ని అందుకుంటో౦ది.

    ఒకప్పుడు ఆమె చెప్పిన మాటలన్నీ మనసులో ప్రతి ద్వనిస్తున్నాయి.

    విరాజి! విరాజి! విరాజి!

    అతనికి నిద్ర పట్టలేదు. ఇంత వేగంలో కూడా యీ వంటరి తనము ఎలావెంటాడుతున్నదో అర్ధం కావటము లేదు.

    ఓ గంట చాలా అస్థిమితంగా గడిచాక ప్రక్కమీద వుండలేక తలుపులు తీసుకుని, బయటి వరండాలోకి వచ్చాడు.

    ఎదురుగా యింకో రూమ్ తలుపులు తెరుచుకుని విరబోసుకుని వున్న జుట్టుతో వున్న ఓ స్త్రీమూర్తి వరండాలోకి వచ్చి అతన్ని చూసి నిర్ఘాంత పోయి నిలబడిపోయింది,

    ఆమెను చూసి గౌతమ్ విధ్యుత్ఘాతం తగిలినట్లు వణికాడు.

    విరాజి!! ఒక్క నిముషం శిలావిగ్రహల్లా, రెండు శిల్పాల్లా యిద్దరూ కదలకుండా వుండిపోయారు.

    తేరుకున్నాక మొదట గౌతమే పలకరించాడు. "విరాజి! బావున్నావా?"

    ఆమె జవాబివ్వలేదు. "బాగానే వున్నాను" అన్నట్టు వరండాలో వేలుగుతొన్న డిమ్ లైట్ కాంతిలో ఆమె కళ్ళు సూచించాయి.

    చాలీ చాలని ఆ వెలుగుకు తేజస్సు నిస్తున్నట్లు మెరిసేయి ఆమె కళ్ళు.

    ఒకడుగు ముందుకు వేశాడు.. "విరాజీ ఇన్నాల్లా తర్వాత మనమిలా కలుసుకోవతము ఎంత అనందముగా ....."

    "నాకేం యిష్టంగా లేదు."

    అతను ఆప్రతిభుడై చూశాడు.

    "గౌతమ్! నీ త్రోవన నువ్వు ప్రయణిస్తున్నావు. నాదారిన నేను ముందుకు వెడుతున్నాను. ఈ రెండు మార్గాలు కలుసుకోవడం నాకిష్టము లేదు గౌతమ్" అంటూ అతను ఊహించని విధముగా చప్పున కదిలి తన రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసేసుకోబోయింది.

    అతను ఉన్మత్తుడయిపోయాడు. యించుమించు ఆ తలుపులు మూసుకుంటే ఇహ జన్మలో తెరుచుకోవేమోనన్నంత భయముతో, ఆతృతతో ఒక్క ఉదుటున ఆ తలుపులని త్రోసుకుంటూ లోపలకు వెళ్ళాడు.

    "ఇదేమిటి? నీకేమన్నా .... అని ఆమె అసహనంగా అంటూండగా

    "విరాజీ చాలా రోజుల తర్వాత, నా దృష్టిలో కొన్నియుగాల తర్వాత  మనము కలుసుకున్నాము నిన్నంత తెల్లిగా విడిచిపెట్టను. మన యిద్దరముమాట్లాడుకోవల్సింది చాలా వుంది" అంటూ తలుపులు గడియ పెట్టేశాడు.

    ఆమె నిర్ఘాంతపోయి చూస్తోంది.

    "భయపడకు. నిన్నేమీ చెయ్యను, అన్నదామె వైపు తిరుగుతూ.

    విరాజి నవ్వింది "నువ్వు నన్నేదో చేస్తావని హడలిపోయే పిరికి దాన్ననుకున్నావా గౌతమ్?"

    "నువ్వు పిరికి దానివికాదని తెలుసు విరాజీ! నీ మనస్సు అంగీకరించనది యితరులలో చూడటానికి వొప్పుకోవనీ తెలుసు ....."

    ఒక్క క్షణం నిశ్శబ్దం.....

    "చెప్పు ఎం మాట్లాడదలచావో" అంది విరాజి.

    అతనామె ముఖంలోకి చూశాడు. జుట్టు విరబోసుకుని, తెల్లచీరే , నల్లని జాకెట్టుతో ఓ వింత కాంతితో మెరుస్తూ కావ్య కన్యలా వుంది. మునపటికన్నా అందముగా వున్నది. ఈ మూడు నాలుగేళ్ళ కాలపరిమితీ ఆమె కింకా వన్నెలు దిద్దంది గానీ ఎలాంటి తేడా తీసుకురాలేదు. ఈ ఆపూర్వ సౌందర్యరాశిని ఎంత హృదయ విదారకంగా పోగొట్టుకుంటున్నానూ అని అతని హృదయము ఆక్రోశించింది.

    హఠాత్తుగా అతను చిన్నపిల్లవాడిలా మారిపోయాడు.

    "విరాజీ నువ్వెందుకింత కఠినంగా మారిపోయావు? నెలలూ, సంవత్సరాలూ గడుస్తోన్నా నీలోని కఠినత్వం  ఎందుకు కరగటం లేదు?"

    "విరాజి నవ్వింది. పరిస్థితుల్ని బట్టి మంసిహి కఠినంగా మారవల్సి వస్తూ వుంటుంది గవుతమ్."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra