Home » Kurumaddali vijayalakshmi » అసిధార

   

    "రెడీ" అంది కృతి.

    "నేను బీ రడీ" అంది నిశ్చల.

    మళ్ళీ వాళ్ళలో నూతనోత్సాహం వచ్చింది. జోకులేసుకుంటూ తయారయాయి. సామానులు వెంట తీసుకెళ్ళాలా! ఇక్కడేవుంచి నీటిసాయవెంట వెళ్ళి మరదలిరావాలా? ఆలోచించారు. మరచివచ్చి చేసేదేముంది. ముందుకీ వెనక్కి నడవటం శ్రమ. సామానువెంట వుండటమే. మంచిది.

    ఎవరి సామాను వారు సర్దేసుకున్నారు. భుజాలకి నడుంకి బెల్టులు బిగిమ్చుకున్నారు. లగేజీ వీపెక్కింది, ఇంక నడక మొదలుపెట్టారు.

    నీటిపాయ పక్కనుంచి నడుస్తున్నారు.

    ఇదివరకైతే చెట్ల సముదాయం మధ్యలో నడవబట్టి ఆకాశంగాని వెలుతురూగాని చీకటి వేలుగుల్లా వాళ్ళని ఆడించాయి. నీటిపాయవద్ద ఆగినప్పుడు ఆకాశం అందుబాటలో వున్నట్ట్లుచాక్కగా కనిపించింది. అందువల్ల వెలుతురూ పగలంతా వుంటూనే వుంది.

    ఇప్పుడు వీళ్ళు నడుస్తున్నది నీటిపాయ పక్కనుంచి వెలుతురికి కొదవలేదు.

    ఓ పక్కగావున్న చెట్టునిచూసి నిశ్చల ఆగిపోయింది.

    "కల్లేక్కాయలోచ్చి" అంటూ అటు పరుగు తీసింది.

    అందరూ నిశ్చల వెనకనే దారితీశారు.

    చిన్న గుబురుగా ఉన్న చెట్టు అది. కుంకుడు గింజలంత కాయలు చెట్టునిండా వున్నాయి. ఆకుపచ్చ ఎరుపు కలగాపులగం రంగుతో.

    "కలేక్కాయలయితే ఏమిటి?"

    "ఇవసలు కలేక్కాయలని బాగా తెలుసా?"

    "ఇవి దేనికి?"

    "తినోచ్చా?"

    "కలేక్కాయలయితే తినొచ్చు. కలేక్కాయలు ఇవని నాకు బాగా తెలుసు. తింటే తియ్యతియ్యగా పుల్ల పుల్లగా వుంటాయి. ఉషతోవాళ్ళ వూరు వెళ్ళినప్పుడు కొమ్దదగ్గర చూశాను. అదే కోసిపెట్టింది. తినండి బాగా వుంటాయి" నిశ్చల కాయలుకోస్తూ అంది.

    వెంటనే సుబ్బారావు . ఆ వెంటనే మిగతా ముగ్గురూ కాయలు కోసుకున్నారు.

    "ఇవి కలేక్కాయళ్ళా ఉన్న విషం కాయలేమో వకళ్ళంకోద్హిగా కొరికి చూద్దాం." విజయ్ అనేలోపల నిశ్చల రెండుకాయలు నమిలేసింది. "భలే బాగున్నాయి తినండర్రా! అక్కడలాగా తీపి పులుపూ కలిసిలేవు. పుల్లగా ఉన్నాయ్ అంతే తేడా" అంటూ మరోరెండు కాయలు తింది.

    వెంటనే అందరూ తిన్నారు.

    బాగా పులుపు విజయ్ కి యిష్టంలేదు. అయినా నాలుగుకాయలు తిన్నాడు.

    చెట్టంతా దులిపి అన్నికాయలూ కోశారు.

    "ఇది మనకి అందిన మొదటి ఆహారం" కమల్ అంటూ వుండగానే "కళ్ళు తిరుగుతున్నాయ్ కమల్!" అంటూ నిశ్చల కిందకూర్చుండిపోయింది.

    "నిశ్చలా! నిశ్చలా! ఇప్పుడెలా ఉంది!" కమల్ నిశ్చలని కుదుపుతూ "నాకూ కళ్ళు తిరుగుతున్నాయ్" అన్నాడు చటుక్కున క్రిందకూర్చుంటూ.

    విజయ్ కి అర్దమైపోయింది.

    ఆలోచించే వ్యవధిలేదు.

    జేబులోంచి చాలా క్విక్ గా డైరీ తీశాడు విజయ్. తనుకూడా కళ్ళుతిరిగే స్థితికి దగ్గరగా వచ్చాడు. అందరూ చాపచుట్టలా నేలకోరిగారు అప్పటికే.

    "ఇవి విషపూరితమైన కాయలు. ముంచుకొచ్చే క్రుత్యువుని ఎవరూ .... అ... ప.... లే.... రు.

    విజయ్ అంతవరకు రాశాడు. వీ ..... టి...... వి.... ఎ.... వ.....

    చేతిలో కాలం డైరీ జారిపొయ్యాయి. అలాగే పక్కకి వొరిగి పోయాడు.

    విషానికి విరుగుడు ఇచ్చే ప్రయత్నంలో విజయ్ లేడు అందుకే ఎప్పటికైనా ఇటువస్తే వాళ్ళకి ముందుగా తమఅస్థిపంజరాలు కనిపిస్తాయి అంతేకాదు. డైరీలో చదువుతారు.

    చదివితే

    విషంకాయలు తినరు.

    ఈ డైరీ వాళ్ళ ప్రాణాలని రక్షిస్తుంది.

    విజయ్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించాడు కాని పట్టుమని పది వాక్యాలుకూడా రాయలేకపోయాడు.

    అందరికన్నా చివరికి తిన్నది విజయ్. అందుకే ఆ మాత్రం రాయగలిగాడు.

    ఇప్పుడు వాళ్ళేవరిలో కదలిక లేదు.

    రెండుగంటలకాలం గడిచిపోయింది.

    దూరంగా కొమ్ముబూర ద్వని డప్పులచప్పుడు .

    విజయ్ కి అప్పుడే మేలుకువ వస్తున్నది. కొమ్ముబూర ద్వని వింటూ లేచి కూర్చున్నాడు.

    జరిగింది అర్ధం చేసుకోవటానికి కొద్దిసమయం పట్టింది అంతకంతకూ ఆ ద్వని దగ్గరవుతున్నది. ఈ కాయలు మత్తులో పడేశాయి గాని మరణం తెచ్చిపెట్టలేదు. అంతవరకూ నయమే. కొమ్ముబూర ద్వని దప్పుల చప్పుడు అంటే ఎ అడవిజాతివాళ్ళవో అనుకోవాలి. వాళ్ళు ఇటే వస్తున్నట్లుగా వుంది. వాళ్ళలో మంచివాళ్ళు వుంటారు. చెడ్డవాళ్ళు వుంటారు. ప్రస్తుతానికి వల్ల కంట పడటం మంచిదికాదు.

    విజయ్ క్విక్ గా ఆలోచించాడు తట్టిలేపినా వాళ్ళెవరూ లేవలేదు.

    కాళ్ళు పట్టుకుని బరబరాలాగి గుబురుగా ఉన్న చెట్లచాటుకి చేర్చాడు. దాంతో పూర్తిగా అలసిపోయాడు.

    నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు లేవటం మొదలుపెట్టారు.

    "మనం చెట్టు ఎక్కి దాక్కోవటం మంచిది" విజయ్ అనంగానే అందరూ ఆమోదించారు.

    ఇప్పుడు వాళ్ళయిదుగురు గుబురుగా ఉన్న చెట్టు ఎక్కారు.

    కొమ్ముబూర ద్వానితోపాటు దాదాపు పదిమంది నీటి దగ్గరకు వచ్చారు.

    విచిత్ర జీవుల్లాంటి వింత కారాలు గలిగిన మనుషులు.

    వాళ్ళంతా నాలుడుగులలోపే వున్నారు. కాళ్ళూ చేతులూ సన్నగా వున్నాయి. పొట్టలు బానల్లా వున్నాయి వాళ్ళ తలలు చాలా పెద్దవి. శరీరాన్ని మిమ్చ్ వున్నాయి. కుండబోర్లించినట్లు వుంది. ముందు రెండు పళ్ళు కోరల్లా పైకి అంగుళం పొడుగున వున్నాయి. అంతా మగవాళ్ళే చేట్టునర, కావచ్చు గోచీలుగా పెట్టుకున్నారు. తలమీద వాక్క వెంట్రుక పోచలేదు. చాల నున్నగా వుంది. మీసాలు గడ్డాలు ఏమీలేవు చింతపిక్కలంత అతి బుల్లి కళ్ళు, అణిగిపోయిన ముక్కు రూపురేఖలు లేవు. అధాటుగా చూస్తె దడుచుకునేటట్లు వింతజంతువుల్లా వున్నారు.

    వాళ్ళని చూసి సుబ్బారావు ఏదో మాట్లాడబోయాడు.

    "ఇష్ ఎవరూ పెదవి కదపవద్దు" విజయ్ అన్నాడు.

    చెట్టుమీద కూర్చున్న వీళ్ళకి వాళ్ళు చేసేది చాలా చక్కగా కనిపిస్తున్నది.

    వాళ్ళు నీటి సాయదగ్గర ఆగారు. వాళ్ళ చేతులలో వున్న కొమ్ము బూర వగైరా సామానులు కింద పెట్టారు. అందరి మెడలలో విచిత్రమైనా ఆకుల దండలు వున్నాయి. వాటినితీసి పక్కనపేట్టి అందరూ నీళ్ళలో దిగారు.

    మొత్తం పదిమంది అయిదు జట్లుగా మారారు. ఒకరి ఎదురుకుండా ఒకరు నుంచున్నారు. ఒకడు తన రెండు చేతులతో ఎదుటివాడి రెండు చెవులూ పట్టుకున్నాడు! అలాగే ఎదుటివాడు వీడి రెండు చెవులూ చేతులతో పట్టుకున్నాడు.

    షియ్యా షియ్యా షియ్యా

    దిక్కులు పిక్కటిల్లెటట్లు అరిచారు.

    అదే మొదటిసారి వాళ్ళ నోట్లోంచి మాటరావటం అది కూడా వింత కుతులావుంది అలా అరచి చెవులు చేతులతో పట్టుకుని నీళ్ళలో మునిగారు. అలాగే ముణగటం పైకి లేవటం ముణగానాం తేలానాం అన్నట్లు కొద్దిసేపు చేశారు.

    అలా విచిత్ర పద్దతిలో స్నానం ఎందుకు చేయాలో వీళ్ళకి అర్దంకాలేదు కళ్ళార్పకుండా చూస్తు వుండిపోయారు. చెట్లమీద.

    స్నానఘట్టం అయిపోయినట్లయింది నీళ్ళల్లోంచిపయికివచ్చారు. మౌనంగా ఆకూ దండలు మళ్ళీ ధరించి ఈతఫా కొమ్ముబూర వూదకుండానే వాటిని చేతిలోతీసుకుని బయలుదేరారు.
   
    "మనం చెట్లు చాటుగా చేసుకుని వాళ్ళ వెనకనే వెళదాం" విజయ్ అనగానే అందరూ చెట్టు దిగారు.

    వాళ్ళ వెనకనే ఎక్కువదూరం వెళ్ళే అవసరం లేకపోయింది.

    కొంత దూరంలో తాటిచెట్టు ఎత్తున అవి గుట్టలో కొండలో అర్దంకాని విధంగా వెయ్యి గజాల వెడల్పున పడుచుకుని వున్నాయి.

    వాళ్ళు ఒకచోట ఆగి లోపలి దిగినట్లు వెళ్ళిపోయారు.

    "మనం యిక్కడే ఆగటం మంచిదేమో?" కమల్ అన్నాడు.

    "నే అనబోతున్నాను నీవన్నావ్ వాళ్ళ నివసమో మరేదో మనకి తెలియదు మనం వాళ్ళ కంటపడితే బెదిరి పారిపోతారోఎదురు తిరిగి చావుదెబ్బ తీస్తారో తెలియదు నగరీకులకన్నా అనాగారీకులకేమేలుకవులు చిట్కాలు తెలుసు" విజయ్ అన్నాడు అందరం చెట్లు ఎక్కువదామని చెప్పాడు.

    "అలవిగాని చోట అధికులమనరాదని మా బామ్మ తరుచుచెప్పేది రోయ్" సుబ్బారావు అన్నాడు చెట్టు ఎక్కుతూ!

    నిశ్చల ఏదో అనేలోపల కృతి పెదవి విప్పింది. "చూడు చూడు వాళ్ళు మళ్ళీ పైకి వస్తున్నారు" అంది ఆతృతగ.                        
    కొద్దిసేపు అందరికళ్ళు అటు తిరిగాయి. అప్పటికి వీళ్ళు చెట్టు ఎక్కేశారు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra