"నా పేరు సురేష్! హైద్రాబాద్ నుంచి వస్తున్నాను. సుచిత్రాదత్ గురించి మీరేమయినా వివరాలు చెప్పగలరేమో అన్న ఆశతో వచ్చాను. ఆమె హత్యకు సంబంధించిన విచారణలకు అవసరం అది."
ఆమె ఓ క్షణం ఆలోచించి "రండి! కూర్చోండి" అంటూ పక్కకు జరిగి దారి ఇచ్చింది.
అతను లోపలకు నడిచి సోఫాలో కూర్చున్నాడు.
ఇంటి నిండా జపనీస్ సామాన్లే కనబడుతున్నాయ్.
"మీరూ సుచిత్రా బెస్ట్ ఫ్రెండ్సని మీ ఫాదర్ చెప్పారు.
"అఫ్ కోర్స్! కలసి చదువుకున్నాం! కలసి పెరిగాం! మా ఇద్దరి మధ్యా రహస్యాలనేవే లేవు."
"అయితే మీరు అసలు విషయం దాస్తున్నారు! మీరు చెప్పే వివరాలేమీ బయటకు రాకుండా చూసేబాధ్యత మాది."
ఆమె కొద్దిక్షణాలు తటపటాయించింది.
"ఎప్పటివో విషయాలు ఇప్పుడు బయటపెట్టుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం?" అయిష్టంగా అంది.
"నాకు!"
ఆమె ఆశ్చర్యపోయింది. "మీకేం ఉపయోగం?"
"పోలీసులు అన్యాయంగా ఆ హత్యానేరం నామీద వేస్తున్నారు గనుక.
ఆమె కళ్ళల్లో కలవరం కనిపించింది.
"అంటే...... ఆ సురేష్ మీరేనా?"
"అవును."
"ఓ!" ఆమె కళ్ళల్లో బెదురు కనిపించింది.
"మీరేం గాబరాపడనక్కరలేదు. సుచిత్రను నేనే హత్య చేసి ఉంటే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి నేనే ఇలా వీధుల వెంబడి తిరగనవసరంలేదు. కావాలని ఎవరో ఈ హత్యానేరం మీద పడేట్లుచేశారు."
ఆమె కొద్దిక్షణాల తర్వాత మాట్లాడింది.
"సుచిత్రచాలా మంచి అమ్మాయేగానీ కాలేజ్ లో ఆమెకు డ్రగ్స్ తీసుకోవటం అలవాటుండేది. మా అందరినీ అప్పులివ్వమంటూ ప్రాధేయ పాడుతుండేది. ఒక రోజు డ్రగ్స్ కోసం....." అంటూ ఏదో చెప్పబోయి ధప్పున ఆపేసింది.
సురేష్ కుతూహలంగా చూశాడు.
"చెప్పండి ఏం జరిగింది?"
"ఏమీలేదు ఏవో డ్రగ్స్ కోసం చేసిన గొడవలు ...... అంతే....."
"మళ్ళీ దాస్తున్నారు. మీరు చెప్పే ఎంత చిన్న విషయమయినా నాకు ఉపయోగపడవచ్చు. దయచేసి చెప్పండి" ప్రాధేయ పూర్వకంగా అడిగాడు.
"ఒకసారి డ్రగ్ కి డబ్బులేక పక్కన అద్దెకున్న ఓ లెక్చరర్ ని అడిగింది. అతగాడేమోతనకు రేఖమీద కోరిక ఉందని, రేఖకు నచ్చజెప్పి తన ఇంటికి పంపుతే అయిదువందలు ఇస్తానని అన్నాడట. సుచిత్ర రేఖను బ్రతిమాలిందిగానీ రేఖ వప్పుకోలేదు. కోపం పట్టలేక రేఖ నిద్రపోతూన్నప్పుడు క్లోరోఫారమ్ వాసన చూసింది. ఆమె స్పృహ తప్పగానే తనే మోసుకెళ్ళి ఆ లెక్చరర్ రూమ్ లో పడేసింది. ఆ లెక్షరర్ ఆమెను రేప్ చేసి సుచిత్రకు డబ్బిచ్చాడు. ఈ విషయం చివరకు ఆ ఏరియాలో అందరికి తెలిసిపోయింది"
సురేష్ నిశ్చేష్టుడయ్యాడు.
"మైగాడ్! షి మస్ట్ బి ఏ డేవిల్!"
"ఉయ్ కాన్ట్ బ్లేమ్ హర్! ఇటీజ్ డ్రగ్ ఎడిక్షన్!"
"అఫ్ కోర్స్......"
"సుచిత్రకు మీకూ ఎలా పరిచయం?"కుతూహలంగా అడిగిందామె.
"ఇద్దరం హోటల్లో కలసి వర్క్ చేసేవాళ్ళం! ఇంటి దగ్గర కూడా ప్రైవేట్ గా ప్రయత్నించబోయేసరికి ఇద్దరికీ ప్రాణం మీదకొచ్చింది......"
జాన్సీ నవ్వింది.
"బాడ్ లక్...."
సురేష్ లేచినిలబడ్డాడు.
"థాంక్యూ! కావాలన్నంత ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు."
"మీరు చేయని నేరంనుంచి బయటపడేందుకు ఈ విషయాలేమైనా ఉపయోగపడితే.....ఐ విల్ బి హాపీ!" అతను బయటకునడుస్తోంటే గేటువరకూ వెనుకే నడిచిందామె.
"ఒక్క విషయం మీకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను" గేటు మూసివేసి ఆమెవేపు తిరిగి అన్నాడు.
"ఏమిటిది?" కుతూహలంగా అడిగింది.
"అదే......మీ శరీర సౌష్టవం చాలా అద్భుతంగా వుంది. కలలో కూడా వృధా చేయకండి!
నేను చాలా బాధపడతాను."
ఆమె కోలుకొనేలోపలే అతను అక్కడినుండి వచ్చేశాడు.
సుచిత్ర డ్రగ్స్ అలవాటుకీ, ఆమె హత్యకూ ఏదో ఉందనిపిస్తోంది.
"అంటే ఇన్ డైరెక్ట్ గా విజయ్చందన్ కీ, డ్రగ్స్ కీ కూడా ఏమయినా సంబంధంవుందా? గీతాకాత్యాయని హత్యకూ, సుచిత్ర హత్యకూ ఏమైనా సంబంధం ఉందా? ఏదీ తెలీటం లేదు.
ఏదేమయినా ఈ మర్డర్స్ కి వెనుక ఉన్న ముఖ్య కారణం డ్రగ్స్ అయుండవచ్చు. కనుక తను అదే డైరెక్షన్ లో ఆలోచించటం ప్రారంభిస్తే ఏమయినాక్లూలు దొరకవచ్చు. వీలయితే సుచిత్ర పిన్ని కూతురు రేఖతో కూడా ఓసారి మాట్లాడితే మరికొన్ని కొత్త విషయాలు బయటపడతాయేమో .......
రోడ్ మీద ట్రాఫిక్ ఎక్కువగా వుంది.
ఆలోచనలతో ఫుట్ పాత్ పక్కనుంచి ఒక్కొక్క అడుగే వేస్తున్నాడు. చల్లని సముద్రపు గాలి ఉండుండి వేగంగా వీస్తోంది.
పక్కనుంచీ రివర్స్ గేర్ లో అదే వేగంతో వెనక్కు వచ్చి సురేష్ పక్కన ఆగింది మళ్ళీ సురేష్ బిగుసుకుపోయాడు మళ్ళీ విష్ణుగాంగ్ కాదుకదా!
బాక్ డోర్ తాలూకు అద్దం కిందకుజరిగింది. అందులోనుంచి అద్భుతమయిన మేకల్ వేసుకున్న మొఖం బయటకు తొంగి చూసింది.
పెదాలమీద చిరునవ్వు.
"హలో"
సురేష్ ఆశ్చర్యపోయాడు.
ఆమె మాయ!
"మీరా?" కోలుకుంటూ అడిగాడు.
"మీరిక్కడెలా వున్నారు?" అడిగిందామె.
"డెస్టినీ! మీకు ఫేట్ మీద నమ్మకం వుందా?"
"లేదు."
"ఫేట్ అనేది ఒక మీజరబుల్ ఫాక్ట్ మనం ఇష్టపడినా పడకపోయినా, నమ్మినా నమ్మకపోయినా...." ఆమె అతని వాగ్దాటికి ఠక్కున అడ్డుపడింది.
"రండి వెళ్తూ మాట్లాడుకుందాం."
అతను కారెక్కాడు.
డోర్ మూసుకుపోయింది.
లోపల ఏ.సి. చల్లదనం అతనిని స్థిమితపరుస్తోంటే.....మాయ అందాలను చాలావరకూ బయల్పరిచే ఆమె మోడ్రన్ డ్రస్ అల్లకల్లోలం చేస్తోంది.
మాయ పక్కనే మరో యువతి...... ఫుల్ మేకప్ అయి వుంది.


