Home » Kommanapalli ganapathi rao » అసావేరి

    "అ....న్న....య్యా.....!" చాలా నీరసంగా పలికింది సావేరి గొంతు....అదికాదు ఉదయం సూర్యుని కిరణాల ఛాయలో మెరిసే సావేరి తనూ కాలిన గులాబీ రేకులా అనిపిస్తూంది. "డాడీ....కాలేజీ ...."
   
    "తయారుకా.....!"
   
    అర్ధంకాలేదు సావేరికి.
   
    "అవును సావేరి...కాలేజీకి తయారుకమ్మంటున్నాను."
   
    "కానీ డాడీ!"
   
    "అవన్నీ నేను చూసుకుంటాను.....ముందు నువ్వు....."
   
    "వీల్లేదు.....!" ఆ హాలు వీర్రాజుగారి గొంతులో ప్రతిధ్వనించిపోయింది. "సావేరి యిక కాలేజీకి రాలేదు"
   
    "ఎందుకని?" మొండిగా అన్నాడు రవి.
   
    "ఇది తండ్రిగా నా నిర్ణయం."
   
    "అన్నగా నాకూ తెలుసుకోవాల్సిన బాధ్యత వుంది......"
   
    అవాక్కయ్యాడు వీర్రాజు......హఠాత్తుగా హాస్పిటల్ నుంచి రావటానికి ఇప్పుడు కారణం బోధపడింది. కానీ రవి యిలా నిలదీయటం అతనూహించలేకపోతున్నాడు.
   
    "చెప్పండి డాడీ! సావేరిని హఠాత్తుగా హాస్పిటల్ నుంచి రావటానికి ఇప్పుడు కారణం బోధపడింది. కానీ రవి యిలా నిలదీయటం అతనూహించలేకపోతున్నాడు.
   
    "చెప్పండి డాడీ! సావేరిని హఠాత్తుగా కాలేజీ ఎందుకు మానిపించినట్టు?"
   
    వీర్రాజు ఇంకా తేరుకోలేదు. "త్వరలో దాని పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నాను కాబట్టి...."
   
    "ఇప్పుడంత తొందరేమొచ్చింది?"
   
    "అది తొందరపడింది కాబట్టి!" నిగూఢంగా అన్నాడు వీర్రాజు.
   
    "వెంటనే పెళ్ళి చేయమనా?"
   
    "కాదు....పిచ్చిచేష్టలతో నా ప్రతిష్టకి భంగం కలిగిస్తూందని."
   
    "పెళ్ళెవరితో?"
   
    "మీ బావ రాజేందర్ తో!"
   
    "అది మీ ప్రతిష్టకి అవమానం కాదా?"
   
    "ఏమిటి రాజేందర్ లో అనర్హత?"
   
    "తాగుబోతు, తిరుగుబోతు అల్లుడిగా అర్హుడేమో కానీ సావేరికి భర్తగా అనర్హుడు" ఖండితంగా చెప్పాడు రవి.
   
    "రవీ!" వీర్రాజులో ఆవేశం క్రమంగా ఉధృతమౌతూంది. "రాజేందర్ ఎలాంటి వ్యసనపరుడైనా సావేరిని సుఖపెట్టగలడు."
   
    "వ్యసనపరుడు భార్యను సుఖపెట్టడు డాడీ.....తనను తాను సుఖపెట్టుకోడానికి వ్యసనాలకి బానిసవుతాడు."
   
    "కానియ్....ఇప్పటికే నేను నిర్ణయించుకున్నాను."
   
    "కానీ సావేరి మరేదో నిర్ణయించుకుంది."
   
    "దానికి నేను అంగీకరించను"
   
    "ఎందుకని....."
   
    "ఈ యింటి యజమానిని కాబట్టి."
   
    "నేనూ ఈ యింటి వారసుడ్నే!"
   
    "ఆస్థికి వారసుడివేమో కాని, నా ఆలోచనలకి కావు."
   
    "మీరూ అంతే డాడీ.....కోపంవస్తే సావేరికి మీ ఆస్థిలో చిల్లిగవ్వ చెందకుండా చేయగలరేమో కాని దాని ఆలోచనల్ని, ఆశల్ని మీరు నిరోధించలేరు....అలా చేస్తే నేనూ....."
   
    "రవీ...." ఉద్వేగంగా చేయి పైకెత్తాడు వీర్రాజు. హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
   
    ఎత్తిన చేతినిచూస్తూ అన్నాడు రవి-చెక్కుచెదరకుండా "పైకెత్తిన మీ చేతిని ఆశీస్సులందించే అభయహస్తంగా మారిస్తే సావేరి అదృష్ట వంతురాలవుతుంది. ఈ తరం నిన్నటి మీ తరం నమ్మకాల్ని గౌరవించే అవకాశమూ దక్కుతుంది. అందుకే చేతిని దించేయండి డాడీ....."వీర్రాజు అహానికి అసాధారణమైన విఘాతమేర్పడినట్టు అప్రతిభుడికంటే నిశ్చలంగా చెప్పుకుపోయాడు రవి. "డాడీ....మీరు మా ఇద్దరికీ జన్మనిచ్చిన తండ్రి.....కాబట్టి మా విషయంలో మీకో బాధ్యత వుందన్న సత్యాన్ని నేనూ అంగీకరిస్తాను. కానీ నేనూ, సావేరి ఒకే తల్లి కడుపునుంచి పుట్టినవాళ్ళం. కేవలం కొన్నేళ్ళ వ్యవధిలో ఒకే గూటి పక్షులుగా పిండం రూపంనుంచి ప్రపంచంలో అడుగుపెట్టిన వాళ్ళం....కాబట్టి మీ బాధ్యతకన్నా మా ఇద్దరి బంధం గొప్పది....."
   
   
    ఏమిటి....తిరుగులేని తన ఆధిపత్యానికిక్కడ యిలా తన కన్న బిడ్డమూలంగా యిలాంటి అవాంతరమేర్పడుతుందేమిటి?.....
   
    ఏనాడూ తనముందు పెదవి విప్పనివాడు ఈ రోజు యింతకి ఎలా తెగించాడు?
   
    "చెప్పండి డాడీ....మీ నిర్ణయం మార్చుకున్నానని చెప్పండి."
   
    "అసంభవం...."
   
    ఖంగుమంది వీర్రాజు కంఠం.
   
    క్షణాలు భయానకంగా గడుస్తుంటే ద్వారం దగ్గిర నిలబడ్డ రాధమ్మ కంపిస్తూ చూస్తూంది.
   
    "యస్....నా నిర్ణయానికి తిరుగులేదు సావేరి కాలేజీకి వెళ్ళే ప్రసక్తేలేదు. రాజేందర్ తో పెళ్ళి జరిగి తీరుతుంది."
   
    అప్పటికే రవి బయటికి వెళ్ళిపోయాడు నిర్లక్ష్యంగా.
   
    మరో అయిదు నిమిషాలలో సరాసరి లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళిన రవి శంకూతోబాటు ఏటిగట్టుకు చేరుకున్నాడు.
   
    ఆకాశంలో పైపైకి సాగిపోతున్న సూర్యుడు శారదానదిలో శిలాక్షరాల్ని రాస్తున్నట్టు నీటిపై కిరణాలు విచిత్రంగా మెరుస్తున్నాయి.
   
    "శంకూ...." ప్రసక్తి ఎలా ప్రారంభించాలో తెలీక కొన్ని క్షణాలు సందిగ్ధంగా నిలబడిన రవి చాలాసేపటి తర్వాత అన్నాడు- "నువ్వు సావేరిని ప్రేమిస్తున్నావా?"
   
    ఇలాంటి ప్రశ్న వూహించలేకపోవడంతో అప్రతిభుడయ్యాడు శంకూ.
   
    "సావేరి నిన్ను ఇష్టపడుతుందని నాకు తెలుసు....ఒకనాడు నీ మీద నేను కక్ష కట్టడానికి కారణమూ అదే....అయితే ఒక్క విషయం.
   
    సావేరిని ప్రేమించడమంత సులభం కాదు, సావేరిని పొందడము....."
   
    గాలి భారంగా తాకుతూ ముందుకు పారిపోతూంది.
   
    "సావేరికి అన్నగా నేనిప్పుడిలా మాట్లాడుతుంటే నువ్వు నమ్మలేక పోతున్నావని తెలుసు. కానీ వ్యవధిలేదు.....మీ ప్రేమఖరీదు మీ ఇద్దరి జీవితాలూ అని తేల్చి చెప్పాల్సిన క్షణం వచ్చేసింది. కాబట్టి సూటిగా అడుగుతున్నాను శంకూ...చదువుకి సంబంధించిణ పరీక్షలో తప్పితే మరోసారి పరీక్షకి కూర్చునే ధైర్యం నీకుందా అని తేల్చి అడుగుతున్నాను"
   
    శంకూ అప్పటికీ జవాబు చెప్పలేకపోయాడు.
   
    సావేరిని కలిస్తే బామ్మ బ్రతకనని చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొస్తూంది.
   
    "మాట్లాడు శంకూ....నిన్న నిన్ను కాదన్న రవి ఈ రోజు ఓ అన్నగా తన చెల్లికోసం ఆరాటపడుతున్నాడు. సావేరి ఏది కోరినా తెచ్చి యివ్వగల అన్నగా నిన్నిప్పుడు ప్రశ్నిస్తున్నాడు మొండిదైన సావేరి నువ్వు కాదన్నాగాని మేం కూడదన్నాగాని బ్రతకదు మీ బ్రతుకులు ముడిపడటానికి నాన్నగారూ అంగీకరించరు. మీ జీవితాలు ఓడిన అన్ని ప్రేమ కథల్లో ఒకటి కావాలనుకుంటున్నావా....? లేక ధైర్యంతో ముందుకు సాగిపోవాలనుకుంటున్నావా....? తను అనుకున్నది సాధించుకోడానికి నాన్నగారు అప్పుడే తన బలాన్ని వుపయోగించబోతున్నారు శంకూ!"
   
    "ఏం చేయమంటావు?"
   
    "సావేరి కోసం ఏమన్నా చేయగలనని నువ్వు నిరూపించుకోవాలి."
   
    "ఎలా?"
   
    "సావేరి బావ రాజేందర్ కి భార్య కాకుండా నువ్వు ఎదురు నిలబడాలి."
   
    "నే....నా....?"
   
    "పోరాటంలో కాదు, పారిపోయి......"
   
    అప్రతిభుడైనట్టు చూశాడు శంకూ.
   
    "అవును శంకూ! నువ్వు వెంటనే సావేరిని లేవదీసుకుపోవాలి. రేపు రాత్రికే!"
   
    అక్కడ నిమిషాలు లిప్తల్లా గడుస్తున్నాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra