Home » Unnava vijayalakshmi » Acharanalo Abhudayam

   
    ఇంతలో మబ్బురంగు సూటు, ఎరుపు రంగు టై కట్టుకుని వో చేత్తో సిగరెట్టు టిన్ను విలాసంగా పట్టుకుని మరో చేతి రెండు వెళ్ళ మధ్య కాలుతున్న సిగరెట్టు పెట్టుకుని అటు నుంచి వెళ్తున్న వ్యక్తీ కళ్యాణి ని అంత దూరం నుంచే చూసి అదొక లాంటి ఆసక్తి తో అడుగు ముందుకు వేయలేని వాడిలా అక్కడే కొద్ది క్షణాలు నిలబడిపోయి ఆ తరువాత మెల్లిగా నడుచుకుంటూ వోరగా కళ్యాణి వంకే చూస్తూ వెళ్ళటం మురళీ కంట పడింది. కాస్త దూరంగా వెళ్ళిపోయాక కూడా అతను మధ్య మధ్య వెనక్కి తిరిగి చూడటం మానలేదు. అది గమనించిన కళ్యాణి కి ఒళ్ళంతా ముళ్ళ తీగ, రాసుకున్నట్లుగా అనిపించి, ఇబ్బందిగా తల వంచుకుని చెంచా తో ప్లేటు లో మిక్స్ చర్ కదుపుతూ కూర్చుంది.
    'ఇప్పుడిలా వెళ్ళిన సూటు వాలా ఎవరో తెలుసా?' అన్నాడు రమణ మూర్తి.
    'బలేవాడివే -- అతన్ని గురించి తెలియని వారే వరుంటారయ్యా' అన్నాడు కామేశ్వర్రావు.
    'అదేమన్న మాట -- అతన్నంత వరకూ చూడని వాళ్ళు కొన్ని లక్షల మంది వుంటారీ వూళ్ళో.' అన్నాడు అవధాని.
    'చూడని వాళ్ళు వుంటే వుండొచ్చు కాని, వినని వాళ్ళు చాలా అరుదు-- కుబేరుడి కే అప్పు పెట్ట గలిగే టంతటి ఆస్తి ఇతని చేతులలోకి వచ్చాక క్రమంగా కర్పూరం లా హరించి పోతోందని, అతని డబ్బుతో బాగు పడుతున్న వాళ్ళు ముఖ్యంగా బార్ షాప్ వాళ్ళూ, ఒళ్ళు అమ్ముకుని బ్రతికే ఆడవాళ్ళూ అనీ చాలా మందికి తెలుసు-- వో చక్కని పిట్టని పట్టుకోటం మోజు తీరేదాకా ఆమెతో గడపటం ఈలోగా ఆ పిల్లకి కావాల్సిన నగలు, బట్టలూ ఒకటేమిటి ! చివరికి కాలి జోళ్ళ దగ్గర నుంచి కొని ఇవ్వటం, పార్కులకీ సినీమాలకీ ఆ పిల్లని వెంటేసు కుని తిరగటం ఆ తరువాత దాన్ని వదిలేసి ఇంకో పిల్లని చేరదియ్యటం ఇది అందరూ ఎరిగిన విషయమే.' అన్నాడు కామేశ్వర్రావు.
    'మొన్నో నాడు సిల్కు బట్టలు కొందామని షాపు లోకి వెళ్లాను. అక్కడికి ఈ రంగారావు ఈ కళ్యాణి గారి అక్కని వెంటేసుకుని వచ్చాడు. ' అన్నాడు రమణమూర్తి.
    'ఏమిటీ, ఎవరూ , అసలావిడని నువ్వు గుర్తు ఎలా పట్టావు?' అన్నాడు జగన్నాధం.
    'ఎలా గుర్తు పట్టడం ఏమిటి? కళ్యాణి గారికి ఆవిడకి చాలా దగ్గర పోలికలు వున్నాయి. అంతే కాదు ఫలానా కళ్యాణి తన చెల్లెలని , ఫలానా రావు గారు తన మరిది అని ఆవిడ గారు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్పుకుని, మురిసి పోతోంది.'
    ఇంక వినలేను అన్నట్లు లేచి నిలబడింది కళ్యాణి. సరిగ్గా అప్పుడే మురళీ కూడా అదే మాట కళ్యాణి ని అడగబోయి ఆమె లేవటం చూసి తనూ లేచాడు.
    'ఐస్ క్రీమ్ సార్.' అని బేరర్ వెనుక నుంచి అంటున్నా వినిపించుకోకుండా పాపని తీసుకుని గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోయాడు. మధ్యలో ఓ టేబిల్ దగ్గర వున్న కమలా ఆమె భర్తా వీళ్ళని చూసి మాట్లాడించ బోయారు కాని, 'అర్జెంటు పని వుంది.' అంటూ ముక్తసరిగా పలకరించి వాళ్ళని తప్పించుకుని ఎలాగో ఇంటికి వచ్చి పడ్డారు.
    దారి పొడుగునా, తరువాత ఇంటికి వచ్చాక కూడా కళ్యాణి ని ఒక్కటే సందేహం పట్టుకుని పీడిస్తోంది. 'వాళ్ళ మాటలు మాకు వినటానికి కటువుగా ఉంటాయని మాకు బాధ కలిగిస్తాయని వాళ్ళకి అనిపించదా?' అనుకుంది.
    అది వాళ్ళకి తోచక పోవటమూ కాదు తెలియక పోవటమూ కాదు-- అన్నీ తెలిసే అంటున్నారు-- అదొక సరదా--
    పిచ్చివాడు రోడ్డు మీద నడుస్తుంటే రాళ్ళు రువ్వి అతన్ని గాయపరచటం బాధించటం పిల్లలకి సరదా.
    మనిషిలో బలహీనత అనేది ఎక్కడైనా వుంటే గురి చూసి సూటిగా అక్కడ తగిలేలా ఈటెల లాంటి మాటలు విసరటం పెద్దలకి సరదా .....జీవితంలో ఎక్కడైనా మచ్చ అనేది ఏర్పడితే దానిని మరుగు పరుచుకుని పది మంది కంటా పడకుండా చేసుకోవాలని ఆ వ్యక్తీ ఎంత తాపత్రయ పడతాడో, దాన్ని అంతగా బయటికి లాగి పదే పదే దాన్ని గురించి చర్చించి ఆ మనిషిని న్యూనత పరచటం కొందరికి సరదా.......
    అలాంటి సరదా కి గురి అయిన కళ్యాణి మురళీ ఇద్దరూ నిజంగా పిచ్చి వాళ్ళే అయిపోయారు.
    ఒకరు బాధతో పిచ్చి వారయితే ఇంకొకరు కసితో. ఒకరిది దుఃఖ మయితే ఇంకొకరిది ఆవేశం.
    మర్నాడు ఆదివారం --
    శలవు రోజుకి వో ప్రత్యేకత వుంటుంది మరొకప్పుడయితే -- కాని ఇవాళ మాత్రం, ఆ భార్యాభర్తల మధ్య సామరస్యం లేని కాలంలో అన్ని రోజులూ ఎలా గడుస్తాయో అలాగే ఉదయం అంతా గడిచి పోయింది.
    పది గంటలకి ఏదో ఇంత తిని బట్టలు మార్చుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు మురళీ.
    ఎలాగో పనులన్నీ ముగించుకుని గదిలోకి వచ్చి కూర్చుంది కళ్యాణి -- ఆమె మనస్సంతా ఎంతో వెలితిగా, లోకంలో ఏ వస్తువు కూడా ఆ వెలితిని పూడ్చ గలిగే శక్తి లేదే మో నన్నంత శూన్యంగా అనిపిస్తోంది-- లోకంలో వున్న దురదృష్టం అంతా తన ఒక్కదాని నెత్తి మీద యెక్కి కూర్చున్నదా అన్నంత నిరాశతో దుఃఖం తో ఆమె అంతరంగం విలవిల్లాడి పోతోంది-- ఈ లోకంలో నాకు ఎవ్వరూ తోడు లేరు , నేను ఏకాకి ని అనే భావం ఆమెని నిలువునా కృంగ దీస్తోంది-- తన పరిస్థితి కి తనే జాలి పడుతున్నట్లు పేలవంగా నిర్జీవంగా నవ్వుకుంది.
    అంతలో ఆమె కళ్ళ ముందుకి యేవో సంఘటనలు మెదిలాయి-- ఈ జీవితం భగవంతుడు ప్రసాదించిన అపురూపమైన వరం, ఈనాటి నా అదృష్టం ఎన్నో జన్మల పుణ్య ఫలం -- నా అంతటి అదృష్ట వంతులు ఈ లోకంలో చాలా అరుదుగా వుంటారు. అనే భావంతో మనస్సు పొంగిపోయి పరవశించి పోయిన సందర్భాలు గుర్తు వచ్చాయి--
    మరోసారి విరాగిని లా వేదాంతి లా నవ్వుకుంది కళ్యాణి-- 'ఏమిటి ఈ జీవితం? ఒక క్షణంలో సంతోషం, మరో క్షణంలో నిరాశ అంతలోనే మరేదో ఆనందం-- వెలుగు నీడల లాంటి ఈ అనుభూతులు నాతొ ఎందుకిలా దోబూచు లాడుతున్నాయి? ఈ బ్రతుకంతా ఇలాగే గడిచి పోవాలా ? స్త్రీ జీవితానికే నిర్వచనమా ఇది?....ఉలిక్కిపడింది కళ్యాణి-- తన వూహలు ఆలోచనలు తప్పుదారిలో పడిపోతున్నాయని వెనక్కి తగ్గింది.
    ఉహూ అలా ఎన్నటికీ కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలితో స్త్రీ జాతి నంతటి నీ పోల్చటం అన్యాయం. అవివేకం .... అసలు నేను ఈ వివాహం చేసుకోటం లో పొరబాటు చేశానా? నాలాగే ఇలాంటి అనుభవానికి ప్రయోగానికి అడుగు ముందుకి వేసిన వారు-- వాలుగా పోయే ప్రవాహానికి ఎదురీదిన వారు-- ఇలాగే అడుగడుగునా పరీక్షల కి తట్టుకుంటూ కంటకావృతమైన జీవితం గడపాలా? వారి జీవితం అంతా భయంకరమైన అనుభవాల పుట్టగా తయారవుతుందా...'
    ఆలోచనలలో పడి కొట్టుకుంటూ టైము గమనించలేదు. మురళీ ఇంటికి తిరిగి రావటంతో తలుపు తీసి టైము చూసింది. మధ్యాహ్నం రెండు గంటలయింది--
    పాపకి పాలు పట్టి, తమకి టిఫిను తయారు చేసే ప్రయత్నంలో పడింది కళ్యాణి.
    సాయంకాలం నాలుగవు తొంటే మురళీ నిద్ర లేచాడు. ఇద్దరూ మౌనంగానే టిఫిన్ కాఫీ ముగించారు.
    ఆ తరువాత మురళీ స్నానం చేసి బట్టలు వేసుకుని 'వో ఫ్రెండూ నేనూ సినీమా కి వెళ్తున్నాం ' అని చెప్పి వెళ్ళిపోయాడు-- తమ పెళ్లి జరిగిన తరువాత ఈ రెండు సంవత్సరాలలో మురళీ తనని విడిచి సినీమా కి వెళ్ళిన సందర్భం ఇదే-- ఆ ఆలోచన, ఆ నిజం కళ్యాణి కి ఒక్కసారి ఎలాగో అనిపించినా, ఎలాగో సరిపెట్టు కుని పాపకి స్నానం చేయించటానికి బాత్ రూమ్ లోకి తీసుకు వెళ్ళింది......
    రాత్రి ఎనిమిది గంటలు దాటింది-- ఇంటి ముందు రిక్షా దిగి యధాలాపం గానే తల తిప్పి చూశాడు. చిక్కటి చీకటి పరుచుకుని వుంది--  ఆ నిశీధి లో ఆ కాంపౌండు లో ఆ రెండస్థుల చిన్న మేడ బిక్కుబిక్కు మంటూ నిలబడి నట్లుగా వుంది-- ఇల్లంతా యింత చీకటి గుయ్యారం లా వుందేమిటి అందరూ ఏమై పోయారు అనుకున్నాడు మురళీ -- మళ్లీ అంతలోనే గుర్తు వచ్చిందతనికి ఆ మెడలో వుంటుండే దేశ్ పాండే మెహతా కుటుంబాలు రెండూ పది రోజుల క్రితమే వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకి వెళ్లారు. వో నెల రోజులలో తిరిగి వస్తామని తమ యింటి ని కూడ కాస్త కనిపెట్టి చూస్తుండ మనీ అప్పజెప్పి వెళ్ళారు-- మరయితే కళ్యాణీ , ఆ పైన గోపాలరావు పిల్లలూ అంతా ఎక్కడికి వెళ్లినట్టు యింట్లో లైటయినా లేకుండా -- అతని ఆలోచనలకి అనుమానాలకి సమాధానం చెప్పినట్లుగా ఎదురింటి కిటికీ లోంచి కొవ్వువత్తి వెలుగుతూ కనిపించింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra