Home » Vasundhara » Sankaravam

 

    "అంటే?"
    "పరాయి అడదానికా విషయాలు చెప్పుకోవడమెందుకు?"
    "వేదా విస్సీని పెళ్ళి చేసుకున్నా ఉదయ మనకు పరాయిది కాదు. ఆమె కూడా మనింట్లోని మనిషి. ఎన్నో ఏళ్ళుగా తెలుసు. ఆ చనువుంది...."
    వేదాంతం నిట్టూర్చి...."ఒక జలజ, ఒక మనోహరి నీ ప్రవర్తనను యోగ్యతాపత్రాలివ్వలేదు. నీకు వారితో పూర్వ పరిచయముంది. ఉదయతో అలాంటి పరిచయం లేదు నీకు. కొత్త మోజు పోత మోజును తరిమేసింది. ఇప్పుడొక అనాఘ్రాతపుష్పం వచ్చి నీ ముందు నిలిస్తే నీ మనసు మళ్ళీ చలిస్తుంది....' అన్నాడు.
    'అంటే?" అన్నాడు కులభూషణ్ కోపంగా.
    "అనాఘ్రాతపుష్పమే కాదు పూర్వ పరిచయం లేని ఏ ఆడదైనా నిన్ను లొంగదీసుకాగలదు. రవ్వంత అంది పూర్తీ వయసు ఉండాలంతే?"
    "నేనొప్పుకోను ...."
    "సవాలు చేయనా?"
    కులభూషణ్ ఆశ్చర్యంగా "ఎలా?' అన్నాడు.
    "ఓ కొత్త అమ్మాయి ఏకాంతంగా వచ్చి నిన్ను కలుసుకుని నీకు దాసోహమంటుంది. నిన్ను నీవు నిగ్రహించుకోగలవా?"
    "గలను "
    'ఆలోంచి చూడు"
    "అవసరం లేదు"
    "లేదనుకో. ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు ఆ అమ్మాయి పార్వతి అనుకో....' అన్నాడు వేదాంతం.
    పార్వతి వారి పక్కింటి అమ్మాయి. చాలా బాగుంటుంది. వయస్సు పందొమ్మిది. తరచు వారింటికి వస్తూ పోతుండేది సీతమ్మ లేనప్పుడు.
    ఆమె సంసార పక్షంగా పెరిగింది. ఆమె చూపుల్లో సంకేతాలుండవు. ఇతరుల సంకేతాలామెకు అర్ధం కావు.
    సీతమ్మకు భయపడి కులభూషణ్ ఆమె జోలికి వెళ్ళలేదు కానీ మనసులో ఆమంటే ఆశ వుంది.
    వేదాంతం మాటలతో పార్వతి కులభూషణ్ ఆలోచనల్లోకి వెళ్ళింది.
    "నీ ముఖం ఎర్రబడింది. శరీరం వణుకుతోంది. నీ మనసు పవిత్రంగా ఉందంటే నేను నమ్మను" అన్నాడు వేదాంతం.
    కులభూషణ్ మాట్లాడలేదు.
    "ఇదీ నీ పవిత్రత !" అన్నాడు వేదాంతం.
    'అలాంటి పరిస్థితుల్లో నువ్వు నీ పవిత్రతను నిలబెట్టుకోలేవు...."
    "ఎలాంటి పరిస్థితుల్లో ?"
    ఒకనాడు జలజ కులభూషణ్ నిఎన్నో విధాల రెచ్చ గొట్టాలని చూసింది. జలజ స్థానంలో పార్వతి నుంచి పరిస్థితుల వేదాంతానికి వివరించాడు కులభూషణ్.
    వేదాంతం నవ్వి "గర్ల్ ఫ్రెండ్ పక్కనుండగా బ్లూ, ఫిల్ము చూశాను. అయినా పవిత్రతను కోల్పోలేదు. అమెరికాలో కాపాడుకున్నా నా పవిత్రత ఇండియాలో పోగిట్టు కొంటాననుకోకు--" అన్నాడు.
    'అమెరికాలో నువ్వేం చేశావో నా కేలా తెలుస్తుంది. నీ నిజాయితీని నమ్మాలంటే!"
    "నమ్మడమెందుకు ? పరీక్షించవచ్చుగా ...."
    "ఎలా?"
    "సవాలు చేయి, ఒకే పరిస్థితులో మన మిద్దరం.....ఒకే విధంగా ప్రవర్తిస్తామో లేదో చూడాలి..."
    'ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు కాదు...."
    "మరెప్పుడు?"
    "ముందుగా నా పరిశోధనలో ఒక ప్రముఖ ఫలితాన్ని అర్ధం చేసుకోవాలి "
    "ఏమిటది ?"
    "ఆటవిక గ్రామంలోని మొక్కలు మన వాతావరణం లోనూ బ్రతుకుతున్నాయి. కానీ ఇక్కడ అవి వేసిన చిగుళ్ళ లో పాత లక్షణాలుండడం లేదు...."
    'అంటే?"
    'అప్పట్లో నువ్వో మొక్క తెచ్చి మన దొడ్లో పాతావు. ఆ మొక్క ఆకులూ వైద్యానికి పనికి రాలేదు. నువ్వు వేరే మొక్క తెచ్చావనుకున్నాను. కాని అది నిజం కాదు. ఈ మొక్కలు ఆటవిక గ్రామ వాతావరణంలో అక్కడి మట్టిలో పెరిగినప్పుడే క్యాన్సర్ని నిర్మూలించగల ఆకులూ తయారు చేస్తున్నాయి. అంటే ఇక్కడి మట్టికీ అక్కడి మట్టికి తేడా ఉంది. ఇక్కడి గాలికి అక్కడి గాలికి తేడా ఉంది, ఈ తేడాను పరిశీలించడం ఎంతైనా అవసరం....

 

                                 
    'అంటే మళ్ళీ ఆటవిక గ్రామానికి వెళ్ళాలంటావా...."
    'అవును"
    వేదాంతం ఆలోచిస్తూ 'అక్కడకు విశ్వనాద్ ను కూడా తీసుకుని వెడదాం." అన్నాడు.
    "ఎందుకు?"
    "అతడు కంప్యుటర్లా పని చేయగలడు. అతణ్ణి తీసుకుని వెడితే కూడా ఒక కంప్యూటరున్నట్లే --" అన్నాడు వేదాంతం.
    "ఈ ఆలోచన నాకు స్పురించ లేదు ...." అన్నాడు కులభూషణ్.
    'అయితే ముందు మన ప్రయాణం తర్వాత సవాలు...."
    "అంటే నీ ధనుష్టంకారాన్ని తాత్కాలికంగా వాయిదా వేశావా?"
    "ఏమో తాత్కాలికమో, శాశ్వతమో చెప్పలేను. అమ్మ ప్రాణాలు తీసిన విస్సీ అంటే నాలో జుగుప్స బయల్దేరింది. కొంతకాలం పాటు వాడిని నువ్వు ఉపయోగించుకో, విస్సీ తప్పు మనదే కాని వాడిది కాదు. అలాంటి మనిషిని మళ్ళీ మనం తయారు చేయలేం. అందుకే వాడిని నాశనం చేయలేదు.
    'అయితే ఎప్పుడు మన ప్రయాణం ?"
    "ముహూర్తం నేను పెడతాను "
    వేదాంతం, కులభూషణ్ ఉలిక్కిపడి అటు చూశారు. అక్కడ ఉదయ నిలబడి ఉంది.
    ఆమె ఉదయ భానుడిలా ప్రకాశిస్తోంది.
    "నువ్వు మా సంభాషణ విన్నావా?" అన్నాడు వేదాంతం. ఉదయ అతడి ప్రశ్నకు బడులివ్వకుండా "నేనూ మీతో వస్తున్నాను" అంది.
    "నువ్వా ఆటవికుల మధ్యకా! అది చాలా ప్రమాదం !" అన్నాడు కులభూషణ్ కంగారుగా.
    "ప్రమాదాలకు భయపడే దశ దాటిపోయాను నేను...." అంది ఉదయ.
    'అయినా నువ్వు మాతో రావడమెందుకు ?" అన్నాడు వేదాంతం.
    "వేదాంతం -- నన్ను కూడా మీతో రానివ్వండి. నువ్వు నాకు విస్సీ బావను అప్పగించు. అతడి కేలా అదేశాలివ్వాలో చెప్పు. విస్సీ బావను నేను నా గుప్పిట్లో ఉంచుకుంటాను" అంది ఉదయ.
    "ఎందుకు?"
    "నాలో మళ్ళీ జీవం నింపిన ఆ అమృతం రహస్యాన్ని చేధించడంలో భూషణ్ కు నేనే స్వయంగా సాయపడాలనుంది. అది నా బాధ్యత.
    అందుకు విస్సీ బావను అదుపు చేస్తూ ఆదేశాలివ్వడంలో నాకు మానసిక తృప్తి ఉంటుంది."
    'అయితే ఇది మీ ముగ్గురికి సంబంధించిన విషయం. ముగ్గురూ వెళ్ళండి. నేనింట్లో ఉంటాను" అన్నాడు వేదాంతం అదోలా.
    "నువ్వూ రావాలి " అంది ఉదయ.
    "ఎందుకు?"
    "మీ ఇద్దరితో పాటూ నేనెందుకో అలోచించి చూడు...."
    కులభూషణ్, వేదాంతం ముఖముఖాలు చూసుకున్నారు.
    ఉదయ తమ సవాలు విందా?"
    ఆమె తామిద్దరినీ పరీక్షిస్తుందా?
    అంటే ఉదయ తనముందు జలజలా....
    "వద్దు" అన్నాడు కులభూషణ్. "ఏమిటి వద్దు?' అంది ఉదయ . కులభూషణ్ చెప్పలేక ఊరుకున్నాడు. ఉదయ నవ్వి "నన్ను రాకుండా మీరపలేరు. ఈ ఇంట్లో నన్నాపగల శక్తి అత్తకే ఉంది. ఆమె పైలోకంలో ఉంది. ఆపైన విస్సీ బావ కుంది. అతడు నా అదుపులో ఉన్నాడు..." అంది.
    అంగీకార సూచకంగా కులభూషణ్, వేదాంతం తలలూపారు. అప్పుడుదయ ముందు వారు కూడా విస్సీబావకు లాగే ఉన్నారు.

                             **    **    **

    కులభూషణ్ , వేదాంతం , విశ్వనాద్, ఉదయ నలుగురూ సుబ్బరావిల్లు చేరుకున్నారు. ఆ ఇంట్లో వేదాంతం, కులభూషణ్ లకు లభించిన గౌరవ మర్యాదలు ఉదయను నిశ్చేష్టురాలిని చేశాయి. ఆలయంలో దేవుణ్ణి కూడా ఎవరూ అంతగా ఆరాధించరు.
    "ఊరికి గనేయ్య పీడా విరగడయి పోయింది. అతడు తను చేసిన అన్యాయాలన్నీ ఒప్పుకుని తన డబ్బును ఊళ్ళో వారందరికీ వంతుల వారీగా పంచి పెట్టి తనూ శ్రమ జీవుల్లో ఒకడై పోయాడు. డబ్బు సంగతెలాగున్నా మా ఉళ్ళో బానిసత్వం పోయింది. అంతా మీరు చెప్పినట్లే జరిగింది." అన్నాడు సుబ్బారావు వేదాంతంతో.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra