Home » Mainanpati bhaskar » Yama Dootha


    
    తన ఉనికిని ఎలా కనిపెట్టగలిగారు వీళ్ళు?
    
    ఎలా కనబడుతోంది తను వీళ్ళకి? కన్నుపొడుచుకున్నా కానరాని ఈ చిమ్మ చీకట్లో!
    
    అంటే నిస్సందేహంగా ఎక్కడనుంచో వెలుగు వచ్చి తనమీద పడిపోతూఉండాలి.
    
    కుంటివాడు ఊతకర్ర తన గుండెమీదే కొడుతున్నట్లుగా శబ్దం చేస్తోంది. క్షణక్షణానికీ దగ్గరవుతోంది శబ్దం.
    
    ముచ్చెమటలు పోస్తున్నాయి జహనారా బేగంకి.        
    
    ఒకటే ప్రశ్న ఆమె మనసుని దొలిచేస్తోంది.
    
    ఎక్కడనుంచి వస్తోంది వెలుగు? ఎలా కనబడుతోంది తను వాళ్ళకి? మాస్టర్ స్విచ్ పనిచేయడం లేదా? ఏ లైట్ పాయింట్ కన్నా మాస్టర్ స్విచ్ కనెక్షన్ పాడయిపోయిందా?
    
    ఏం జరిగింది?
    
    విహ్వలమయిపోయింది జహనారా బేగం మనసు. ఏమవుతోంది?
    
    ఆమెకి మళ్ళీ తన కొడుకు జలీల్ గుర్తు వచ్చాడు. రోదించింది ఆమె హృదయం!
    
    జలీల్! జలీల్! ఎక్కడున్నావు నాయనా! ఈ ముసలి తల్లి చనిపోయేముందు ఒక్కసారి రావా? నీ గొంతు చివరిసారిగా వినే అదృష్టం కలిగించవా? అంతిమ శ్వాస వదిలేముందు ఒక్కసారి నన్ను దగ్గరికి తీసుకుని శిరసుని చుంబించే భాగ్యం కలిగించవా నాయనా! నా జలీల్! జలీల్!
    
    మళ్ళీ అంతలోనే తనమీద తనకే ఆగ్రహం కలిగింది జహనారా బేగంకి!
    
    ఎందుకిలా ఆలోచిస్తోంది తను?
    
    తనతోబాటు తన కొడుకు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతిలో చావాలని కోరుకుంటోందా తను! అలా కాకూడదు! ఒంటరిగా పోరాడుతుంది తను!
    
    ఒంటరిగానే ఛస్తుంది!

 

    అంతేగానీ జలీల్ కూడా వచ్చి ఈ మారణహోమంలో చిక్కుకోవాలని మాత్రం కోరుకోదు! నిజం!
    
    వికటంగా నవ్వుతూ ఆమెని సమీపించడం మొదలుపెట్టారు దుండగులు నలుగురూ.        
    
                                                                  * * *
    
    నగరంలో అది ఒక పెద్ద స్టార్ హోటల్.
    
    చాకొలెట్ కేక్ లాగా అందంగా ఉంది ఆ బిల్డింగు.
    
    దానిలో ప్రవేశించాలంటే దాదాపు రెండు ఫర్లాంగుల పొడుగు వున్న ప్రైవేట్ రోడ్డు దాటాలి ముందు.
    
    కిటికీలకి చలువటద్దాలు బిగించి ఉన్న ఒక ఎయిర్ కండిషన్డ్ టూరిస్టు కోచ్ మృదువుగా జారుతూ వచ్చి హోటల్ పోర్టికో ముందు ఆగింది.
    
    దాని రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు లాబీలో నిలబడి ఉన్నారు హోటల్ తాలూకు హోస్టెస్ లు ఇద్దరు. హోటల్ స్టేటస్ కి తగినట్లు ఖరీదైన సిల్కు చీరెలు కట్టుకుని చాలా ఫాషనబుల్ గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళపక్కనే వినయంగా ఒక బెల్ బాయ్ నిల్చుని వున్నాడు. అతని చేతిలో ఒక చిన్న కర్ర వుంది. ఆ కర్రకి పరిమళ భరితమయిన పూలతో కట్టిన సన్నటి దండలు చాలా తగిలించి వున్నాయి. అతని రెండో చేతిలో ఒక పళ్ళెం ఉంది. అందులో హారతి కర్పూరం ఉంది.
    
    ఆ హోటల్ కి వచ్చే గెస్టులలో ముప్పాతిక మూడొంతుల మంది ఫారినర్సే వుంటారు. వచ్చిన ప్రతి గెస్టుకీ భారతీయ పద్దతిలో హారతి ఇచ్చి బొట్టు పెట్టి దండవేసి ఆహ్వానించడం ఆ హోటల్లో ఆనవాయితీ! లగ్జరీ హోటల్స్ ఫారినర్స్ కి కొత్త కాదు. వాళ్ళు ముచ్చటపడేది ఇలాంటి 'దేశవాళీ' ఎక్స్ ట్రా ట్రీట్ మెంట్ ని చూసి మాత్రమే!
    
    "రెడీనా?" అంది ఒక హోస్టెస్ రెండో హోస్టెస్ తో!
    
    "యా!" అంది రెండో అమ్మాయి.
    
    బస్సు తలుపు తెరిచాడు హోటల్ డోర్ మాన్. టూరిస్టు కోచ్ లోంచి ముందుగా దిగాడు ఒకతను. అతని వయసు నలభై ఉండొచ్చు. కానీ వడలిపోయి యాభై ఏళ్ళు దాటినట్టు కనబడుతున్నాడు. అతని చేతిలో చౌకరకం సూట్ కేస్ వుంది. దానికి ఒకవైపు లాక్ లేదు. కప్పనోరు తెరిచినట్లు తెరుచుకుని ఉంది ఆ సూట్ కేస్. అందులోనుంచి సాదా హాండ్లూమ్ టవల్ తాలూకు అంచులు కనబడుతున్నాయి.    

 

    ఆ వెనకే దిగింది ఒకామె.
    
    జుట్టుకి బాగా నూనె పట్టించి బిగుతుగా అల్లిన జడ. చవుక రకం సింథెటిక్ చీరె. ఆ చౌక బట్టల్లోనే మాచింగ్ కోసం తాపత్రయ పడినట్లు అర్ధమవుతుంది. సాదా బాటా చెప్పులు.
    
    ఆ తర్వాత దిగాడు ఓ పాతికేళ్ళ కుర్రాడు. చెంపలు ఎండుకు పోయి వుండటం వల్ల బాగా సన్నగా కనబడుతున్నాడు. మనిషి పుష్టిగా లేకపోవడం వల్ల మొహం పొడుగ్గా కనబడుతోంది. అరిగిపోయిన చెప్పులని నాలుగైదుసార్లు రిపేర్ చేయించినట్లు అతుకులు కనబడుతున్నాయి వాటికి.
    
    టూరిస్టు కోచ్ లో నుంచి దిగుతున్న వాళ్ళవైపు కళ్ళప్పగించి చూస్తూ కొయ్యబొమ్మల్లా నిలబడిపోయారు హోస్టెస్ లు ఇద్దరూ. తమ కళ్ళెదురుగా కనబడుతున్నది కలో నిజమో వాళ్ళకి అర్ధం కాలేదు.
    
    ఈ లోయర్ మిడిల్ క్లాస్ మనుషులని గౌరవంగా ఆహ్వానించడానికా తాము ఇక్కడ నిలబడి వుంది? ఇందులో పొరబాటు ఏమీ లేదు కదా!"
    
    హోస్టెస్ లిద్దరూ ఒకళ్ళవైపు ఒకళ్ళు సాభిప్రాయంగా చూసుకుని తర్వాత టూరిస్టు కోచ్ వైపు పరీక్షగా చూశారు.  

 

    సందేహం లేదు!
    
    ఆ టూరిస్టు కోచ్ తమ హోటల్ కాంట్రాక్టులో ఉన్నదే!
    
    ఆ డ్రైవర్ తమకి పరిచయమయిన పాత డ్రైవరే!
    
    ఈలోగా -
    
    సంకోచంగా మెట్లెక్కి హోటల్ సింహద్వారాన్ని సమీపించారు టూరిస్టుకోచ్ లోనుంచి దిగిన పాతికమంది మనుషులు.    

 

    సందిగ్ధంగా గ్లాస్ డోర్ తెరిచి పట్టుకున్నాడు డోర్ మాన్.
    
    వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా అందరూ లాబీలోకి వచ్చారు.
    
    ఈ "మూక" కి హారతి ఇచ్చి, బొట్టెట్టి పూలహారాలు వేసి స్వాగతం చెప్పాలా అక్కర్లేదా అన్నట్లు హోటల్ ఫ్లోర్ మేనేజర్ వైపు చూశారు హోస్టెస్ అమ్మాయిలిద్దరూ.
    
    నీలం రంగు బ్లేజరూ, గ్రే కలర్ ప్యాంటూ తళతళలాడే నల్లటి షూస్ వేసుకుని ఉన్న ఫ్లోర్ మేనేజర్ తక్షణం జవాబు ఏమీ చెప్పలేక హోస్టెస్ ల వంకా, బస్సుదిగి లోపలకి వచ్చిన మధ్యతరగతి మనుషుల వంకా మార్చ్గి మార్చి చూడడం మొదలెట్టాడు.
    
    లోపలికి వచ్చిన ఆ మనుషుల పరిస్థితి కూడా అంతే. ఇబ్బందికరంగా వుంది. తాము రావాల్సిన చోటుకే వచ్చామో, లేకపోది ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగిందో వాళ్ళకి అర్ధం కావడం లేదు.
    
    వాళ్ళలో చాలామంది నెర్వస్ గా ఫీలవుతూ, గుటకలు మింగుతూ దిక్కులు చూడడం మొదలుపెట్టారు. అడుగడుగునా అత్యంత విలాసవంతంగా కనబడుతున్న ఆ పరిసరాలని చూస్తుంటే వాళ్ళకి మతిపోతున్నట్లు ఉంది. వాళ్ళలో ఉన్న ఓ ముఫ్ఫయ్ ఏళ్ల స్త్రీ సంభ్రమంతో ఆ హోస్టెస్ అమ్మాయిలను నఖశిఖ పర్యంతం పరికించి చూస్తోంది. వాళ్ళని చూస్తే అక్కడ పనిచేసే వాళ్ళలాగా లేరు. వాళ్ళే ఆ హోటల్ కి అసలైన యజమానుల్లాగా వున్నారు. వాళ్ళు ఇంకొకళ్ళకి ఊడిగం చెయ్యడానికి అక్కడ వున్నారనే భావమే కొరుకుడు పడడంలేదు ఆమెకి. వింతగా చూస్తోంది.
    
    ఆ హోస్టెస్ లని మించి ఉన్నారు స్టివార్డులూ, వాళ్ళని మించి ఉన్నారు ఫ్లోర్ మేనేజర్లు.  

 

    లాబీ అంతా పాలరాయి. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్! అక్కడంతా అలముకుని వుంది సున్నితమయిన పరిమళం! కన్ సీల్డ్ స్పీకర్ లోనుంచి అతి చిన్నగా అతి శ్రావ్యంగా సంగీతం! మంద్రస్వరాలతో వినబడుతున్న మాటలు! ఆ హోటల్ కి వస్తున్న గెస్టులందరూ డబ్బులో పుట్టి, డబ్బులో పెరుగుతున్న వాళ్ళులాగా ఉన్నారు.
    
    హోటల్ స్టాఫ్ అలా దిగబడిన ఆ గెస్టులనీ, ఆ గెస్టులు ఆ హోటల్ స్టాఫ్ నీ ఎగాదిగా చూసుకుంటూ వుంటుండగా -
    
    ఆ ఇబ్బందికర వాతావరణాన్ని తేలికచేస్తూ గంభీరమయిన గొంతు ఒకటి వినబడింది.
    
    "వెరీగుడ్! అందరూ వచ్చేశారన్నమాట! వెల్ కమ్! వెల్ కమ్!"
    
    చటుక్కున తిరిగి చూశారు అందరూ.
    
    అప్పుడే లిఫ్టు దిగి లాబీలోకి వస్తున్నాడు మెకానిక్. లైట్ వెయిట్ సిల్కు సూటు! తెల్లటి ఉంగరాల జుట్టు! కండలు తిరిగిన శరీరం! స్మార్టుగా ఉన్నాడతను.
    
    అతని గొంతు వినబడగానే మెయిన్ డోర్ దగ్గర నిలబడివున్న హోస్టెస్ లలో ఒక్కసారిగా చలనం వచ్చింది.
    
    అప్పటిదాకా మెదులుతున్న సందేహాలని పక్కకు నెట్టేసి జరగాల్సిన కార్యక్రమం మొదలెట్టేశారు వాళ్ళు. హారతి వెలిగించింది ఒకమ్మాయి. రెండో అమ్మాయి ఆ గ్రూపులోని ప్రతి ఒక్కళ్ళకి నుదుట కుంకుమ బొట్టుపెట్టి మెడలో పూలహారం వేసి సింథెటిక్ నవ్వుతో ఆహ్వానించింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra