Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

     "ఇదిగోమ్మా, ఈ డబ్బు తీసుకో పెన్షన్, ఎరియర్స్ వచ్చాయి".
   
    "నా కెందుకండీ మీ అక్కౌంటుందిగా అందులో వేసెయ్యండి".
   
    "కాదమ్మా! యామిని పెళ్ళికి చాలా అప్పులు చేశారు. నీ దగ్గర డబ్బు కూడా తీసేసుకున్నాం. ఈ డబ్బు నేనేం చేసుకుంటాను చెప్పు. నీకు అవసరం అయిందేమయినా కొనుక్కో నీకో మంచి చీరయినా ఇవ్వలేకపోయాం. పండక్కి పట్టుచీరయినా కొనుక్కో" ఆప్యాయంగా ఆయనయిస్తుంటే కాదనలేకపోయింది. మామగారు అతి మామూలు మనిషి. చేసిన ఉద్యోగం చిన్నదే కాని సంస్కారం వుంది. తనంటే ఆప్యాయత కూడా వుంది. పెద్దింటినుంచి వచ్చినదనీ, బాగా చదువుకున్నదనీ గౌరవం కూడా. రోజంతా ఇద్దరే ఇంటిలో వుండడంతో కాస్త సన్నిహితులయ్యారు. ఆయన తృప్తికోసం ఏదయినా కొని చూపించాలనుకుంది. కాని విషయం తెలియగానే శ్రీరామ్ ఎగిరిపడ్డాడు.
   
    "చీరకోసం వెయ్యిరూపాయలు ఎందుకు? రేపు యామిని వాళ్ళు వస్తే పండక్కి ఏమయినా కొనిపెట్టొద్దూ. అన్నీ అప్పులు తీసుకున్నాను. ఇంకెక్కడనించి తేను? ఓ పని చెయ్యి భార్గవీ? ఈ సారికి అందరికీ బట్టలు కొనెయ్యి రెండు నెలల్లో నాకు డబ్బు వస్తుంది. అప్పుడేమయినా కొనుక్కుందువుగాని".
   
    "సరే, వాళ్ళిద్దరికీ కొంటాను. మనిద్దరికీ ఎలాగూ మా వాళ్ళు కొంటారు" అంది కావాలనే.
   
    "వాళ్ళ దగ్గర ఇంకా తీసుకోవడం బావోదు. పెళ్ళిలోనే చాలా ఖర్చుపెట్టారు. అప్పుడంటే కాదనలేకపోయాను. పదే పదే వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదు భార్గవీ!"
   
    "కాని వెళ్ళకపోతే బావుండదు. వెళ్ళి ఏమీ కొనవద్దని చెబుదాంలెండి" ఓరగా చూస్తూ అంది.
   
    "వెళ్ళడానికయినా ఎక్కడ కుదురుతుంది? యామిని వాళ్ళు వస్తారా! ఎలాగూ అక్కయ్య వాళ్ళని పిలవాలికదా? వాళ్ళు వచ్చాక మనం వెళ్ళిపోతే బావుండదు" అంటూ బయటపడ్డాడు...
   
    భార్గవి విషాదంగా నవ్వుకుంది. తమకూ ఇది మొదటి పండగే. తప్పకుండా రమ్మని తల్లీ తండ్రీ ఉత్తరాలు వ్రాశారు. ఆమెకు తల్లిదండ్రుల్నీ, తమ్మున్నీ చూడాలనీ, వాళ్ళతో గడపాలనీ పెద్దగా కోరికేంలేదు. యామినికి జరుగుతున్న ముచ్చట్లు చూస్తుంటే తను కోల్పోయిందేమిటో తెలుస్తున్న ఫీలింగు. ఈ వాతావరణంనించి బయటపడితే క్రెడిట్లు, డెబిట్లు స్థానే కాస్త అనురాగం, మరికాస్త రొమాన్సు శ్రీరామ్ లో కలుగతాయేమోనని ఆశ. ఇంటిని వదిలి వచ్చాక తన కెలాంటి స్వేచ్చ దొరికిందో తన వాళ్ళకు తెలియచేయాలని కోరిక.
   
    "ఒకసారి వెళితే బావుంటుంది. నాకూ అమ్మను చూడాలనుంది" అంటూ మనసులో మాట చెప్పింది.
   
    "అరే! వాళ్ళింటిలో ఇప్పట్లో అడుగు పెట్టనన్నావుగా అందుకే అక్కయ్య వాళ్ళను కూడా రమ్మని రాసేశాను. మనం ఎక్కడకూ వెళ్ళడం లేదని కూడా రాసేశాను. ఇప్పుడలా వెళతానంటే ఏం బావుంటుంది?" అన్నాడు.
   
    'ఇన్నాళ్ళకు తనవాడంటూ ఓ ఆత్మీయుడు దొరికాడని తల్లిదండ్రుల మీద కక్షంతా తన బాధ అతడి దగ్గర వెళ్ళబోసుకుని మనోభారాన్ని వదలించుకున్న తృప్తిని పొందింది. కాని తను చేసింది పొరపాటా? అనాలోచితంగా చెప్పకూడని విషయాలన్నీ చెప్పి చులకనయిపోయిందా?" ఎంత ఆప్తులకయినా నీ మనసుని విప్పి చెప్పకు" అన్న చలం మాట ఎంత నిజం! అనుకుంది.
   
                             *    *    *

    దీపావళి పండగ దగ్గిరపడింది. నాలుగురోజులు ముందుగానే శ్రీరామ్ అక్క చెల్లెలు భర్తలతో వచ్చేశారు. ఆ పూటే తండ్రి కూడా రావటం ఆశ్చర్యంగా అనిపించింది భార్గవికి.
   
    "మిమ్మల్ని తీసుకెళ్ళడానికి" అన్నారాయన.

    "అదేమిటి నాన్నా! మేము రావడానికి వీలుపడదని ఉత్తరం రాశాంగా అనవసరంగా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చారు".
   
    "ఖర్చుదేముందిలేమ్మా పర్సనల్ గా వచ్చి పిలవలేదనీ అల్లుడు ఏమయినా అనుకున్నాడేమోనని అంది మీ అమ్మ అందుకే వచ్చాను అందరూ అడుగుతున్నారు".
   
    'అంతేగాని మీకు నన్ను చూడాలని మాత్రం లేదు. పదిమందిలో అవమానం జరుగుతుందని భయం అంతే' మనసులోనే అనుకుంది.
   
    "పోనీలెండి మీకూ మొదటి పండగేగా వెళ్ళిరండి, నేనున్నాగా యిక్కడ పనులు చూసుకోవడానికి" అంది పెద్దాడపడుచు.
   
    "అబ్బే! బ్యాంకులో కస్టమర్స్ వీక్ సెలవు దొరకదు. మరోసారి వస్తాంలే  మామగారూ! పండక్కే రావాలనేం లేదుగా" అంటూ తప్పించేశాడు శ్రీరామ్.
   
    "పోనీ నువ్వెళ్ళి నాలుగు రోజులుండి రామ్మా" అన్నాడు మామగారు.
   
    "నేను రాను. తర్వాత ఎప్పుడైనా వస్తాంలే నాన్నా!" అంది భార్గవి. భర్తతోపాటు వెళ్ళాలనే కోరిక తప్ప, వెళ్ళీ ఆ యింటిలో ఆనందించాలన్న కోరికలేదు.
   
    "మా వదిన అపర సీతాదేవి, భర్తను వదిలి పుట్టింటికైనా వెళ్ళదు. పెళ్ళయి వచ్చింది మొదలు ఆ యింటి మొహం చూడలేదు" అంది యామిని అది వ్యంగ్యమో, పొగడ్తో అర్ధంకాలేదు భార్గవికి. ఆమె మొహం ఎర్రబడటం చూసి గర్వంగా నవ్వాడు శ్రీరామ్.
   
    "మీరు వెళ్ళిరండి మామయ్యగారూ! సెలవు దొరకగానే భార్గవిని తీసుకుని వస్తాలెండి" సర్దిచెప్పేశాడు మామగారికి.
   
    భార్గవి చేతిలో కొంత డబ్బు పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పి వెళ్ళిపోయారాయన.
   
    పదిమందీ ఏమనుకుంటారోనన్న భయం ముందు ఖర్చు ఎంతయిందన్న విషయం ప్రాముఖ్యం వహించదు కాబోలు. అదే తన యింట్లో వున్నప్పుడు కాసింత ప్రేమగా, ఆప్యాయంగా, ఎప్పుడైనా ఓ పది రూపాయలు తన చేతిలో పెట్టుంటే ఎంత సంతోషించేది? తండ్రంటే అభిమానమూ, గౌరవమూ కూడా చచ్చిపోయేలా చేసుకున్నాడెందువల్ల! బహుశా ఇప్పుడాయన తనను చూసి గర్వపడుతున్నాడేమో.
   
    "ఏమేవ్ ఇన్నాళ్ళకు అది నా కూతురనిపించుకుంది. అత్తవారింట్లో అందరూ దాన్ని నెత్తికెక్కించుకునేవాళ్ళే సీతామహాలక్ష్మి అంటున్నారంతా అదికూడా ఇంటి బాధ్యత అంతా తనమీద వేసుకుని చిరునవ్వుతో సహిస్తోంది. ఇంటిలో మనం పెంచిన తీరు అలాంటిది మరి" అని గర్వంగా చెప్పుకుంటాడు వెళ్ళగానే.
   
    పక్కింటి పార్వతమ్మ తప్పకుండా అడుగుతుంది. "పండక్కైనా రాలేదా మీ అమ్మాయి?" అని.
   
   
    "వాళ్ళింటిలో దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారటమ్మా మీ అన్నయ్యగారు ఎంత బ్రతిమాలినా ససేమిరా పంపమన్నారట. అది లేకపోతే వాళ్ళకు పండగ సరదాగానే వుండదట" అంటూ గొప్పగా చెప్పుకుంటుంది తల్లి.
   
    "ఏమిటి వదినా అంతగా ఆలోచిస్తున్నావ్? మీ నాన్నగారితో వెళ్ళలేదని దిగులుగా వుందా?" యామిని మాటలకు యీ లోకంలోకి వచ్చింది.
   
    "అబ్బే, అదేంలేదు. ఆమెకు వాళ్ళింటి ధ్యాస అంతగా వుండదు. వాళ్ళ నాన్నగారిచ్చిన డబ్బుతో ఏం కొనుక్కోవాలా అని ఆలోచిస్తున్నట్లుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి చేతినుంచి డబ్బు అందుకోవడం ఆమెకు అపురూపమైన విషయం" సమాధానం శ్రీరామ్ చెప్పాడు.
   
    పెళ్ళికాకముందు మొండితనం ఇంకా వున్నట్లయితే మాటకుమాట చెప్పేదే. ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళిపోయింది.
   
    అన్నీ వుండీ, అందరూ వుండీ అనాధ అయిపోయినట్లు, కారడవిలో దారీ తెన్నూ లేకుండా నడచి వెళుతున్నట్లు...
   
    లోపలికి వెళ్ళిపోయింది.
   
                                 4
   
    భార్గవికి నవంబరు, డిసెంబరు నెలలు చాలా భారంగా గడిచాయి. బ్యాంక్ లో పని చాలా ఎక్కువగా ఉంటుందని అర్దరాత్రి దాటాక గాని యింటికి రావడంలేదు శ్రీరామ్. డిసెంబరు నెల చివరి వారంలో కేవలం రెండు రాత్రులే వచ్చాడతడు. ఆస్త్మా పేషెంటయిన మామగారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. హాస్పిటల్ చుట్టూ తిరగడం భార్గవి పనైంది. ఆయన పడక వేయడంతో ఒక్క నిమిషమైనా ఇల్లు వదలి వెళ్ళడానికి వీలులేదు. మందులు తీసుకురావాలన్నా పక్కింటిపిల్లలను బ్రతిమాలాలి. ఇంటిపనులు- బయటిపనులు చేసుకోవడంతో సతమతమయిపోయింది. చుట్టు ప్రక్కల వాళ్ళతో పరిచయం అవడంతో ఆమెకు తెలియకూడని విషయాలు చాలా తెలిశాయి.
   
    ఆ చుట్టుప్రక్కల బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు చాలామంది వున్నారు. అందులో గుమాస్తాలూ, ఆఫీసర్లూ కూడా వున్నారు. కాని ఎవరూ శ్రీరామ్ లా బ్యాంకుకి అంకితమయిపోలేదు. ఎంత పనున్నా ఏడింటికల్లా ఇంటికి వచ్చేస్తారు. సెలవు రోజులు భార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. ఆఫీసువేళల్లో కూడా మధ్యలో పనుంటే వచ్చి వెళతారు. బ్యాంక్ ఉద్యోగి భార్యంటే అందరిలోనూ గౌరవం కూడా వుంది. కాని ఒక ఆఫీసరు అయిన శ్రీరామ్ పట్ల ఎవరూ గౌరవపూర్వకంగా మాట్లాడరు.
   
    జనవరి ఫస్టున సెలవురోజు క్రితం రోజు సాయంత్రం నించే అందరి ఇళ్ళల్లో హడావుడి కనిపించింది. కాని శ్రీరామ్ ఇంటికి రానేలేదా రాత్రి. ఉదయం వచ్చినా అలసటగా వుందని పడుకున్నాడు. లేచి భోజనం చేసి మేనేజరుగార్ని కలవాలంటూ మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ రావడం అర్ధరాత్రికే.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra