Home » Vasundhara » Vasundhara Kadhalu - 10

 

    ఆ ప్రయత్నంగా వీరభద్రానికి అతని గురించి ఉంగరాల జుట్టు అన్న పేరు స్పురించింది. అయినప్పటికీ "నా మనస్తత్వం వేరు. మీ పేరు చెప్పండి" అన్నాడు.
    "మీ మనస్తత్వానికీ నేను పేరు చెప్పకపోవడానికి ఏమీ సంబంధం లేదు."
    వీరభద్రం పేరు విషయం వదిలిపెట్టి అతనితో యితర విషయాలు చాలా మాట్లాడాడు.
    ఉంగరాల జుట్టు చాలా సరదా అయినవాడు. వీరభద్రం అతని కంపెనీ బాగా ఎంజాయ్ చేశాడు. నిజం చెప్పాలంటే అతనితో మాట్లాడ్తున్నంత సేపు వీరభద్రానికి టయిం తెలియలేదు.
    "ఒక చిన్న సందేహం.- మొట్టమొదట నన్ను నువ్వుని అన్నారు. తర్వాత మీరు మీరని సంబోధించడం మొదలుపెట్టారు. ఈ మన్ననకు కారణం?" అడిగాడు వీరభద్రం.
    "చాలా సింపుల్. మీ యింట్లో నన్ను ఎదురుచూడనివ్వమనగానే అందరి పైనా నాకు గౌరవం పెరిగింది" అన్నాడు ఉంగరాల జుట్టు.
    వీరభద్రం మరికాస్త ఆశ్చర్యపడి "ఒకవేళ మా అమ్మగారు ఒప్పుకోకపోతే ఏం చేసి వుండేవారు" అన్నాడు.
    "ఈ వీధిలోనే నిఘా వేసే వాణ్ణి. అడిగినవాళ్ళందరికి నేను సిఐడీ ఆఫీసర్నీ - సాంబశివరావు గారిపై నిఘా వేస్తున్నాననీ చెప్పేవాడిని. అందువల్ల నాకేమీ నష్టం లేదు. ఉంటె గింటే "అని అర్ధోక్తిలో ఆగి వీరభద్రం వంక చూసి అదోలా నవ్వాడతను."
    ఆ నవ్వు చూస్తూ "ఉంగరాల జుట్టు సామాన్యుడు కాడు" అనుకున్నాడు వీరభద్రం.

                                     4
    రాత్రి ఎనిమిది దాటినా సాంబశివరావు రాలేదు. వీరభద్రం తల్లి ఉంగరాల జుట్టు ను బలవంత పెట్టి భోజానానికి చేశాడు. భోజనాలై పోయాక అతడు మళ్ళీ హాల్లోకి వెళ్ళి పోయాడు. వీరభద్రం అతనికి ఓ రెండు ఇంగ్లీషు నవల్సిచ్చాడు.
    "తెలుగువి లేవా?" అన్నాడతను.
    "తెలుగులో మంచి నవల్సు రావు. అందుకని అవికోనను" అన్నాడు వీరభద్రం . ఆ మాటలన్నప్పుడు అతని ముఖంలో రవంత గర్వం కనబడింది.
    "ఇంగ్లీషు మనకు సరిగ్గా రాదు. వాళ్ళ సంప్రదాయాలు మనకు సరిగ్గా తెలియవు. ఈ రెండు కారణాల వల్లా మనకు ప్రతి ఇంగ్లీషు నవలా బాగానే వుంటుంది. మనకు మన సంప్రదాయాలు కూడా తెలియవు. మన నవల చదివి అందులోని గొప్పతనాన్నర్ధం చేసుకునేటంత ఓపికా, భావ పరిజ్ఞానం మనకు లేవు. అందుకే మన నవలలు మనకు నచ్చావు. నేను మాత్రం తెలుగు నవలలు మాత్రామే చదువుతాను. చాలా వరకు నచ్చాయి --"
    వీరభద్రం అదోలా నవ్వి --" ఇంగ్లీషు నవల చదవనంత కాలమూ తెలుగు నవల బాగానే వుంటుంది. ఆ విషయం నేనూ ఒప్పుకుంటాను --" అన్నాడు.
    ఉంగరాల జుట్టు ఒకసారి కడుపు మీద చేత్తో రాసుకుని "మీరు మాన నవల్ను పరభాషకు చెందిన వాటితో పోల్చి చిన్నబుచ్చడం వల్లనో ఏమో నాకు కడుపులో తిప్పుతోంది" అన్నాడు. అతని ముఖం చూస్తె బాధను అణుచుకునెందుకు ప్రయత్నిస్తున్నాడనిపించింది.
    "మన భాష ఒక్కటే గొప్ప అనుకోవడం సంకుచిత మనస్తత్వం --" అన్నాడు వీరభద్రం.
    "కావచ్చు, కానీ ప్రజారాజ్యానికి అదే అవసరం" అన్నాడు ఉంగరాల జుట్టు. ఈ పర్యాయం అతని ముఖంలో బాధ దాగలేదు. వీరభద్రం అతన్ని ఏదో ప్రశ్నించే లోగా 'అబ్బా" అని మూలిగాడు ఉంగరాల జుట్టు.
    "నేనేదో జోక్ అనుకున్నాను. మీకు కడుపులో నిజంగానే బాధగా ఉందా?" అన్నాడు వీరభద్రం అనుమానంగా.
    "నేను కడుపులో విషాన్నైనా దాచుకోగలను గానీ బాధను మాత్రం దాచుకోలేను. అబ్బా! నాకేమయింది ?' అంటూ కాస్త గట్టిగానే అరిచాడతను.
    వీరభద్రం భయపడి లోపలకు పరుగెత్తాడు. అతను తల్లితో తిరిగొచ్చేసరికి సోఫాలో పడుకుని మెలికలు తిరుగుతున్నాడు ఉంగరాల జుట్టు.
    "ఏమైంది బాబూ?" అందావిడ.
    "నొప్పి, భాధ భరించలేక పోతున్నాను...." అంటూ అరిచాడు ఉంగరాల జుట్టు.
    "భద్రం! పరుగెత్తుకు వెళ్ళి డాక్టర్ని పీల్చుకుని రా" అంది వీరభద్రం తల్లి.
    వీరభద్రం అక్కణ్ణించి పరుగెత్తాడు. స్కూటరు మీద డాక్టరు యింటికి మూడు నిముషాల్లో చేరుకొన్నాడు. డాక్టరు యింట్లోనే వున్నాడు భార్యతో సరసాలాడుతున్నాడు.
    "మీరింట్లో ఉండడం నా అదృష్టం. అర్జంటుగా నాతొ రావాలి. మా యింటికి అతిధిగా వచ్చిన ఒకతను భోం చేసి మెలికలు తిరిగి పడిపోయాడు--" అన్నాడు వీరభద్రం.
    డాక్టరు బయలు దేరుతుంటే " - పేషెంట్ల అదృష్టం - నాకు దురదృష్టం " అనుకుంది డాక్టరు భార్య. సాంబశివరావు యింట్లో కేసంటే డాక్టరు కి అదృష్టమే మరి! అందుకని అయన ఉత్సాహంగానే వెళ్ళాడు.

                                      5

    "ఇప్పుడు కాస్త తేలిగ్గా ఉంది" అన్నాడు ఉంగరాల జుట్టు. అప్పటికి డాక్టరు వెళ్ళి గంట దాటింది. టైము పదకొండు కావొస్తోంది. సాంబశివరావు యింకా రాలేదు.
    వీరభద్రం అతనికి పక్క వేరే గదిలో ఏర్పాటు చేసి ఆ విషయం చెప్పాడు.
    "నేను హాల్లోనే పడుకొంటాను --" అన్నాడు ఉంగరాల జుట్టు.
    "ఎందుకని?"
    "సాంబశివరావు గారు వస్తే హాల్లోంచే కదా ఇంట్లోకి వస్తారు. గదిలో ఉంటె వెంటనే ఆయన్ను కాంటాక్టు చేసే అవకాశం పోతుంది -"
    వీరభద్రం ఆశ్చర్యం గా " అంత అర్జంటైన పని ఏమిటో సాక్షాత్తూ సాంబశివరావు గారి కొడుకు నైన నాక్కూడా చెప్పకూడదా?" అన్నాడు.
    "చెప్పకూడదు" అన్నాడు ఉంగరాల జుట్టు.
    "నాన్నగారు యింటికి రాగానే మిమ్మల్ని కలిసే ఏర్పాటు చెస్తాను గానీ మీరు మాత్రం హల్లో పడుకోవద్దు. యిక్కడ చాలా చలిగా ఉంటుంది" అన్నాడు వీరభద్రం.
    "పని మీద ఉన్నప్పుడు హిమాలయా పర్వతాల్లో బట్టల్లేకుండా తిరగ్గలను నేను-"
    "సరేలెండి , ఇవి హిమాలయా పర్వతాలనీ మాత్రం పొరబడకండి." అంటూ తన జోకుకు తనే నవ్వేశాడు వీరభద్రం.
    ఆ సమయానికి ఎవరో తలుపు తట్టారు.
    "అమ్మయ్య - ఇప్పటికైనా వచ్చాడు" అని నిట్టుర్చాడు ఉంగరాల జుట్టు.
    "ఆ వచ్చింది నాన్నగారు కాదు--" అన్నాడు వీరభద్రం.
    "ఎలా చెప్పగలరు?" అన్నాడు ఉంగరాల జుట్టు చిరాగ్గా.
    "నాన్నగారు తలుపు తట్టే పద్దతి వేరు" అంటూ వీరభద్రం వెళ్ళి తలుపు తీశాడు. అక్కడ కనబడిన అపరిచితుడిని చూసి "ఎవరండీ మీరు?" అనడిగాడు.
    "నా పేరు శంకర్రావు.ఇది రఘునాధరావుగారిల్లెనా?" అంటూ గట్టిగా అరిచాడతను.
    "అబ్బా -- అంత గట్ట్టిగా అరవడమెందుకు? నాకేం చెవుడు లేదు. ఇది రఘునాధరావుగారిల్లు కాదు. సాంబశివరావు గారిల్లు" అన్నాడు వీరభద్రం.
    "ఏమైతేనెం? వచ్చిన పని అయింది. విషయం తెలిసింది" మళ్ళీ గట్టిగానే అని అక్కణ్ణించి వెళ్ళిపోయాడతను.
    వీరభద్రం తలుపులు వేసి వచ్చాక "వచ్చిందేవరు?" అనడిగాడు ఉంగరాల జుట్టు.
    'అంత గట్టిగా అరిచాడు వినపడలేదా?" అన్నాడు వీరభద్రం విసుగ్గా.
    "లేదు" అన్నాడతను.
    వీరభద్రం చెప్పాడు.
    ఉంగరాల జుట్టు టైం చూసుకున్నాడు. "మీ నాన్నగారీ రాత్రికి యింటికి రారనుకుంటున్నాను....--" అన్నాడు.
    "నేనేమీ అనుకోవడం లేదు --" అన్నాడు వీరభద్రం.
    "మీ నాన్నగారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. ఇష్టం వచ్చినప్పుడు యింటికి వచ్చి పోతుండం సంసారుల లక్షణం కాదు. ఓ టైమూ, ఓవేళ పాళా ఉండాలి."
    "సంసారుల లక్షణాలకు నిర్వచనాలు లేవు. ఎవరి పద్దతి వారిది. మా ఇంట్లో మా నాన్నగారిని విమర్శించకండి -" అన్నాడు వీరభద్రం.
    "విషయం చెబితే విమర్శ అనుకుంటున్నారు. సరేలెండి. నా అదృష్టం బాగాలేదు. నేను మీ నాన్నగారిని మరోసారి కలుసుకుంటాను. ఈవేల్టికి సెలవు తీసుకుంటాను" అన్నాడు ఉంగరాలజుట్టు.
    "మీరు వెళ్ళిపోతారా?" అన్నాడు వీరభద్రం. అతనికి కలిగిన ఆశ్చర్యం యింతా అంతా కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఉంగరాల జుత్తు తండ్రి వచ్చేవరకు తన యిల్లు వదిలి పెట్టడని అతను అనుకున్నాడు.
    'అవును -- వెళ్ళిపోతాను -- ..." అంటూ అతను లేచి నిలబడ్డాడు.
    "ఎందుకని?"
    "నా ఓర్పుకు అంత ముండదనుకున్నాను. కానీ ఉందని ఇప్పుడే తెలిసింది-"
    "చాలా అర్జంటు పని అన్నారు. కలుసుకు తీరాలన్నారు-"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra