Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

   

      తరువాత వంగి, ఆ కాగితాలు తీసి మళ్ళీ కవర్లో పెట్టేసి, యధాస్థానంలో పెట్టేశాడు. ముందుగదిలోకి వచ్చి కూర్చున్నాడు. ఆఫీసులో పనితోనూ, ఇంటికి రాగానే ఈ ఉత్తరం ఇచ్చిన షాక్ తోనూ మనసంతా స్థబ్ధమై- నిస్త్రాణగా నిద్ర పట్టినట్టయింది.
   
    "ఏమిటి ఎంత సేపయింది మీరొచ్చి" అంటూ మాధవి బెడ్ రూమ్ లోంచి బయటకొచ్చింది.
   
    "ఇప్పుడే, ఏం?"
   
    "మీరు తొందరగా రావటం మంచిదైంది. మీకో విషయం చెప్పాలి".
   
    "ఏమిటి?"
   
    "ఇదిగో ఈ ఉత్తరం చదవండి".
   
    "సారీ మాధవి, ఇంకొకరి ఉత్తరాలు చదవటం తప్పని తెలిసినా చదివాను...ఇప్పుడే".
   
    "మొత్తం అంతా పూర్తిగా చదివారా?"
   
    "మొత్తం అంతా?"
   
    "మీకేమైనా అర్ధమైందా? కొంచెంసేపు పవిత్రమైన స్నేహం అంటాడు. ఇంకొంచెంసేపు గులాబిరేకుల్లాటి పెదాలు అంటాడు. ఒకవైపు తెల్లచీరంటాడు- మరొకవైపు స్వచ్చమైన మనసు అంటాడు".
   
    "అర్ధం చేసుకున్నావుగా, అదే చాలు మాధవీ".
   
    "అర్ధం చేసుకోకపోవటమేమిటండీ-వీడేమైనా శంకరాభరణం శంకరశాస్త్రీ నేను మంజుభార్గవి అనుకున్నాడా? కేవలం మంచి స్నేహితులుగా వుండటానికి! భరతనాట్యం నేర్చుకునే పెర్సనాలిటీనా నాది మీరే చెప్పండి. డైటింగ్ చేయలేక చస్తుంటే-"
   
    "స్నేహంలో మొదటిమెట్టు ఆకర్షణ మాధవీ!! ఆకర్షణలో దగ్గరవటానికి మొదటి మెట్టు అవతలివారిని పొగడటం! రెండోది తాను మానసికంగా ఒంటరివాడిని అని ప్రకటించుకోవటం".
   
    "అంత ఒంటరివాడైతే పెళ్ళిచేసుకొమ్మనండి అయినా ఇంగ్లీషు కూడా సరిగ్గారాదు. I Likes You అంటాడు- I expects అంటాడు. పైగా వదులుగా వున్న లాల్చీ పైజమా వేసుకోవటం ఇష్టమట. ఇంకో రెండు ఉత్తరాలు పోయాక, అవి కూడా వేసుకోకుండా స్నేహితురాల్తో మాట్లాడటం ఇష్టమని వ్రాస్తాడేమో......పవిత్రమైన స్నేహంలో".

    "నువ్వు కాబట్టి అర్ధం చేసుకున్నావు మాధవీ! అతగాడి ఉత్తరం చదువుతే, అందులో భావుకత్వం, సిన్సియారిటీ కన్నా "ట్రీకిష్ నెస్సే" ఎక్కువ కనపడింది. అలాటిదానికి పడిపోకుండా వుండగలిగేవాళ్ళు ఆడాళ్ళలో అయిదు శాతం కన్నా ఎక్కువ వుండరు".
   
    "అవును పాపం కష్టాల్లో వున్నాడే అని తల్లిలాగా దగ్గరికి తీసుకుంటే మీ గుండెలు చాలా ఎత్తుగా వున్నాయి అనటానికి కూడా వెనుదీయడు. వెనుదీయటం ఏమిటి- వాడే అన్నాడుగా మీ గుండెల గురించి ఏమైనా అంటే మీక్కోపం వస్తుందేమో అని, రానివ్వండి సాయంత్రం వస్తానన్నాడుగా చెప్తాను...."
   
    "ఎంతసేపైంది మీరొచ్చి- "సడెన్ గా ఆ మాటలకి కళ్ళు విప్పాడు రవితేజ. మాధవి బెడ్ రూమ్ లోంచి బైటకొస్తూ అడుగుతూంది. క్షణంపాటు రావితేజకి ఏం జరిగిందీ అర్ధంకాలేదు. ఇప్పటివరకూ జరిగింది కల అని క్రమంగా అర్ధమైంది. అయితే భార్యాభర్తల మధ్య సంభాషణ మాత్రమే కలా? లేక ఈ ఉత్తరం తను చదవటం కూడా కలేనా అన్నది అర్ధంకాలేదు. కొంచెం తల పక్కకి వంచి చూస్తే బెడ్ రూమ్ లో కవరు లేదు. కానీ 'ఎంతసేపైంది మీరొచ్చి' అని అడిగే మాధవి ప్రశ్నలో తడబాటు చూస్తే ఆమె ఆ కవర్ని తీసి లోపల పెట్టిందేమో అన్న అనుమానం నిశ్చయంగా కలుగుతుంది. మొత్తంమీద తను ఉత్తరం చదవటం వరకూ యదార్ధమే తరువాత సంభాషణంతా కల. కనీసం తన మనసు వూహించిన పరిణామం అది!
   
    ..... ఉత్తరంలో ప్రతీ అక్షరం అతఃడికి గుర్తుంది. మనసు కుతకుతా ఉడుకుతూంది. అందులో ఆఖరి పేరా గుర్తొచ్చి, చప్పున తలెత్తి భార్య వంక చూశాడు. ఇంకా ఆమెలో పూర్తిగా అలజడి తగ్గినట్టు లేదు. టీ తీసుకురావటం కోసం లోపలి వెళ్తూంది. ఆమె అప్పుడే స్నానంచేసి నల్లబోర్డరున్న చీరకట్టుకుంది తెల్లచీర. నల్లంచు ...తె...ల్ల... చీ...ర.
   
                             22
   
    రవితేజ టెక్స్ టైల్స్ వారు తమ బోర్డు మీటింగులో కంప్యూటరైజ్ద్ అద్దాలు ప్రవేశపెట్టటానికి తీసుకున్న నిర్ణయం- సరీగ్గా అయిదు నిముషాల్లో చెంచురామయ్యకు తెలిసిపోయింది.
   
    "ఇదేదో మనకి తెలియని కొత్తదిగా వుందే!" అన్నాడు డైరెక్టర్స్ లో ఒకరు తను చదివిన వివరాలు చెప్పాడు. చెంచు రామయ్య అంతా శ్రద్దగా విని తల అడ్డంగా వూపుతూ, "ఇది ఫెయిల్ అవుతుంది" అన్నాడు.
   
    "ఎందుకు?"
   
    "ఆడాళ్ళని అద్దం ముందు నిలబెట్టి వరసగా మీటలు నొక్కేస్తూ, 'నువ్వీ' చీరలో' ఇలాగుంటావు' అని తొందర తొందరగా చెప్పేస్తూ పోతే వాళ్ళకి నచ్చదు. పదిమందితో కలిసిరావాలి. రెండొందలు చీరలు బైటకు తీయించాల. మన సేల్స్ మెన్ చేతులు పడిపోవాల. అప్పుడుగానీ వాళ్ళకి సంతృప్తి వుండదు. చేత్తో అంచులు ముట్టుకుని నలిపేస్తేగానీ నాణ్యత పరిశీలించినట్టు వుండదు వాళ్ళకి. అట్లాంటివి వంద చీరలు పట్టుకుని చూస్తే తప్ప ఒక చీర కొన్నట్టు వుండదు".
   
    అక్కడున్న డైరెక్టర్ కి అతని వాదన తప్పనిపించింది. కస్టమర్లు కూడా మారారు. ఇంతకుముందున్నంత టైమ్ ఈ కాలంలో ఆడాళ్ళకి వుండడం లేదు. ముఖ్యంగా వందా నూటయాభై రూపాయల చీరకోసం గంటలకొద్దీ షాపుల్లో వెదికే ఓపిక ఇప్పుడు ఎవరికీ వుండడం లేదు. కానీ ఈ ఆలోచననీ తమ మేనేజింగ్ డైరెక్టర్స్ కి చెప్పే ధైర్యం అతడికి లేదు.
   
    'కాలమే నిర్ణయిస్తుంది కదా' అని వూరుకున్నాడు.
   
    ఒకే రంగంలో ఉన్నప్పుడు తనకన్నా అవతలివాడు తెలిలివైన ప్లాన్ వేశాడని ఒప్పుకోవటానికి చాలా బాలన్స్ ఆఫ్ మైండ్ వుండాలి. తమ మేనేజింగ్ డైరెక్టర్ కి అధిలేదని ఆ డైరెక్టర్ కి తెలుసు.
   
                           *    *    *
   
    మసక చీకట్లు కమ్ముతున్న వేళ మనసులోకూడా ఆ చీకటి ముసురుతున్న వేళ-
   
    నగరంలోకెల్లా ఖరీదైన బార్ లో, ఒకమూల టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చొని వున్నాడు రవితేజ. అప్పటికి అతడు నాలుగో పెగ్ లో వున్నాడు. బార్ నిర్మానుష్యంగా వుంది. ఇంకా ఆరున్నర కూడా కాకపోవటం చేత బార్ నిర్మానుష్యంగా వుంది.
   
    మనిషి విజయానికీ-మనసులో ఆనందానికీ సంబంధంలేదు.
   
    విజయంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆ ఆనందాన్ని అనుభవించాలంటే, అన్ని పరిస్థితులూ అందుకు సహకరించాలి. ఒకరకంగా చెప్పాలంటే విజయం ఎక్కువయ్యేకొద్దీ, దానివల్ల వచ్చే టెన్షన్ తో విషాదం కూడా ఎక్కువవుతుందేమో! అయితే వ్యాపారపరంగా ఎన్ని చిక్కులు వచ్చినా, ప్రమాదాలు వాటిల్లినా దాన్ని ఎదుర్కోవటానికి అతడు సంసిద్దుడయ్యే వున్నాడు. కానీ మానసికంగా అతి సున్నితమైన ఈ బాధ నరనరాల్లోనూ వ్యాపిస్తోంది.
   
    అతడి 'ఊగో'కి దెబ్బ అది పురుషుడికి అంతకన్నా బాధ మరొకటి వుండదు. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పెర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు-ఇవేమీ ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని, 'అతడు గుర్తించాడా లేదా?' అన్నదే ఆమెకి కావలసింది. ఎప్పుడైతె తనని అతడు గుర్తించటం మానేశాడో, తన ఉనికికి ప్రాధాన్యత ఇవ్వటం మానేశాడో, అప్పట్నించి ఆమెకి కూడా అతడిమీద ఇంటరెస్ట్ పోతుంది. అతడు భర్తగానీ, మరెవ్వరైనా గానీ- అతడినుంచి ఆమె మానసికంగా దూరమై వేరే వ్యాపకంలో పడిపోతుంది. ఈ వ్యాపకం క్లబ్ కావచ్చు.. గుడికావొచ్చు... లేదా... సుధాకర్ లాంటివాళ్ళ స్నేహం కావచ్చు.
   
    స్త్రీకి కావలసింది గుర్తింపు ఒక్కటే.
   
    రవితేజ ఈ కోణంలోంచి ఆలోచించటం లేదు. అతఃడు మొగవాడు. ఆ పరిస్థితుల్లో లాజిక్ ఆలోచించగలగటం అందరికీ సాధ్యమవదు. చదువూ సంధ్యాలేక, పనీపాటల్లేక కేవలం ఆడవారిని ఆకర్షించే కళ, అందుకు సరిపడ టైమూ వున్న సుధాకర్ లాటివాడి మాటలకి మాధవి ఉత్తేజితమవటం అతడికి వ్యధని కలిగిస్తోంది. మళ్ళీ అక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సుధాకర్ లాటి ఎందుకూ పనికిరానివాడు కాకుండా ఒక ఉన్నత వ్యక్తి తన భార్యకి ఈ ఉత్తరం వ్రాసివుంటే అతడు సహించగలిగి వుండేవాడా? అదీ సాధ్యంకాదు. అప్పుడతడు ఇంకోరకంగా ఆలోచించేవాడు. మనిషి తను ఉన్న పరిస్థితులనుబట్టి, తన కెదురైన సమస్యల బట్టి తన ఆలోచనా విధానాన్ని పాటించడం అనాదిగా వస్తున్నదే. ఇప్పుడు ఈ ఉత్తరం వ్రాసింది సుధాకర్ కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాడంతే. రవితేజ మానవాతీత వ్యక్తిత్వం వున్న మహాత్ముడుకాదు. మరి అతడికి ఒక అమ్మాయి ఉత్తరం వ్రాసింది. లక్ష్మణరేఖ దాటి బయటికి రాలేక వెనక్కి తగ్గింది. మరి దాని గురించి అతడేమనుకున్నాడు? ఆ ఉత్తరంలో వున్న నిజాయితీ యిందులోలేదు- అనుకుని ఉంటాడు. అది నిజమే అయి ఉండవచ్చు.
   
    తప్పుకర్ధం ఏమిటి? నిజాయితీతో చేసిన తప్పు తప్పుకాదా? లేక బలమైన ఒక కారణం వుంటే అది తప్పుకాదా? ఆమె భర్త ఒక శాడిస్టో లేక తాగుబోతో లేక గుర్రప్పందాల పిచ్చి వున్నవాడో అయి వుండవచ్చు. ఆ దుఃఖం నుంచి స్వాంతన పొందటానికి ఆమె ఒక మార్గం ఎన్నుకొని వుండొచ్చు. మరి అది తనకి థ్రిల్ గానే అనిపించిందే! లావుపాటి అతని భార్యకి, మీకు భారతనాట్యం చేయతగిన శరీర లావణ్యం వుంది-అని ఒక పరాయి వ్యక్తి అంటే అది ఆమెకి అంతే థ్రిల్ కలగచేసి వుండవచ్చు. మన మానసిక స్థాయి బట్టి మనకి థ్రిల్ కలిగించే విషయాల స్థాయి కూడా మారుతుంది. కొందరు స్త్రీలకి చిత్రలేఖనం, వీణానాదం థ్రిల్ కలిగించవచ్చు. మరికొందరికి తను బీరువాలో వేయి చీరలు వుండడం థ్రిల్ కలిగించవచ్చు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra